మిస్టర్ పెళ్లికొడుకులో యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌పై సునీల్ సవారీ
మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'కు రీమేక్‌గా వచ్చిన చిత్రం 'మిస్టర్ పెళ్లికొడుకు'. అందాల రాముడు సినిమాతో హీరో అవతారమెత్తిన మన కమెడియన్ సునీల్ ఇటు కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ బాడీతో, అటు తన కంటిన్యూ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థపై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ వైపుకు పరుగులు పెడుతోంది. సరే ఈ సినిమా గురించి అటుంచి ఇందులో మన మిస్టర్ పెళ్లికొడుకు ఓ యమహా స్పోర్ట్స్ బైక్‌పై కనిపిస్తాడు. ఈ చిత్రంలో సునీలో ఓ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ స్పోర్ట్ బైక్‌పై అలాగే ఓ పాత హీరోహోండా ప్యాషన్ మోటార్‌సైకిళ్లపై కనిపిస్తాడు. గతంలో విడుదలైన జులాయ్ చిత్రంలో అల్లు అర్జున్, శ్రీమన్నారాయణలో హీరో బాలక్రిష్ణలు కుడా ఇదే రకమైన స్పోర్ట్స్ బైక్‌లపై కనిపించారు.
ప్రత్యేకించి నేటి యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఈ స్పోర్ట్స్ బైక్‌ను తీర్చిదిద్దింది. నిజం చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్లో కంపెనీ తమ ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లను ప్రవేశపెట్టిన తర్వాత యమహా స్టారే మారిపోయింది. ఫ్యాషనబల్, స్టయిలిష్ రైడ్ కోరుకునే యువత కోసం ఎఫ్‌జెడ్-ఎస్ 'లార్డ్ ఆఫ్ ది స్ట్రీట్స్' అనే ట్యాగ్‌లైన్‌తో లభించే ఈ స్పోర్ట్స్ బైక్ ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. మరి ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఫీచర్లేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

మిస్టర్ పెళ్లికొడుకు మూవీ స్టిల్స్
పవర్‌ఫుల్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌పై స్పోర్ట్స్ బైక్‌పై మిస్టర్ పెళ్లికొడుకు సునీల్ సవారీ.

మిస్టర్ పెళ్లికొడుకు మూవీ స్టిల్స్
పాత హీరో హోండా ప్యాషన్ మోటార్‌సైకిల్‌పై హీరో సునీల్ జాలీ రైడ్.

మిస్టర్ పెళ్లికొడుకు మూవీ స్టిల్స్
కండలు తిరిగిన బాడీతో హీరో సునీల్

మిస్టర్ పెళ్లికొడుకు మూవీ స్టిల్స్
సిక్స్ బాడీతో పాటు సిక్స్ హాట్ బికినీ భామలతో సెక్సీ సునీల్.

