సూట్‌కేస్ స్కూటర్‌ను రూపొందించిన మైక్రో స్కూటర్స్ యూకె

మైక్రో స్కూటర్క్ యూకె కంపెనీ ఎక్కువగా చిన్న పిల్లల కోసం స్కూటర్లను రూపొందిస్తుంది. అయితే, పెద్దవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మైక్రో లగేజ్ స్కూటర్ ఐదు కేజీల బరువు ఉండి. 100 కేజీల వరకూ బరువును మోయగలదు. ఇకపోతే దీని సూట్‌కేస్ నిక్షిప్త సామర్థ్యం 26 లీటర్లు. ఈ సూట్‌కేస్ స్కూటర్ ఉపయోగించడం చాలా సులువు.
సూట్‌కేస్ పైవైపున ఉండే హ్యాండిల్‌ను పైకి, కింది వైపున ఉండే చక్రాలు కలిగిన ఫుట్ ఫ్లాట్‌ఫామ్‌ను కిందికి లాగడం ద్వారా ఇది స్కూటర్‌లా మారిపోతుంది. స్కూటర్ వద్దనుకుంటే దీన్ని ఎంచక్కా మడిచిపెట్టి సూట్‌కేస్‌లా మార్చేసుకోవచ్చు. ఇకపోతే దీని ధర 250 యూరోలు, అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 15791.1 అన్నమాట. మరి ఈ సూట్‌కేస్ స్కూటర్ బావుందా..!


Click it and Unblock the Notifications








