కొత్త కారుతో కనిపించిన ఫేమస్ బ్యూటీ సన్నీలియోన్
సాధారణంగా సినీ ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలకు మరియు క్రికెటర్లకు లగ్జరీ కార్లంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మునుపటి కథనాలతో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్ల కార్లను గురించి తెలుసుకున్నాం. ఇందులో ప్రముఖ నటి సన్నీలియోన్ కి సంబంధించిన కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఎంజి మోటార్ కంపెనీ యొక్క గ్లోస్టర్ SUV తో కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

బాలీవుడ్ నటి సన్నీలియోన్ మసరాటి కార్లకు అభిమాని. ఇప్పటికే తన గ్యారేజ్ లో రెండు మసరాటి కార్లు ఉన్నాయి. అంతే కాదు ఈమె ఇతర బ్రాండ్స్ లగ్జరీ కార్లను కూడా కలిగి ఉంది. అయితే ఇటీవల సన్నీలియోన్ ముంబై విమానాశ్రయంలో MG గ్లోస్టర్ లగ్జరీ SUVతో కనిపించింది. అయితే ఈ కారు సన్నీలియోన్ కి సంబంధించిందా లేదా ఆమెను డ్రాప్ చేయడానికి అక్కడకి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియదు.

MG గ్లోస్టర్ భారతీయ మార్కెట్లో 2020 లో విడుదలైంది. ఈ SUV ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఎంజి గ్లోస్టర్ సూపర్, స్మార్ట్, షార్ప్ & సావి అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని ప్రతి వేరియంట్ కూడా అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది.

డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, ఆటో లెవలింగ్‌తో హెడ్‌ల్యాంప్స్, ఎంజి లోగో ప్రొజెక్షన్‌లతో కూడిన ఓఆర్‌విఎంలు, పనోరమిక్ సన్‌రూఫ్, 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్ లాంప్స్, స్టీరింగ్-అసిస్ట్ కార్నరింగ్ లాంప్స్, డ్యూయల్ బారెల్ ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఇది ఆధునిక ఇంటీరియర్ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో లెదర్ తో చుట్టబడిన సీట్లు, రెండవ వరుసలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు, 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో మరియు లేటెస్ట్ ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 8 ఇంచెస్ MID ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పాడిల్ షిఫ్టర్లు, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టీ-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఫ్రెంట్ సీట్లు ఉన్నాయి.

ఇది కంపెనీ యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ, అంతే కాకుండా ఇది దేశంలోని మొట్టమొదటి అటానమస్ 'లెవల్ 1' ఎస్‌యూవీ కూడా. కావున ఇందులో ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు లేన్ డిపార్చర్ వార్ణింగ్ వంటివి ఉంటాయి.
MG గ్లోస్టర్ అన్ని వేరియంట్లలో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో స్టాండర్డ్ గా ఉంటుంది. ఇది 4000 ఆర్‌పిఎమ్ వద్ద 160 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 375 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాప్-స్పెక్ ట్రిమ్స్‌లోని 2.0-లీటర్ ట్విన్-టర్బో యూనిట్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 216 బిహెచ్‌పి మరియు 1500 - 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ యొక్క రెండు వెర్షన్లు స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

భారతీయ మార్కెట్లో ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ.. మహీంద్రా కంపెనీ యొక్క అల్టురాస్ జి 4, టయోటా కంపెనీ యొక్క ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ కంపెనీ యొక్క ఎండీవర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








