బేబీ డాల్ సన్నీలియోన్ హాట్ కార్ కలెక్షన్

Written By:

జాతీయత పరంగా కెనెడియన్ లేదంటే ఇండియన్ ఏదేమైనప్పటికి దేశీయంగా సన్నీలియోన్ విపరీతమైన అభిమానుల మనసుల్ని చూరగొన్నది. యుక్త వయస్సులో సన్నీ లియోన్ గురించి తెలియని వారుడంరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే గూగుల్ సెర్చింజన్‌లో ఎక్కువ మంది గూగుల్ చేసిన నటీమణుల్లో సన్నీ లియోన్ మొదటి స్థానంలో రావడం మరింత విశేషం.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సన్నీలియోన్ కార్ కలెక్షన్

తెరమీద ఉన్నంత సేపు చూపులను మరల్చుకోలేని రీతిలో నటించి అభిమానుల్ని తన అంద చంద నటనా భంగిమలతో మంత్రముగ్దుల్ని చేయడం తనకే సొంతం. గతంలో పోర్ట్ స్టార్‌గా చెరగని ముద్ర వేసుకున్న సన్నీలియోన్, నీలి చిత్రాలకు దూరంగా ఆ కోవకే చెందిన బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇప్పుడు మంచి పాపులర్ అయ్యింది. మీరు కూడా సన్నీ లియోన్ ఫ్యానేనా...?

ప్రతి నిత్యం కార్లు బైకుల కథనాలతో విసిగిపోయారా...? అయితే రండి ఇవాళ్టి సెలబ్రిటి కార్ బేబీ డాల్ సన్నీలియోన్ కార్ల జాబితాలో ఏ యే కార్లున్నాయో చూద్దాం...

ఆడి ఏ5 కూపే

ఆడి ఏ5 కూపే

ఒకనొక కాలంలో ఐటమ్ సాంగ్స్ కోసం అక్కడక్కడా సినిమాల్లో పోర్న్ స్టార్లను వినియోగించుకునే వారు, అయితే సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీతో డైరక్టర్లు ఇప్పుడు ఈమెను దృష్టిలో ఉంచుకని కథలు రాయడం ప్రారంభించారు. ఈ ముద్దుగుమ్మ వద్ద ఆడి ఏ5 కూపే కలదు.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

ఆడి ఏ5 కూపేని కూల్ డిజైన్ ఫ్యాక్టర్స్‌తో రూపొందించింది. ప్రస్తుతం ఈ ఏ5 ప్రీమియమ్, ప్రీమియమ్ ప్లస్ మరియు ప్రెస్టేజ్ అనే మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. సాంకేతికంగా ఈ ఆడి ఏ5 లో 2.0-లీటర్ సామర్థ్యం గల టుర్బో చార్జ్‌డ్ ఇంటర్ కూలర్ డిఒహెచ్‌సి ఇన్ లైన్ నాలుగు సిలిండర్ల ఎఫ్ఎస్ఐ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్ కలదు.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

సన్నీలియోన్ మనసు దోచుకున్న ఆడి ఏ5 కూపే కారు ఇంటీరియర్‌లో మూడు స్పోక్స్ గల మల్టీ ఫంక్షనల్ స్పోర్ట్ స్టీరింగ్ వీల్ కలదు. సన్నీ లియోన్ దీనిని ఎంచుకోవడానికి దోహదపడిన మరో ముఖ్యమైన ఫీచర్ ఆటోమేటిక్ టిల్టింగ్ ప్యానరోమిక్ సన్ రూఫ్ ఒకటి.

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లో కంపెనీ యొక్క అల్ట్రా-హై లగ్జరీ కారు ఈ 7-సిరీస్ మోడల్. కోటి రుపాయల కన్నా ఎక్కువ ధర గల ఇందులో శక్తివంతమైన ఇంజన్ మరియు విశాలమైన ఇంటీరియర్‌లో అత్యాధునికి ఫీచర్లు దీనిని మరింత ప్రత్యేకం చేశాయి.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

ప్రస్తుతం 7-సిరీస్ లోని 750ఎల్ఐ పెట్రోల్ వేరియంట్ సన్నీ లియోన్ కార్ల జాబితాలో ఉంది. ఇందులో గరిష్టంగా 544బిహెచ్‌పి పవర్ మరియు 750ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 6.0-లీటర్ ఇంజన్ కలదు, ఇది కేవలం 5 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

సాధారణంగా సన్నీ లియోన్ కు గరిష్ట వేగంతో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. సన్నీ కోరుకునే వేగాన్ని ఈ 7-సిరీస్ కారు స్వల్పకాలంలో ఇవ్వగలదు. ఇక విశాలమైన ఇంటీరియర్ కోరుకునే సన్నీ కోసమే ఈ 7-సిరీస్ ఇంటీరియర్ రూపొందించారా అనిపిస్తుంది.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

సన్నీలియోన్‌లానే శక్తివంతమైన మసెరాటి క్వాట్రోపోర్ట్ కారును కలిగి ఉంది. దీనిని ఈమె బర్త డేనియల్ వెబర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. డేనియల్ వెబర్ వ్యాపారవేత్తగా చాలా మందికి తెలుసు.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

భర్త తనకు ఈ శక్తివంతమైన మరియు ఖరీదైన కారును బహుకరించిన అనంతరం ట్విట్టర్ వేదికగా చేసుకుని అభినందనలు తెలుపుకుంది.

సన్నీలియోన్ కార్ కలెక్షన్

మసేరాటి క్వాట్రోపోర్ట్ కారులో 3.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 275బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 6.3 సెకండ్ల కాలవ్యవధిలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఇంది గరిష్టంగా 250కిమీల వేగాన్ని తాకుతుంది.

భారీ అమ్మకాల దిశగా దూసుకెళ్తున్న మారుతి వారి బాలెనో కారును కొనాలనుకుంటున్నారా...? కొనే ముందు ఇక్కడున్న ఫోటోల ద్వారా ఎలా ఉందో ఓ సారి చెక్ చేయండి....

 

English summary
Actress Sunny Leone Car Collection
Story first published: Tuesday, January 10, 2017, 13:01 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark