ఇంత చెత్తగా వాహనాలకు మార్పులు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?

By N Kumar

చాలా మంది ఆటోమొబైల్ ప్రేమికులు తమ కార్లు లేదా బైకులను వారికి నచ్చిన రూపంలోకి మార్పులు, కస్టమైజ్ చేయించుకుంటారు. ఇంత వరకు బాగానే ఉంది. కాని కొంతం మంది దీనిని మించి మరీ మోడిఫికేషన్లు చేసుకుంటారు. వాటి వలన ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ తమ వాహనాలకు అన్వయించుకుంటారు.

కొన్ని సార్లు అలాంటి అవసరం లేని మార్పులు ఏన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఇలా మనకు లేదా మన తోటి ప్రయాణికులకు ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. అందుకోసం క్రింది కథనం ద్వారా అతి చెత్త కారు లేదా బైకు మోడిఫికేషన్లు గురించి అందిస్తున్నాము, దయచేసి ఇలాంటి వాటిని మీరు అనుకరించకండి.

 10. హెడ్‌ లైట్లు

10. హెడ్‌ లైట్లు

సాధారణంగా ప్రతి కారు మరియు బైకు తయారీదారులు తమ వాహనాలకు కావాల్సిన పరిమాణంలో అనేక రకాలుగా పరీక్షించి లైట్లను రూపొందిస్తారు. అయితే చాలా మంది ఇతర వాహనాలకు చెందిన లైట్లను తమ వాటిలో అమర్చుకుంటారు. అందు వలన చీకటిలో ఎదురుగా వస్తున్న వాహన చోదకులు మిమ్మల్ని సరిగా గుర్తించలేరు. అందువలన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Picture credit: Xbhp

09. ఇండికేటర్లు

09. ఇండికేటర్లు

చాలా మంది తమ బైకులు మిగతా వారి కన్నా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు, అందులో భాగంగా ఇదిగో ఇలా చెత్త ఇండికేటర్లు అమర్చుకుంటారు. ఇండికేటర్లను ఆరెంజ్ రంగులో ఇవ్వడానికి కారణం పగలు మరియు రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనబడుతుంది. మీరు కనుక ఇలా తెలుపు రంగులో గల ఇండికేటర్లతో మోడిఫికేషన్ చేయించుకున్నట్లయితే పగటి పూట అవి వెలిగినా కనబడవు మరియు రాత్రి సమయాల్లో అవి వెలిగినా ఇండికేటింగ్ లైట్లు అని ఎవ్వరూ గుర్తించలేరు. తద్వారా ప్రమాదాలు చాలా వరకు సంభవిస్తాయి.

08. అద్దాలు

08. అద్దాలు

టూ వీలర్లలో ఎక్కువగా ఇలాంటి మోడిఫికేషన్ మనం గమినించవచ్చు. ముఖ్యంగా టూ వీలర్లకు కుడి, ఎడమ వైపుల హ్యాండిల్ మీద రెండు రియర్ వ్యూవ్ మిర్రర్‌లను అందిస్తాయి తయారీ సంస్థలు అయితే చాలా మంది వరకు వీటిని పూర్తిగా తొలగించి డ్రైవ్ చేస్తుంటారు. తద్వారా వెనుక జరిగే విషయాలను గమనించకపోవడం వలన చాలా వరకు ప్రమాదాలకు సంభవిస్తున్నాయి.

07. ఎగ్జాస్ట్ సిస్టమ్

07. ఎగ్జాస్ట్ సిస్టమ్

చాలా మంది తమ కార్లు మరియు బైకులో ఉన్న ఎగ్జాస్ట్ వ్యవస్థను మార్చేసి, ఇతర ఎగ్జాస్ట్ వ్యవస్థలను అమర్చుకుంటారు. తద్వారా ఎక్కువ పొగ మరియు శబ్దాన్ని అవి విడుదల చేస్తుంటాయి. ఇలాంటి మోడిఫైడ్ ఎగ్జాస్ట్ వ్యవస్థలను వినియోగించడం చట్ట విరుద్దం కూడా.

Picture credit: tokyomotors

06. రూపం మార్చేసి లోగో తగిలించడం

06. రూపం మార్చేసి లోగో తగిలించడం

ఫెరారి కారును కొనలేని వారు ఇలా మారుతి సుజుకి ఆల్టోకు రెండు వింగ్ డోర్లను ఏర్పాటు చేసుకుని మోడిఫై చేసుకుంటారు. అటు పిమ్మట మారుతి లోగో మీద ఫెరారి లోగోను అతికించేస్తారు. ఇది కొంచెం క్రియేటివిటిలా ఉన్నప్పట్టికీ ఫెరారికి తెలిసిందంటే చాలా పెద్ద దుమారమే లేపుతుంది. అందుకోసం వ్యక్తిగతంగా మోడిఫై చేసుకునే వారు అందరూ ఇతర సంస్థలకు చెందిన లోగోలను వినియోగించడం మానేయండి. ఎందుకంటే ఇది చట్ట విరుద్దం కాబట్టి.

Picture credit: motoroids

05. ఫ్రంట్ ఫోర్క్స్ మార్చేయడం

05. ఫ్రంట్ ఫోర్క్స్ మార్చేయడం

చాలా మంది బైకు ప్రేమికులు తమ బైకులకు ఎప్పుడూ ఏదో ఒకవిధంగా మోడిఫై చేస్తుంటారు. అందులో ఒకటి ఇలా ఫ్రంట్ ఫోర్క్స్ మార్చేయడం. పొడవాటి ఫోర్క్స్ ఉండటం వలన స్పీడ్ బ్రేకర్ల వద్ద అవి డ్యామేజ్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా హ్యాండిల్ బార్ చాలా ఎత్తులో ఉండటం వలన అధిక వేగంలో ఉన్నప్పుడు పట్టును కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువే.

04. హారన్లు

04. హారన్లు

శబ్ద కారకాలు, కొంత మంది వీటి పేరు వినగానే చెవిలో మీట నొక్కినట్లుగా ఉంటుంది. రోజు రోజుకీ ఈ హారన్ల చప్పుడు బాగా పెరిగిపోతోంది. తయారీ సంస్థలు అందించిన హారన్లను లాగిపడేసి, రకరకాల శబ్దాలను ఇచ్చే హారన్లతో మోడిఫైడ్ చేయించుకుంటున్నారు. తద్వారా మీ వాహనంలోని బ్యాటరీ అంతమవ్వడమే కాకుండా చాలా వరకు శబ్ద కాలుష్యాన్నినికి కారణం అవుతాయి.

Picture credit: hornblaster

03. పరదాలు

03. పరదాలు

కార్లలో బ్లాక్ ఫల్మ్ ఉన్న అద్దాలను వినియోగించకూడదని భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే చాలా మంది బ్లాక్ ఫిల్మ్‌ గల అద్దాలకు టాటా చెప్పి పరదాలను అమర్చుకుంటున్నారు. అంటే అలాంటి వారందరు కార్లలో అనధికారకంగా ఏవో తప్పులు చేయాలనే ఉద్దేశంతోనే కదా ఇలా పరదాలతో లోపలి దృశ్యాల్ని బంధిస్తున్నారు. మీరు అలాంటి వారు కాకపోతే మీ కార్లలో ఉన్న పరదాలను తొలగించండి. ఎందుకంటే పోలీసులు చిక్కారంటే మడతపెట్టేస్తారు, పరదాలను కాదు వాటిని కార్లలో వాడేవారిని.

Picture credit: bavariancar

02. నెంబర్ ప్లేటు

02. నెంబర్ ప్లేటు

చాలా మంది తమ వాహనానికి ఇచ్చిన నెంబర్‌ను రకరకాల డిజైన్‌లతో ప్లేటు మీదు ముద్రించుకుంటారు. అందులో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఆంగ్ల అక్షరాలలో వచ్చే విధంగా ప్రింటు చేయించుకుంటారు. ఒక్కోసారి అలాంటి నెంబర్లను గుర్తించడానికి చాలా సమయమే పడతుంది. మీరు ఇలా కారు నెంబర్‌‌ను ఎవరూ గుర్తించకుండా చూసుకుంటున్నారు అంటే ఏవో చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారనే అర్థం అవుతుంది. కాబట్టి నేడే మీ నెంబర్ ప్లేటు సాధారణగా మార్చేసుకోండి.

Picture credit: factly

 01. స్పాట్ లైట్లను వినియోగించడం

01. స్పాట్ లైట్లను వినియోగించడం

చీకటిలో మంచి లైటింగ్ ఉండాలి, కాని ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో కాంతిని వెలువరించే లైట్లను వినియోగించడం వలన ఎదురుగా వచ్చే వారికి దృష్టి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. తద్వారా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ.

ఇంత చెత్తగా వాహనాలకు మార్పులు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా ?
  • బాగా చూడండి ఇది మహీంద్రా వారి మోడిఫైడ్ ఎక్స్‌యువీ500 : మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • పాత వాటికి ప్రాణం పోస్తే ఇలాగే ఉంటాయి మరి

Most Read Articles

Read more on: #కారు #car
English summary
From Curtains To Scissor Doors: 10 Stupid Car Alterations People Do
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X