బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

ఇండో-అమెరికన్ వ్యోమగామి (ఆస్ట్రానట్) సునీతా విలియమ్స్ (Sunita Williams) ఓ కొత్త మిషన్ కోసం త్వరలో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. యూఎస్ అంతరిక్ష సంస్థ ప్రకారం, నాసా (NASA) యొక్క బారీ "బుచ్" (Butch) విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి స్టార్‌లైనర్ యొక్క మొట్టమొదటి సిబ్బందితో కూడిన మిషన్ అయిన బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో సునీతా విలియమ్స్ ప్రయాణించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫ్లైట్‌కు సునీతా విలియమ్స్ పైలట్‌గా నాయకత్వం వహిస్తారు.

బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

యూఎస్ స్పేస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, ఈ విమానంలో సిబ్బంది సుమారు రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తారు మరియు పని చేస్తారు. ఈ ప్రయోగ తేదీని ఇంకా నిర్ణయించలేదు. గతంలో, సునీతా విలియమ్స్ CFT కి బ్యాకప్ టెస్ట్ పైలట్‌ గా మరియు స్టార్‌లైనర్ యొక్క మొదటి సర్టిఫికేషన్ మిషన్ అయిన నాసా యొక్క బోయింగ్ స్టార్‌లైనర్-1 మిషన్ ‌కు కమాండర్ ‌గా కూడా నియమించబడ్డారు.

బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

క్రూ ఫ్లైట్ టెస్ట్ పైలట్‌గా ఆమె ప్రస్తుత పాత్రలో, విలియమ్స్ NASA వ్యోమగామి నికోల్ మాన్ (Nicole Mann) స్థానంలో ఉన్నారు, ఆమె వాస్తవానికి 2018 లోనే ఈ మిషన్ ‌కు కేటాయించబడ్డారు. నికోల్ మాన్ తరువాత 2021 లో ఏజెన్సీ యొక్క స్పేస్‌ఎక్స్ క్రూ-5 (SpaceX Crew-5) మిషన్‌ కు తిరిగి కేటాయించబడ్డారు. నాసా మరియు బోయింగ్ యొక్క క్రూ ఫ్లైట్ టెస్ట్ యొక్క పరీక్ష లక్ష్యాలను సాధించడానికి ఇద్దరు వ్యోమగాములు మరియు టెస్ట్ పైలట్‌లతో కూడిన ఈ తక్కువ వ్యవధి మిషన్ సరిపోతుంది.

బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

యూఎస్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, సునీతా విలియమ్స్ మరియు విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కార్యాచరణ సిబ్బంది మిషన్‌లను సురక్షితంగా నిర్వహించగల స్టార్‌లైనర్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నాసా సిఎఫ్‌టి (NASA CFT) యొక్క డాక్ వ్యవధిని ఆరు నెలలకు పొడిగించాలని మరియు అవసరమైతే అదనపు వ్యోమగామిని కూడా నియమించాలని యోచిస్తోంది. "స్టేషన్‌కు సిబ్బందిని రవాణా చేయడంలో ఊహించని సంఘటనలు" జరగకుండా ఉండటానికి ఈ చర్య తీసుకునే అవకాశం ఉంది.

బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

నాసా వ్యోమగామి మైక్ ఫిన్కే (Mike Fincke) ఇప్పుడు బ్యాకప్ స్పేస్‌క్రాఫ్ట్ టెస్ట్ పైలట్‌గా శిక్షణ పొందనున్నారు. అతను గతంలో క్రూ ఫ్లైట్ టెస్ట్ కోసం జాయింట్ ఆపరేషన్స్ కమాండర్ ‌గా కూడా నియమించబడ్డాడు. విల్మోర్, సునీతా విలియమ్స్ మరియు ఫిన్కే ముగ్గురూ కూడా స్పేస్ స్టేషన్‌లో దీర్ఘకాల సిబ్బందిగా ప్రయాణించిన అనుభవం కలిగి ఉన్నారు. విల్మోర్ మరియు విలియమ్స్ సిబ్బందితో కూడిన విమాన పరీక్ష ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. బోయింగ్ యొక్క స్టార్‌లైనర్ స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 నుండి యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ 5 రాకెట్‌ లో ప్రయోగించబడుతుంది.

బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ ఎవరు?

సునీతా విలియమ్స్ అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి. ఈమె ఒహియోలో ఒక ఇండో-అమెరికన్ కుటుంబంలో జన్మించారు. ఆమె మసాచుసెట్స్‌లోని నీధమ్‌లో పెరిగింది. కొలంబియా స్పేస్ షటిల్ క్రాష్‌లో మరణించిన కల్పనా చావ్లా (Kalpana Chawla) తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయ-అమెరికన్ వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు.

బోయింగ్ స్టార్‌లైనర్ టెస్ట్ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ రెండు అంతరిక్ష రికార్డులు నెలకొల్పింది. అందులో మొదటి రికార్డు అంతరిక్షంలో అత్యధిక సంఖ్యలో స్పేస్‌వాక్ చేసిన మహిళ. అత్యధిక స్పేస్‌వాక్ సమయం అంటే 50 గంటలు, 40 నిమిషాలు. ఆమె వ్యోమగామిగా తన కెరీర్‌లో ఏడు స్పేస్‌వాక్‌లు చేసింది. ఇక రెండవ రికార్ విషయానకి వస్తే, ఆమె తన కెరీర్‌లో రెండు వేర్వేరు మిషన్లలో 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఈమె ఆల్-టైమ్ యూఎస్ ఎండ్యూరెన్స్ లిస్ట్‌లో ఆరవ స్థానంలో ఉన్నారు మరియు మహిళా వ్యోమగామిగా రెండవ ఆల్-టైమ్ స్థానంలో ఉన్నారు.

Most Read Articles

English summary
Sunita williams to pilot boeings starliner to international space station
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X