మిస్టర్ పెళ్లికొడుకు మూవీ స్టిల్స్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* పవర్‌ఫుల్ ఇంజన్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌లో సరికొత్త 153సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 14 పిఎస్‌ల గరిష్ట పవర్‌ను, 13.6 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* మోనోక్రాస్ సస్పెన్షన్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ మోనోక్రాస్ సస్పెన్షన్ (వెనుక వైపు ఉండే సింగిల్ సెంటర్ షాక్ అబ్జార్వర్)తో లభిస్తుంది. ఈ మోనోక్రాస్ రియర్ సస్పెన్షన్ యూనిట్ 120 మి.మీ. వీల్ ట్రావెల్‌ను అందిస్తుంది. ఇది రన్నింగ్ పెర్ఫామెన్స్ పెంచడంలోనూ అలాగే మంచి హ్యాండ్లింగ్‌ను అందించడంలో సహకరిస్తుంది. ఇది రైడర్‌కు అలాగే వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుడికి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* మిడ్‌షిప్ మఫ్లర్ (సైలెన్సర్):
ఇందులో ఉపయోగించిన సరికొత్త సైలెన్సర్ మంచి స్టయిలిష్ డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా, ఎగ్జాస్ట్ సామర్థ్యాన్ని పెంచడంలోను అలాగే మంచి మాస్ బీటింగ్‌ను అందించడంలో తోడ్పడుతుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* వెడల్పాటి వెనుక టైరు:
ఈ బైక్‌కు వెనుక వైపు వెడల్పాటి రేడియల్ కలిగిన టైరును అమర్చటం జరిగింది. 140/60-R17 సైజ్ కలిగిన ఈ టైరు భారతదేశంలోనే మొట్టమొదటి. ఇది మంచి రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండి, బైక్ స్కిడ్ కావటం జరగదు అలాగే, మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కూడా అందిస్తుంది. చిన్న చిన్న పంక్చర్ల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* కొత్త స్టయిలిష్ గ్రాఫిక్స్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఉండే గ్రాఫిక్స్ బైక్‌కు సూపర్ స్టయిలిష్ లుక్‌ని ఇస్తాయి. అంతేకాకుండా, ఈ గ్రాఫిక్స్ బైక్‌కు మంచి స్పోర్టీ లుక్‌నిస్తుంది. ఈ బైక్‌పై వెళ్తుంటే, ఇది రోడ్డుపై వెళ్లేవారి దృష్టిని మీ వైపుకు తిప్పుకోవటం ఖాయం.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* సరికొత్త ఫ్యూయెల్ ట్యాంక్:
ఈ బైక్ స్టయిలిష్ లుక్‌ను కలిగి ఉండటానికి ప్రధానం కారణంగా దీని ఫ్యూయెల్ ట్యాంక్. 12 లీటర్ల సామర్థ్యం కలిగి పెద్ద స్టీల్ ఫ్యూయెల్ ట్యాంక్ ఈ బైక్‌కు ప్రధాన ఆకర్షనగా నిలుస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* ట్రెండీ మీటర్ కన్సోల్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌లో సెంటర్ కన్సోల్ (డిజిటల్ స్పీడో మీటర్) కూడా మరొక ప్రధాన ఆకర్షనగా చెప్పుకోవచ్చు. ఫుల్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే కలిగిన ఈ డిజిటల్ మీటర్ విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ గేజ్‌తో ఇతర ఇండికేటర్లను కలిగి ఉంటుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* పొడవైన, వెడల్పాటి ఫెండర్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ విశాలమైన రియర్ ఫెండర్‌ను కలిగి ఉండి, తడి రోడ్లపై ప్రయాణించేటప్పుడు బురద, నీటి తుంపరల నుంచి రక్షణ కలిగిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* విశాలమైన సీట్:
దీని పొడవాటి, వెడల్పాటి సీట్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది. దీని వెనుక వైపు అమర్చిన గ్రాబ్ బార్ వెనుక వైపు కూర్చునే ప్రయాణికులకు బ్యాక్‌రెస్ట్‌గా మాత్రమే కాకుండా, గతుకుల రోడ్లలో వెనుక కూర్చునే ప్రయాణికులు గ్రిప్ కోసం చేతితో పట్టుకునే హ్యాండిల్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* కలర్ ఆప్షన్స్:
యమహా ఎఫ్‌జెడ్-ఎస్ నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. అవి:
1. ఫైరీ ఆరెంజ్
2. కాంపిటీషన్ వైట్
3. సన్‌సెట్ రెడ్
4. బ్లాక్ సైబర్ గ్రీన్

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
* ధర:
భారత మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ధర రూ.71,530 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - వివరాలు
గతంలో విడుదలైన జులాయ్ చిత్రంలో అల్లు అర్జున్, శ్రీమన్నారాయణలో హీరో బాలక్రిష్ణలు కుడా ఇదే రకమైన స్పోర్ట్స్ బైక్‌లపై కనిపించారు.








Click it and Unblock the Notifications








