'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి

సన్‌రైజర్స్ క్రికెట్ టీమ్ సీఈఓ 'కావ్య మారన్' గురించి చాలామందికి తెలుసు. అయితే ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే విషయం బహుశా కొంత మందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో కావ్య మారన్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది, వాటి వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ సన్ గ్రూప్ కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ క్రికెట్ టీమ్ సీఈఓ కావ్య మారన్ దాదాపు అన్ని క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవుతూనే ఉంటారు. ఈమె అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగిస్తుంది. ఇందులో రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ VIII EWB, ఫెరారీ రోమా, బెంట్లీ బెంటాయేగ, బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 మొదలైనవి ఉన్నాయి.

Kavya-Maran-Luxury-Cars-Collection

రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసి విక్రయించే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ VIII EWB కారు కావ్య మారన్ ఫ్యామిలీ గ్యారేజిలో ఉంది. ఇది వీరి గ్యారేజిలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర భారతీయ మార్కెట్లో రూ. 12.2 కోట్లు. దీనిని కావ్య మారన్ తండ్రి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది బ్లాక్ టాప్ కలిగి లైట్ గోల్డ్ కలర్ పొందుతుంది.

చూడటానికి ఇది చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ రోల్స్ రాయిస్ కారు 21 ఇంచెస్ మల్టిస్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది 6.75 లీటర్ వీ12 ట్విన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 571 Bhp పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

Kavya-Maran-Luxury-Cars-Collection

ఫెరారీ రోమా: ఫెరారీ కంపెనీకి చెందిన రోమా కూడా కావ్య మారన్ ఫ్యామిలీ గ్యారేజిలో ఉంది. ఇది ఆకర్షణీయమైన రోస్సో కోర్సా రంగులో ఉండటం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ కారు బ్రేక్ కాలిపర్స్ పసుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ధర రూ. 4.5 కోట్లు కంటే ఎక్కువ. ఇది 3.9 లీటర్ ట్విన్-టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ కలిగి 690 పీఎస్ పవర్ మరియు 760 Nm టార్క్ అందిస్తుంది.

బెంట్లీ బెంటయేగా ఈడబ్ల్యుబీ: బెంట్లీ కంపెనీకి చెందిన బెంటయేగా ఈడబ్ల్యుబీ కావ్య మారన్ గ్యారేజిలో ఉన్న మూడవ ఖరీదైన కారు. దీని ధర రూ. 6 కోట్లు కంటే ఎక్కువ. ఇది చాలా సార్లు చెన్నై వీధుల్లో కనిపించినట్లు సమాచారం. క్యాండీ రెడ్ కలర్ ఆప్షన్‌లో చూడచక్కగా ఉన్న ఈ కారు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి సాధారణ మోడల్ కంటే 180 మిమీ ఎక్కువ పొడవుగా ఉంటుంది.

Kavya-Maran-Luxury-Cars-Collection

బెంట్లీ బెంటయేగా ఈడబ్ల్యుబీ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 550 పీఎస్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

బీఎండబ్ల్యూ ఐ7: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 కూడా కావ్య మారన్ గ్యారేజిలో ఉంది. ఇది లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ షేడ్‌లో పూర్తయింది. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ సెడాన్ 101.7-కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది 591 కిమీ నుంచి 625 కిమీ రేంజ్ అందిస్తుంది.

Kavya-Maran-Luxury-Cars-Collection

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

Video Code:

More from DriveSpark

Article Published On: Wednesday, April 24, 2024, 11:08 [IST]
English summary
Sunrisers hyderabad owner kavya maran s cars from ro110806
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+