జైలులో ఉంటూనే కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కొన్న వ్యక్తి! గతంలో ప్రియురాలి కోసం కోట్ల ఖర్చు

దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల మోసాలతో సంచలనం సృష్టించిన వారిలో సుకేశ్ చంద్రశేఖర్ పేరు వినని వారుండరు. దాదాపు రూ.200 కోట్ల కోట్ల విలువైన దోపిడీ రాకెట్‌కు సంబంధించి అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా అతను చేసిన పని సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తోంది. సాధారణంగా జైల్లో ఉన్న వ్యక్తి జీవితానికి సంబంధించిన వార్తలు మామూలుగా ఉంటాయి. కానీ సుకేశ్ మాత్రం మరో లెవెల్‌లోకి వెళ్లిపోయాడు. ఒక జైలులో ఉన్న వ్యక్తి అత్యంత ఖరీదైన విలాసవంతమైన కారు కొనుగోలు చేశాడు. జైల్లో ఉన్న ఒక వ్యక్తి కారును ఎలా కొనుగోలు చేశాడా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

జైలులో శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ కోట్ల విలువైన కొత్త రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సుకేష్ తన X పేజీ ద్వారా ఈ పంచుకున్నారు. ఈ పోస్ట్ చదివిన ప్రతి ఒక్కరూ జైలులో ఉన్న వ్యక్తి కారు కొనడం గురించి ఎలా పోస్ట్ చేయగలరని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై స్పష్టమైన వివరణను తెలియజేస్తూ సుకేశ్ తన పోస్టులో ప్రత్యేకంగా ఒక విషయాన్ని హైలైట్ చేశాడు.

Sukesh Chandrashekhar Bought Rolls Royce Spectre While In The Prison

అతని సోషల్ మీడియా పేజీలో ఇటీవల షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రకారం, సుకేశ్ ఇప్పుడు బ్రిటిష్ అల్ట్రా-లగ్జరీ బ్రాండ్ రోల్స్ రాయిస్ నుండి వచ్చిన **మొదటి ఎలక్ట్రిక్ కారైన "స్పెక్టర్"ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ పేజ్‌ను అతని వ్యక్తిగతంగా కాదు, అతని పీఆర్ బృందం నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. అయినా, జైలు గోడల మధ్యనుంచి ఈ స్థాయి ప్రకటన బయటికి రావడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఖరీదైన ఈ రోల్స్ రాయిస్ కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. స్పెక్టర్ ఎక్స్-షోరూమ్‌ ధర రూ.7.5 కోట్లు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రిక్ కారు. డిజైన్ విషయంలో ఆకట్టుకుంటుంది.కారు ముందు భాగంలో ఉన్న స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ, క్లాసిక్ రోల్స్ రాయిస్ సిగ్నేచర్ గ్రిల్, ఇవన్నీ వాహనానికి స్టైల్‌తో పాటు శక్తివంతమైన అధునాతన లుకింగ్‌ను అందిస్తుంది. పైకప్పు కూపేలా వాలుతూ టెయిల్‌గేట్ వరకు ఉంటుంది.

Sukesh Chandrashekhar Bought Rolls Royce

రోల్స్ రాయిస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కారైన స్పెక్టర్ లోపలి భాగం చూస్తే, అది నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ 4-సీటర్ల అల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన 102 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. స్పెక్టర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత సుమారు 530 కి.మీ వరకు ప్రయాణించగలదు, ఇది దీని లగ్జరీ సెగ్మెంట్‌లో ఒక గొప్ప కారు.

దీనిలో అందించిన ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 575 bhp పవర్, గరిష్టంగా 900 Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. సాంప్రదాయ ICE మోడళ్ల నుంచి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీని 23-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ప్రతీ రోల్స్ రాయిస్ మోడల్‌కు లాగే, స్పెక్టర్‌లో కూడా సూసైడ్ డోర్లు ఉంటాయి. కారులోకి అడుగుపెడితే, మీరు ఒక లగ్జరీ సూట్‌లోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.

ఇంటీరియర్‌లో ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీతో పాటు, డ్యాష్‌బోర్డ్‌ ఆకట్టుకుటుంది. సర్దుబాటు చేయగల ఎలక్ట్రిక్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ వంటివి ఉన్నాయి. ఈ కారు బ్యాటరీని 95 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి 34 నిమిషాల్లో 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. తొమ్మిది నిమిషాల ఛార్జింగ్‌తో ఇది 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. సున్నా నుండి 100 కి.మీ/గం వేగాన్ని ఇది కేవలం 4.5 సెకన్లలో మాత్రమే చేరుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 3, 2025, 12:30 [IST]
English summary
Sukesh chandrashekhar bought rolls royce spectre while in the prison details
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+