2000 కోట్ల డాలర్లు, 7000 కార్లు కలిగిన సంపన్నుడు సుల్తాన్ ఆఫ్ బ్రునెయి

By N Kumar

భూమ్మీద అత్యంత సంపన్నుడు ఎవరు అనగానే బిల్ గేట్స్ గుర్తొచ్చాడు కదా...? ఒక్క సారి ఈ రాజు గారి గురించి చదవండి ఇతను ఎంత సంపన్నుడో అర్థం అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 బిలియన్ డాలర్లకు అధిపతి. ఒక బిలియన్ అనగా 100 కోట్లు, అంటే 2000 కోట్ల అమెరికన్ డాలర్లు.

ఇతని పేరేంటి, ఇంత డబ్బు ఎలా సంపాదించాడు, ఇతనిది ఏ దేశం మరియు ఇతని వద్ద ఎన్ని కార్లు ఉన్నాయి? ఇలా రకరకాల ప్రశ్నలు మొదలవుతున్నాయి కదా...? అంబానీ సైతం అవాక్కయ్యే ఈ రాజు గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో...

ఇతని పేరు

ఇతని పేరు

సుల్తాన్ హాజి హస్సనల్ బోల్కియా ముజ్జాద్దిన్ వాదుల్లాహ్ ఇబిని అల్-మర్హుమ్ సుల్తాన్ హాజి ఒమర్ అలి సైఫుద్దీన్ సాదుల్లా ఖాయిరి వాద్దిన్, ఇదండి ఇతని పేరు. దీని కన్నా ఇతనిని సుల్తాన్ ఆప్ బ్రునెయి అని పిలవడం ఉత్తమం.

ఏ దేశస్థుడు

ఏ దేశస్థుడు

బ్రునెయి అనేది ఆగ్నేయాసిలో ఒక చిన్న భాగం కాస్త మలేషియా తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. 1984 లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత అనతి కాలంలోనే అత్యంత సంపన్న దేశంగా ఎదిగింది. కారణం వారి దగ్గర విపరీతమైన చమురు నిల్వలు ఉండటం .

సంపన్న రాజు

సంపన్న రాజు

ఇతను బ్రునెయి సామ్రాజ్యానికి రాజు అయిన తరువాత ఫోర్బ్స్ సంస్థ నిర్వహించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్న రాజులో సుల్తాన్ ఆఫ్ బ్రునెయి మొదటి స్థానంలో నిలిచాడు.

వివాహం

వివాహం

సుల్తాన్ ఆఫ్ బ్రునెయి వివాహం ప్రస్తుత వయస్సు 31 సంవత్సరాలు. అతని వివాహం అంగరంగ వైబవంగా జరిగింది. ఎనిమిది రోజుల పాటు అతని వివాహ ప్రాంతాన్ని పూలతో అలంకరించడానికి ఐదు లక్షల డాలర్లు ఖర్ఛు పెట్టాడంట.

ప్రిన్స్ బ్రునెయి దగ్గర ఉన్న కార్లు

ప్రిన్స్ బ్రునెయి దగ్గర ఉన్న కార్లు

సుల్తాన్ ఆఫ్ బ్రునెయి రాజుకు దాదాపుగా 7000 లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా అత్యంక ఖరీదైన లగ్జరి కార్ల సంస్థలకు చెందిన కార్లు ఉండటం విశేషం.

కంపెనీ వారిగా గల కార్లుv604-రోల్స్ రాయిస్ 574-మెర్సిడెస్-బెంజ్ 452-ఫెరారి 382-బెంట్లీ 209-బియమ్‍బ్ల్యూ కార్లు 179-జాగ్వార్ 134-కోయెంగ్‌సెంగ్ 21-ల్యాంబోర్గిని 11-ఆస్టన్ మార్టిన్ కార్లు ఇంకా ఇతర సంస్థలకు చెందిన కార్లు ఉన్నట్లు సమాచారం.

కంపెనీ వారిగా గల కార్లుv604-రోల్స్ రాయిస్ 574-మెర్సిడెస్-బెంజ్ 452-ఫెరారి 382-బెంట్లీ 209-బియమ్‍బ్ల్యూ కార్లు 179-జాగ్వార్ 134-కోయెంగ్‌సెంగ్ 21-ల్యాంబోర్గిని 11-ఆస్టన్ మార్టిన్ కార్లు ఇంకా ఇతర సంస్థలకు చెందిన కార్లు ఉన్నట్లు సమాచారం.

  • 604-రోల్స్ రాయిస్
  • 574-మెర్సిడెస్-బెంజ్
  • 452-ఫెరారి
  • 382-బెంట్లీ
  • 209-బియమ్‍బ్ల్యూ కార్లు
  • 179-జాగ్వార్
  • 134-కోయెంగ్‌సెంగ్
  • 21-ల్యాంబోర్గిని
  • 11-ఆస్టన్ మార్టిన్ కార్లు
  • ఇంకా ఇతర సంస్థలకు చెందిన కార్లు ఉన్నట్లు సమాచారం.

