మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు చాలామంది ప్రజలు లగ్జరీ మరియు కంపర్టబుల్ జీవన విధానానికి అలవాటు పడ్డారు. ఈ కారణంగా ఎంత డబ్బు ఖర్చు చేసైనా విలాసవంతమైన జీవనం సాగిస్తారు. ప్రజలు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ట్యాక్సి వంటివి సమయానికి అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

మరి కొంతమంది కొత్త ప్రదేశంలో కూడా తమకు సొంత వాహనం ఉండాలని ఆశిస్తారు, ఇలాంటి వారి కోసం కొన్ని ప్రయివేట్ సంస్థలు లగ్జరీ బైకులు మరియు లగ్జరీ కార్లను అందిస్తున్నారు. ఇలాంటి సదుపాయం బెంగళూరులో ప్రస్తుతం అమలులో ఉంది. ఇక్కడ ప్రజలు వారికీ నచ్చిన వాహనాన్ని నిర్దేశించిన ధర చెల్లించి కొన్ని నియమాలను అనుసరించి స్వేచ్ఛగా వాడుకోవచ్చు.

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

ఇదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 'రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో' ఇలాంటి సర్వీస్ ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ విమానాశ్రయంలో సూపర్ లగ్జరీ కార్లను తమ వినియోగదారులకు రెంట్ కి ఇవ్వడానికి ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు, ప్రజలు విమానం దిగి, క్యాబ్ ఉపయోగించి తమ ఇంటికి చేరుకున్నారు.

MOST READ:భారత మార్కెట్లో పవర్‌పుల్ ఎస్‌యూవీ; 2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ వీడియో

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

విమాన ప్రయాణం చేసి బయటకు వచ్చిన వెంటనే టాక్సీ వంటివి అందుబాటులో లేకుంటే మీరు ఈ సూపర్ కార్లను ఎంచుకోవచ్చు. ఈ సూపర్ కార్లకు మోడల్ వారిగీ రెంట్ నిర్దేశించబడింది. ఇందులో డ్రైవర్ అందుబాటులో ఉంటారు లేదా మీరే సెల్ఫ్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు.

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

మీరు ఈ సూపర్ కార్లను బుక్ చేసుకోవాలంటే ఫ్లైట్ ల్యాండ్ కావడానికి ముందే నార్మల్ కాల్ చేయడం ద్వారా లేదా ఆన్ ‌లైన్ బుకింగ్ ద్వారా బుక్ చేయవచ్చు. కరోనా అధికంగా ఉన్న ఈ సమయంలో ఈ కార్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచబడతాయి. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో అందుబాటులో ఉన్న లగ్జరీ కార్లను వినియోగించుకోవచ్చు.

MOST READ:అదిరిపోయే లుక్‌లో ఉన్న మాడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్; వివరాలు

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

ఇక్కడ లంబోర్ఘిని గల్లార్డో, జాగ్వార్ ఎఫ్ టైప్, పోర్స్చే 911 కారెరా మరియు ఫోర్డ్ ముస్టాంగ్ వంటి స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా లెక్సస్ ఇఎస్ 300 హెచ్, ఆడి ఎ 3 క్యాబ్రియోలెట్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఇ 250, మసెరటి గిబ్లి, బిఎమ్‌డబ్ల్యూ 3 జిటి మరియు వోల్వో ఎస్ 60 వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మీరు టయోటా ఫార్చ్యూనర్ మరియు మారుతి సుజుకి సియాజ్‌ వంటి కార్లను కూడా ఎంచుకోవచ్చు.

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

భారతదేశంలో ఇటీవల కాలంలో మెల్లమెల్లగా రెంటెడ్ కార్ల బాగా పెరుగుతోంది, కావున బాగా అభివృద్ధిచెందిన నగరాల్లో ఇప్పుడు ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ ప్రజలు తమ బడ్జెట్‌లో సరిపోయే వాహనాన్ని ఎంచుకుని ఆనందించవచ్చు.

MOST READ:మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్‌చల్ [వీడియో]

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

ఈ కార్ రెంటెడ్ సర్వీసులు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, గోవా వంటి ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సర్వీస్ లో బైక్ లేదా కార్ ని రెంట్ కి తీసుకోవచ్చు. మీరు స్కూటర్ లేదా మోటారుసైకిల్‌ను సుమారు 1000 రూపాయలు చెల్లించి నగరంలో ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వాహనానికి ఇంధనం (పెట్రోల్ & డీజిల్) మీరే నింపుకోవాలి.

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

రెంటెడ్ సర్వీస్ లో మహీంద్రా థార్ ను ఉపయోగించుకోవాలంటే రోజుకు 5,500 రూపాయలు చెల్లించి దాదాపు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ సర్వీస్ లో చందా ప్రణాళికలు కూడా అందుబాటులో ఉంటాయి, ప్రస్తుతం మహీంద్రా, హ్యుందాయ్, మారుతి సుజుకి, టయోటా వంటి తయారీదారులు చందా ప్రణాళికలను అందిస్తున్నారు.

MOST READ:ఒకే ఛార్జ్‌తో 100 కి.మీ వెళ్లగల ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు భారత్‌లో; ధర & వివరాలు

మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

ఈ కంపెనీలు మాత్రమే కాకుండా రెవ్ మరియు జూమ్ కార్ వంటి మరికొన్ని స్వతంత్ర సంస్థలు కూడా చందా ప్రణాళికలను అందిస్తున్నాయి. మీరు వాహాన్ని తీసుకున్న తరువాత కంపెనీ మీకు నిర్దేశిత టైమ్ ఇస్తుంది. ఆ సమయం ముగిసిన తరువాత మీరు వాహాన్ని అప్పగించాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Super Cars Available For Rent In Hyderabad Airport. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X