స్టైలిష్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటది! ఈ కారులో స్పెషాలిటీ ఏంటో మీరే చెప్పుకోండి చూద్దాం..

స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' గురించి తెలిసిన చాలా మందికి అతడు ఉపయోగించే కార్లు గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇటీవల కనిపించిన ఖరీదైన బ్లాక్ కలర్ 'ల్యాండ్ రోవర్' కారు వీల్ మధ్య భాగంలో 'AA' అని ఉండటం కనిపించింది.

ఇటీవల లింగస్వామి అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ షేర్ చేసిన ఫోటోలలో ఓ బ్లాక్ ల్యాండ్ రోవర్ కారు కనిపించింది. ఇది టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మోడిఫైడ్ ల్యాండ్ రోవర్ అని తెలుస్తోంది. చూడటానికి అద్భుతంగా కనిపించే ఈ కారులో గుర్తించదగిన ఒక ప్రదమైన అంశం ఏమిటంటే.. బ్లాక్ కలర్ వీల్ మధ్యలో ఉన్న AA (అల్లు అర్జున్) సింబల్.

Allu Arjun AA Symbol on Land Rover

వీల్ మధ్యలో ఉన్న ఈ లోగో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిజానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా యూత్ ఐకాన్ అనిపించుకున్న అల్లు అర్జున్ ఏం చేసిన అందులో ఓ స్టైల్ ఉంటుంది. గతంలో కూడా ఈయన సుమారు రూ. ఏడు కోట్లు ఖర్చు పెట్టి తనకు నచ్చినట్లుగా.. ఓ ప్రత్యేకమైన వ్యానిటీ వ్యాన్ తయారు చేసుకున్నాడు. ఈ వెహికల్ మీద, లోపలి భాగంలో కూడా AA సింబల్స్ ఉండటం గమనించవచ్చు.

గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర సీమలో పరిచమైన 'అల్లు అర్జున్' పుష్ప సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ విదేశాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. గతంలో సినీ చరిత్రలో గొప్ప రికార్డ్ క్రియేట్ చేసిన బాహుబలి సినిమాను అధిగమించాలని డైరెక్టర్ సుకుమార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Allu Arjun AA Symbol on Land Rover

అల్లు అర్జున్ గ్యారేజిలోని ఇతర కార్లు

అల్లు అర్జున్ గ్యారేజిలో అత్యంత ఖరీదైన అన్యదేశ్య కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ కార్లు.. రేంజ్ రోవర్ వోగ్, జాగ్వార్ కంపెనీకి చెందిన ఎక్స్‌జేఎల్, హమ్మర్ హెచ్ 2, మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఈ 350డీ, బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్6ఎమ్, ​వోల్వో ఎక్స్‌సీ90 టీ8 ఎక్స్‌లెన్స్, బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ జీటీ.

హమ్మర్ హెచ్2

అల్లు అర్జున్ గ్యారేజిలో చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన కారు హమ్మర్ కంపెనీకి చెందిన హెచ్2. అల్లు అర్జున్ కొనుగోలు చేసిన ఈ కారు చూడటానికి ఇతర కార్ల మాదిరిగా కాకుండా.. భారీగా ఉంటుంది. సినీతారలు, ఇతర సెలబ్రిటీలకు ఇష్టమైన ఈ కారు ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్). అద్భుతమైన డిజైన్ కలిగిన కారు మంచి ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందించడమే కాకుండా సాధారణ రోడ్లమీద కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

జాగ్వార్ ఎక్స్‌జేఎల్

అల్లు అర్జున్ గ్యారేజిలోని మరో కారు జాగ్వార్ కంపెనీకి చెందిన ఎక్స్‌జేఎల్. దీని ధర సుమారు రూ. 99.5 లక్షల కంటే ఎక్కువే అని సమాచారం. ఈ కారు మంచి డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. నిజానికి ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 13, 2024, 11:00 [IST]
English summary
Aa symbol on allu arjun land rover car wheel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+