    బంగారపు రోల్స్ రాయిస్

    బంగారపు రోల్స్ రాయిస్

    ఇతని ఖాతాలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన 24 క్యారట్స్ బంగారుతో తయారు చేయబడిన రోల్స్ రాయిస్ కారు కలదు. మరొక ముఖ్యమైన విశయం ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుండి రైట్ హ్యాండ్ డ్రైవ్‌కు మార్పిడి చేయబడిన మొదటి కారు మెర్సిడెస్ బెంజ్ సియల్‌కె జిటిఆర్ ఇతని దగ్గర ఉంది.

    సుల్తాన్ ఆఫ్ బ్రునెలి కార్ కలెక్షన్

    సుల్తాన్ ఆఫ్ బ్రునెలి కార్ కలెక్షన్

    ఈ రాజు దగ్గర దాదాపుగా 7000 వరకు కార్ల ఉన్నట్లు తెలుసుకున్నాం కదా. తరువాత స్లైడర్ ద్వారా ఈ అన్ని కార్లలో అత్యంత ఖరీదైన ఐదు కార్ల గురించి తెలుసుకుందాం.

    రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్స్

    రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్స్

    సుల్తాన్ ఆఫ్ బ్రునెయి కార్ల లిస్ట్‌లో చాలానే ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇది మామూలు కారు అని కొట్టిపారేయకండి ఇది రోల్స రాయిస్ వారి సాధారణ కారే కాని దీనిని బంగారంతో పూత పూయించారు. దీని ధర దాదాపుగా 14 మిలియన్ అమెరికన్ డాలర్లు.

    మెక్ లారెన్ యఫ్1

    మెక్ లారెన్ యఫ్1

    మెక్ లారెన్ కు సంస్థకు చెందిన ప్రముఖ అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు. దీనిని తయారు చేయడానికి దాదాపుగా ఏడు సంవత్సరాల సమయం పట్టింది. 1992 నుండి 1998 వరకు అని తెలిసింది. ఇటువంటివి ఈ సుల్తాన్ దగ్గర ఎనిమిది కార్లు ఉన్నాయి.

    ఫెరారి యఫ్‌యక్స్‌యక్స్

    ఫెరారి యఫ్‌యక్స్‌యక్స్

    ఇది అత్యధిక పనితీరును కనబరిచే అత్యంత ఖరీదైన స్పోర్ట్స కారుఇది ఫెరారి కార్ల సంస్థ ఇటలీలో 2005 నుండి 2007 వరకు కేవలం 30 కార్లను మాత్రమే తయారు చేసింది. ఇప్పుడు వీటిని చూద్దామనుకున్నా కనపడవి. కాని ఈ అరుదైన కారు సుల్తాన్ ఆప్ బ్రునెయి కార్లలో ఉంది.

    మెర్సిడెస్-బెంజ్ సియల్‌కె జిటిఆర్

    మెర్సిడెస్-బెంజ్ సియల్‌కె జిటిఆర్

    సుల్తాన్ ఆఫ్ బ్రునెయి కార్ల లిస్ట్‌లో ఉన్న మరొక అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ఇది. ఈ సియల్‌కె జిటిఆర్ కారును మెర్సిడెస్ బెంజ్ ఎయమ్‌జి వారు తయారు చేశారు. ఈ కారులో గల రెండు లిమిటెడ్ ఎడిషన్‌లు అయిన సి‌యల్‌కె జిటిఆర్ అతని కార్లలో ఉన్నాయి.

    బుగట్టి వేరాన్

    బుగట్టి వేరాన్

    బుగట్టి కారును స్టేటస్ కు చిహ్నంగా భావిస్తాడు ఇతడు. అందుకే ఈ లగ్జరీ కారును తన సొంతం చేసుకున్నాడు. ఈ లగ్జరీ కారును ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగట్టి దీనిని తయారు చేసింది. ఇక ఇది చూపించే పని తీరు, వేగం అచ్చం మెక్ లారెన్ యఫ్1 కారును పోలి ఉంటాయి.

    మరిన్ని ఆశక్తికరమైన విశయాలకు
    1. 2013 గోల్డ్‌రష్ ర్యాలీ 5: శాన్ ఫ్రాన్సిస్కో టూ చికాగో
    2. జంతువులకు కోపం తెప్పిస్తే వస్తే కార్లను ఏం చేస్తాయి ?
    3. కారులో శృంగారం చేసే బ్రిటీషర్స్!
    4. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటో మాల్ 'ఆటోపియా'

Most Read Articles

English summary
Sultan Of Brunei Car Collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X