పుష్పరాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

'పుష్ప.. పుష్ప రాజ్, తగ్గేదే.. లే' అంటూ యువతను ఉర్రూతలూగించిన మన 'పుష్ప రాజ్' (అల్లు అర్జున్) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే 'గంగోత్రి' సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'అల్లు అర్జున్' ఈ రోజు 'స్టైలిష్ స్టార్' గా ఎదిగి ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్నాడు.

అయితే ఇటీవల పుష్ప సినిమాతో వీర మాస్ గా కనిపించిన తరువాత, ఇప్పుడు ఒక ఖరీదైన కారులో చాలా క్లాస్ గా కనిపించాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

ఇటీవల 'అల్లు అర్జున్' హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన ఒక కార్యక్రమానికి అత్యంత ఖరీదైన లగ్జరి కారు 'రోల్స్ రాయిస్ కల్లినన్‌' (Rolls Royce Cullinan) SUV లో కనిపించారు. ఈ కారు వైట్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే అల్లు అర్జున్ 'రోల్స్ రాయిస్ కల్లినన్‌' SUV నుంచి దిగటం చూడవచ్చు. ఈ కారు ధర భారతీయ మార్కెట్లో సుమారు రూ. 7 కోట్ల కంటే ఎక్కువ.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

రోల్స్ రాయిస్ అంటేనే ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను తయారు చేసే కంపెనీ అని అందరికి తెలుసు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు మరియు ఇతర పారిశ్రామిక వేత్తలు ఈ రోల్స్ రాయిస్ కల్లినన్‌ కలిగి ఉన్నారు. ఇందులో అంబానీ ఫ్యామిలీ మరియు అజయ్ దేవ్ గన్ మొదలైన వారు ఉన్నారు. అంబానీ ఫ్యామిలీ ఏకంగా ఇలాంటి మూడు కార్లను కలిగి ఉంది.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

అల్లు అర్జున్ కొనుగోలు చేసిన ఈ కొత్త కల్లినన్‌ విషయానికి వస్తే, దీనికి సంబందించిన కస్టమైజేషన్స్ మొదలైన వాటి గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ వీడియోలో డోర్స్ ఓపెన్ చేసినప్పుడు లోపలి ఇంటీరియర్ బేజ్ కలర్ లో ఉండటం చూడవచ్చు. క్యాబిన్ కూడా చాలా ఫ్రీమియంగా ఉంది.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

'రోల్స్ రాయిస్ కల్లినన్' అనేది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టం కలిగి ఉన్న మొట్టమొదటి రోల్స్ రాయిస్ కారు. ఇది 6.75-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్డ్ వి 12 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 571 పిఎస్ పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కు జతచేయబడి ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

అల్లు అర్జున్ ఇప్పటికే తన గ్యారేజ్ లో రేంజ్ రోవర్, హమ్మర్ H2, జాగ్వార్ XJ L, వోల్వో XC90 మరియు మెర్సిడెస్ GLE 350d వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నాడు. అంతే కాకూండా అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఒక లగ్జరీ కారా వ్యాన్ కూడా కలిగి ఉన్నాడు. ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది తన కోసం ప్రత్యేకంగా తయారుచేయించుకున్నాడు. ఇది చూడటానికి ఒక చిన్న ఇంద్ర భవనం లాగా ఉంటుంది. ఈ కారా వ్యాన్ ధర రూ.7 కోట్లు.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

అల్లు అర్జున్ యొక్క హమ్మర్ హెచ్ 2 విషయానికి వస్తే, దీని ధర రూ. 75 లక్షలు. ఇది 393 బిహెచ్‌పి పవర్, 563 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 9.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. హమ్మర్ హెచ్ 2 యొక్క గరిష్ఠ వేగం గంటకు 190 కిలోమీటర్లు.

పుష్ప రాజ్ 'అల్లు అర్జున్' గ్యారేజ్‌లో చేరిన కొత్త అతిధి: ధర రూ. 7 కోట్లలకు పైమాటే..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్న తెలుగు సినీ నటులలో ఒకరు అల్లు అర్జున్. ఇప్పటికే ఉన్న ఖరీదైన కార్లకు తోడుగా మరో ఖరీదైన మరియు విలాసవంతమైన 'Rolls Royce Cullinan' కారు తన గ్యారేజిలో చేరింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాలో బిజీగా ఉన్నారు. ఇహి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త బైకులు మరియు కార్ల గురించి తెలుసుకోవానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Stylish star allu arjun buys a rolls royce cullinan suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X