మహీంద్రా స్కార్పియోపై డేంజరస్‌ స్టంట్స్‌.. ఒక్కసారిగా కిందపడిన విద్యార్థులు..!

ప్రస్తుతం సోషల్‌ మీడియా యుగం నడుస్తోంది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో యువత సోషల్‌ మీడియాలో క్రేజ్‌ కోసం విన్యాసాలు చేస్తున్నారు. కొన్నిసార్లు అవే ప్రమాదాలకు దారితీస్తున్నాయి. యువత సోషల్‌ మీడియా క్రేజ్‌ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్న కొందరిలో మార్పు రావడం లేదు.

తాజాగా జరిగిన ఓ ఘటనలో కొంత మంది యువతీ యువకులకు గాయాలయ్యాయి. అయితే ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం బయటకురాలేదు. వీడియో ఆధారంగా ఓ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కొందరు విద్యార్థులు మహీంద్రా స్కార్పియో కారుపైన నిల్చుని ఉన్నారు. మరికొంతమంది కారు ఎడమవైపున, ఇంకా కొందరు వెనుక బంపర్‌పైన నిల్చొని ఉన్నారు.

Students dangerous stunts on Mahindra Scorpio

అయితే విద్యార్థులంతా సందడిలో ఉండగా.. ఒక్కసారిగా మహీంద్రా స్కార్పియో కారు ముందుకు కదిలింది. దీంతో కారుపైన నిల్చున్న విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుమీద పడిపోయారు. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను రెడిట్‌ యూజర్‌ షేర్‌ చేయగా.. ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని గాయపడిన విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. కారుపైన, వెనుక నిల్చున్న వారు మాత్రమే కిందపడిపోయారు. అదే కారు ఎడమవైపున ఉన్నవారు కొంత అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రమాదం తప్పింది.

Students dangerous stunts on Mahindra Scorpio

విద్యా్ర్థులు సహా ఇంకా ఎవరైనా ఇలాంటి విన్యాసాలకు పాల్పడాలని భావిస్తే తొలుత సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి. నిపుణుల ఆధ్వర్యంలో వారి సలహాలతో చేయాలి. దాంతోపాటు పబ్లిక్‌ రోడ్లపై ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. మూసివేసిన రోడ్లు లేదా చిన్న మైదానాల్లో ఇటువంటి స్టంట్స్‌ చేయాలి.

ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యేందుకు ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. కొన్నిసార్లు చిన్న గాయాలతోనే బయటపడుతుండగా.. మరికొన్ని ఘటనల్లో తీవ్రంగా గాయపడుతున్నారు. పోలీసులు కూడా ఇటువంటి ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సీసీ కెమెరాలు, సోషల్‌ మీడియా వీడియోలు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానా విధిస్తున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు.

Students dangerous stunts on Mahindra Scorpio

ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంత మంది యువకులు రెండు వాహనాల్లో ఉత్తరాఖండ్‌లో ఇటువంటి విన్యాసాలు చేశారు. ఆ రోడ్డులో ప్రయాణించిన ఓ వాహనదారుడు ఆ వీడియోను రికార్డు చేసి పోలీసులకు ట్విట్టర్‌ (X) ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు కార్ల యజమానులకు లక్ష రూపాయల జరిమానా విధించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, September 16, 2023, 14:07 [IST]
English summary
Students dangerous stunts on mahindra scorpio and fell from the roof video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+