రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు.. SRH ఓనర్ కావ్య మారన్ గ్యారేజీలో అదిరిపోయే కార్లు.. ఒక్కోటి కోట్లలో!
దేశంలో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. అందరు కూడా టీవీలు, ఫోన్‌లకు అతుక్కుపోయి మరి చూస్తున్నారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో కెమెరాలన్నీ కూడా స్టేడియంలోని గ్యాలరీలో ఒక్క వ్యక్తిని మళ్లీ మళ్లీ చూపిస్తుంటారు. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో అందంగా, జట్టుపై పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తూ ఉండే ఆ జట్టు యజమాని కావ్య మారన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె అందంలోనే కాకుండా బిజినెస్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ రంగాల్లో తనదైన ముద్ర వేసింది. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SA20) జట్లకు సహ యజమానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆమె చిన్న వయసులోనే ఈ స్థాయికి చేరుకోవడం ఎంత పెద్ద ఘనతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావ్య మారన్ కెమెరాల్లోకి ప్రతి సారీ కనిపించినప్పుడు అభిమానులు ఆమెను చూస్తుండిపోతారు.. కోట్లకు అధిపతి అయిన ఆమె అభిప్రాయాలు, అభిరుచులు కూడా అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేయడంలో ఆమె ఎప్పుడు ముందు ఉంటుంది. ఆమె వద్ద సినిమా తారలకు తీసిపోని లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఒకవైపు విజయవంతమైన బిజినెస్‌వుమెన్‌గా, మరోవైపు స్పోర్ట్స్ జట్టు అధిపతిగా అందరి గుండెల్లో తనదైన స్థానం సంపాదించిన కావ్య మారన్ ఇప్పుడు యూత్ ఐకాన్‌లా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ నేపథ్యంలో ఆమె లగ్జరీ కార్ల కలెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కావ్య మారన్ కార్ కలెక్షన్‌ను చూస్తే అందరు షాక్‌కు గురికావాల్సిందే. ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ఆమె వద్ద ఉంది.
ఈ లగ్జరీ కారు ధర రూ.12 కోట్లు. విశాలమైన ఇంటీరియర్, అదిరిపోయే థీమ్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. లోపల రాయల్ లుక్ ఆకర్షిస్తుంది. లగ్జరీ ల్యాండ్ యాచ్‌కు చెందిన ఫాంటమ్ VIII EWB 6.75-లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 571 bhp పవర్, 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే కేవలం లగ్జరీనే కాదు, అత్యంత శక్తివంతమైన పనితీరులో కూడా దీనికి ప్రత్యేకత ఉంది.

ఇది GPS-ఆధారిత 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో రన్ అవుతుంది. రోడ్ మ్యాప్‌ను ఆధారంగా చేసుకుని, రాబోయే మలుపులపై ఆధారపడి గేర్లను స్వయంగా ఛేంజ్ చేసుకుంటుంది. అలాగే, ఆమె వద్ద జర్మన్ కార్ తయారీ సంస్థ BMW నుంచి వచ్చిన i7 ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.03 కోట్లు. ఒకే వేరియంట్‌లో వచ్చే ఈ ఎలక్ట్రిక్ వాహనం పూర్తిగా భారతదేశంలోకి దిగుమతి అవుతోంది.
ఈ కారులోకి అడుగుపెట్టిన వెంటనే అదిరిపోయే డిజైన్, టాప్ క్లాస్, టెక్నాలజీ స్పష్టంగా కనిపిస్తాయి. ముందుభాగంలో రెండు కర్వ్డ్ డిస్ప్లేలు, ఒకటి 14.9 అంగుళాల టచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరొకటి 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవింగ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే, 31.3 అంగుళాల 8K రిజల్యూషన్ థియేటర్ స్క్రీన్. ఇది అమెజాన్ ఫైర్ టీవీతో అంతర్నిర్మితంగా వస్తుంది.

అంటే, వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు కేవలం కార్‌లో కూర్చునేంత వరకే కాదు, మినీ హోమ్ థియేటర్ అనుభూతిని కూడా పొందగలుగుతారు. కావ్య మారన్ గ్యారేజీలోని టాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీకి చెందిన ఫెరారీ రోమా 2021లో భారత మార్కెట్‌లోకి వచ్చింది. చెన్నై వీధుల్లో అప్పుడప్పుడు కనిపించే ఈ కారు, గ్లామర్‌తో పాటు వేగాన్ని కూడా కలగలిపే ఒక అద్భుతమైన కాంబినేషన్.
కావ్య ఉపయోగించే రోమా కారు పసుపు బ్రేక్ కాలిపర్‌లు, వెండి అల్లాయ్ వీల్స్ కారు స్పోర్టీ లుక్‌ను కలిగిస్తుంది. పక్క క్లాసిక్, మోడ్రన్ డిజైన్‌ను కలగలిసింది. ఇది 3.9 లీటర్ V8 టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, 612 bhp పవర్, 760 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.4 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగం చేరుకుంటుంది. టాప్ స్పీడ్ 320 కిలోమీటర్లు. ధర రూ.4.5 కోట్లు.

కావ్య మారన్ గ్యారేజీలో సూపర్ లగ్జరీ SUV రో ఖరీదైన కారు బెంట్లీ బెంటెగా ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ ఎడిషన్ (Bentley Bentayga Extended Wheelbase Edition) కూడా ఉంది. ఇది మరింత విశాలంగా, సౌకర్యంగా ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ బెంటెగా కంటే, ఎక్కువ పొడవుతో వచ్చింది. 22 అంగుళాల Bentley టర్బైన్ డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో మరింత స్పోర్టీ గ్లామర్‌ను కలిగిస్తుంది
శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి, ఈ SUV 4.0 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 550 bhp పవర్, 770 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. బెంట్లీ బెంటెగా ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 కోట్లు నుండి ప్రారంభమవుతుంది. స్టైల్ మాత్రమే కాదు, స్టేటస్ కూడా చూపించేలా ఇది బాగా సెట్ అవుతంది.
ఐపీఎల్ మ్యాచ్‌లలో గ్యాలరీలో కనిపించే ఆమె చిరునవ్వుకి, డ్రైవింగ్ గ్యారేజీలో ఉండే ఈ వాహనాలంతా ఫెర్ఫెక్ట్ కాంబినేషన్‌లా ఉంటాయి. ఆమెకు ఉన్న కార్ కలెక్షన్. సినిమా తారలకు తీసిపోని లగ్జరీ వాహనాలు ఆమె గ్యారేజ్‌లో కనిపిస్తున్నాయి. కార్ల పట్ల ఆమెకు ఉన్న ప్రేమను ఇది తెలియజేస్తుంది. ఆమె లీడర్‌షిప్, గ్లామర్ కలగలిసిన ప్రతిభకు ఐపీఎల్ ఒక్కటే కాక, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వస్తోంది.
సన్‌రైజర్స్ జట్టుకు ఉన్న స్ఫూర్తి, అభిమానులకిచ్చే కాన్ఫిడెన్స్ ఈ యువ నాయకురాలని గొప్ప స్థాయికి చేర్చాయి. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తెగా పుట్టిన కావ్య, సంపన్న వారసత్వాన్ని గౌరవంగా మోస్తూ, తనదైన ముద్రను వాణిజ్యరంగంలో వేస్తోంది. ఆమె ఇంగ్లండ్‌లోని ప్రముఖ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తర్వాత, తండ్రి కళానిధి మారన్ స్థాపించిన సన్ టీవీ నెట్‌వర్క్ వ్యాపార బాధ్యతల్లో భాగస్వామిగా మారింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








