లగ్జరీ కారులో తళుక్కుమన్న బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్..
సెలబ్రిటీలు అంటే ఎవరికైనా క్రేజే.. వారు ఇక పబ్లిక్ ప్లేస్‌ల్లో కనిపిస్తే సెల్ఫీలంటూ వెంటపడని వారుండరు. వారి పట్ల అభిమానులకు ఎంత క్రేజ్ ఉంటుందో.. వారు వాడే వాహనాలపై కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు అభిమానులు. ఎందుకంటే సెలబ్రిటీలు వాడే కార్లన్నీ చాలా లగ్జరీగా ఉంటాయి.
సినీ సెలబ్రిటీలు, ఇతర రంగంలో ప్రముఖులు వాడే లగ్జరీ కార్లు, బైకుల గురించి మీరు తరచూ వార్తల్లో చూసే ఉంటారు. వాటి ఖరీదు, ఫీచర్లపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఇటీవల బ్లాక్ కలర్ MG గ్లోస్టర్ లగ్జరీ కారులో ముంబైలో తళుక్కుమంది. ఆ వివరాలు ఈ కథనంలో..

సన్నీ లియోన్ MG గ్లోస్టర్ కారులో కనిపించడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుపు రంగు MG గ్లోస్టర్‌లో విమానాశ్రయానికి రావడం కెమెరాకు చిక్కింది. ఈ కారు దానికి భిన్నంగా ఉంది. ఈ వీడియోను కార్స్ ఫర్ యు యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబండి. వీడియోలో, నటి ముంబైలోని జుహు ప్రాంతంలోని ఒక బోటిక్‌కు వచ్చినట్లు కనిపిస్తుంది.
సన్నీ లియోన్ కారులో నుంచి బయటకు వచ్చిన అనంతంరం ఫొటోగ్రాఫర్‌లను పలకరించింది. ఆమె బొటిక్‌లోకి ప్రవేశించే ముందు కెమెరా మరియు వీడియోలకు పోజులిచ్చింది. ఆమె తన ఫోన్‌ని తీసి సెల్ఫీ వీడియోను కూడా రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

2020లో మార్కెట్‌లోకి వచ్చిన MG గ్లోస్టర్.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో సహా అనేక రకాల ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇలా అనేక ఇతర అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంది.
MG గ్లోస్టర్ భారత్‌లోని తయారీదారు నుంచి ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ SUV స్థానాన్ని కలిగి ఉంది. పూర్తి-పరిమాణ లగ్జరీతో దాని సెగ్మెంట్‌లోని టయోటా ఫార్చ్యూనర్ వంటి టాప్ కార్లతో పోటీ పడుతోంది. ఫోర్డ్ ఎండీవర్ ఒకప్పుడు గట్టి పోటీదారుగా ఉన్నప్పటికీ, దురదృష్టవశాత్తు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో లేదు.
MG గ్లోస్టర్ ప్రీమియం, పూర్తి-పరిమాణ లగ్జరీ SUV. ఫీచర్లు చూసుకుంటే క్యాబిన్ లోపల లెదర్ సీట్ కవర్లు, వెంటిలేటెడ్ సీట్లు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతుగా ఉంటుంది. విశాలమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ వంటి భద్రతా ప్యాకేజీని కలిగి ఉంది.
అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ABS మరియు నాలుగు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. రియర్‌వ్యూ కెమెరా, డ్రైవర్ ఫెటీగ్ మానిటర్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. SUVలో ఇంజిన్ స్టార్ట్-స్టాప్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, కీలెస్ ఎంట్రీ, కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇటీవలే MG గ్లోస్టర్ SUV యొక్క బ్లాక్ స్టార్మ్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. SUV రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. లో వేరియంట్‌లు 2.0-లీటర్ సింగిల్-టర్బో డీజిల్ ఇంజిన్‌తో 163 PS వద్ద 375 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
టాప్ వేరియంట్‌లు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌తో 218 PS వద్ద 480 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఇంజిన్ ఎంపికలు 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. ట్విన్-టర్బోచార్జ్డ్ వెర్షన్ కూడా 4WD సిస్టమ్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








