Police Help సినిమాను తలపించే సీన్.. వేరే పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థిని..పోలీసులు ఏం చేశారో తెలుసా

తమిళనాడులో ఓ అమ్మాయి నీట్ పరీక్ష రాయడానికి వాస్తవ కేంద్రానికి బదులుగా మరో పరీక్ష కేంద్రానికి వెళ్లింది. దీంతో ఆమెను పోలీస్ సిబ్బంది తమ పెట్రోలింగ్ కారులో ఎక్కించుకొని సరైన సమయానికి కేంద్రానికి చేర్చారు. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. స్టూడెంట్ కి సహకరించిన పోలీసు సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు.

మే 7న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహించింది. ఈ పరీక్షకు తమిళనాడులో 20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తమిళనాడులోని అవడి సిటీ ట్రాఫిక్ పోలీసులు తప్పుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ స్టూడెంట్ ను గుర్తించారు. వెంటనే ఆమె వాస్తవ పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవడానికి సహాయం చేశారు. ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఆ అమ్మాయిని సెంటర్లోకి పంపిస్తున్న విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.

police help to student

సెంటర్ వెలుపల ఉన్న రోడ్డుపై వాహనాన్ని నిలిపి ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో ఆమె లోపలికి పరిగెత్తుతున్న దృశ్యాలు వీడియోలో గమనించవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిట్టురాణి బీఆర్‌ స్కూల్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వి.ఆనంది అవడిలోని జయగోపాల్‌ పాఠశాలలో పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అయితే, కేంద్రంలోని అధికారులు ఆమె అడ్మిట్ కార్డును పరిశీలించిన తర్వాత ఆమె ప్రవేశాన్ని నిరాకరించారు.

ఆనంది రాంగ్ సెంటర్‌కి వచ్చిన విషయాన్ని కేంద్రం వెలుపల ఉంచిన ఇద్దరు ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్ సిబ్బంది గమనించారు. వెంటనే తాను సరైన పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సహాయం చేశారు. ట్రాఫిక్ పోలీసులు విద్యార్థినిని కారులో కూర్చోబెట్టి, సరైన సమయంలో సరైన సెంటర్‌కి తీసుకెళ్లారు. సరైన పరీక్షా కేంద్రం, తిరుముల్లైవాయల్‌లోని వివేకానంద విద్యాలయం స్టూడెంట్ వెళ్ళిన మొదటి కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ధనశేఖరన్, దినేష్ కుమార్ సామిలను అవడి సిటీ పోలీసులు ప్రశంసించారు. సకాలంలో స్పందించి విద్యార్థిని పరీక్ష రాసేందుకు సహకరించిన వారికి నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను విజయ్ కుమార్ ఐపీఎస్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

అంబులెన్స్‌లో పరీక్ష రాసిన మరో అమ్మాయి: ఈ మార్చి ప్రారంభంలో, ముంబైకి చెందిన 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థి ముబాష్షిరా సయ్యద్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. మూడో రోజు పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు దాటుతున్న క్రమంలో ఆమె ఎడమ పాదం మీదుగా కారు దూసుకెళ్లింది. మిగిలిన పరీక్షలను కూడా పూర్తి చేయాలని ఆమె నిర్ణయించుకుంది.

అంబులెన్స్‌లో ఉండగా, ముబాష్షిరా తన రెండు గంటల సైన్స్ 2 (బయాలజీ) పరీక్షను పూర్తి చేసింది. నూర్సాబా అన్సారీ(స్క్రైబ్) సహాయంతో పరీక్ష రాసింది. సెయింట్ స్టానిస్లాస్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ ఆరోకియమ్మాళ్ ఆంథోనీ అంబులెన్స్ లోపల పరీక్షను పర్యవేక్షించగా, ఒక పోలీసు అధికారి ఒక ప్యూన్ బయట గార్డులుగా పనిచేశారు.

బీహార్ లోని కైమూరు జిల్లాలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ బాలికల బృందం పరీక్షా కేంద్రానికి పరిగెత్తుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఆలస్యంగా అవుతుండటంతో బాలికల బృందం పరుగులు తీశారు. సమయానికి రాకుంటే పరీక్షకు అనుమతించరని తెలిసి వారు పరుగెత్తారు. ట్రాఫిక్ జామ్ సమయానికి క్లియర్ కాదని వారు గ్రహించడంతో, వారు సమయానికి చేరుకోవడానికి పరీక్షా కేంద్రం వైపు పరుగెత్తారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 9, 2023, 19:31 [IST]
English summary
Student goes wrong exam center police helps to reach correct center
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+