సన్‌టచర్ - సౌరశక్తితో గాలిలో విహరించే లోహ విహంగం..!

By Ravi

ఈరోజు మనం మైళ్ల దూరాన్ని కేవలం గంటల్లోనే అధిగమిస్తున్నామంటే అందుకు మూలకారణం రైట్ సోదరులేనని చెప్పవచ్చు. గాలిలో ఎగిరే పక్షుల నుంచి స్ఫూర్తి పొంది పరిశోధకులు విమానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న అన్ని లోహ విహంగాలు కూడా గాలిలో ఎగరాలంటే ఇంధనం అవసరం. అయితే, అస్సలు ఇంధనమే అవసరం లేకుండా గాలిలో ఎగిరే విమానాలు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి విమానం గురించే.

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న విమానం పేరు 'సన్‌టచర్'. పేరుకు తగినట్లుగానే ఇది సూర్యరశ్మితో నడుస్తుంది. స్లోవకియాలోని బ్రటిస్లావాకు చెందిన సామ్యుయేల్ నిక్జ్ ఈ సన్‌టచర్ సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌‌ను అభివృద్ధి చేశారు. సన్‌టచర్ విమానంలో ఇంధనం అవసరం లేకుండా కొన్ని వందల మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌‌లో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. 70 మీటర్ల పొడవు ఉండే సన్‌టచర్ రెక్కలపై అమర్చిన ఫొటోవోల్టాయిక్ సెల్స్ నుంచి సౌరశక్తిని సేకరించబడుతుంది.

ఇలా గ్రహించిన సౌరశక్తి సాయంతో సన్‌టచర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అమర్చిన ఏసి ఇంజన్ పనిచేస్తుంది. ఈ ఇంజన్‌ను గ్లైడర్స్ ఫ్యూజ్‌లాగ్ యొక్క మధ్యలో అమర్చబడి ఉంటుంది. సులువుగా గాల్లో ఎగిరేందుకు వీలుగా దీని బరువును తక్కువగా ఉంచేందుకు గాను తేలికపాటి పదార్థాలతో దీనిని నిర్మించారు. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు అంతేకాకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలవుతుంది. ఇది సగటున గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

సన్‌టచర్ - సోలార్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్

More from DriveSpark

Article Published On: Tuesday, May 7, 2013, 16:48 [IST]
English summary
The 'suntoucher' is a two-seater aircraft concept which has the capability of flying for several hundred miles without fuel. Developed by samuel nicz, it uses solar energy collected from the photovoltaic cells installed across its large wingspan of 70m to power its AC engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+