కోట్లు పెట్టి కొన్నా.. ఇలాంటి రోడ్డు మీద కష్టమే.. వీడియో చూడండి

ఖరీదైన కార్లను కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కోట్ల రూపాయల డబ్బు చెల్లించి, ఖరీదైన కార్లను కొనుగోలు చేసినప్పటికీ రోడ్డు సరిగ్గా లేకుంటే? ఆ అనుభవం ఎలా ఉంటుందో ఎవ్వరైనా ఇట్టే ఊహించవచ్చు. ప్రత్యేకించి భారతదేశంలోని రోడ్ల మీద సూపర్ కార్లను డ్రైవ్ చేయడం అంత సులభమేమీ కాదు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డు మీద వెళ్ళడానికి కార్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయో గమనించవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న యూట్యూబ్ వీడియోలో గమనిస్తే ఆడి ఆర్8 మరియు ఫెరారీ 812 జీటీఎస్ కార్లు రోడ్డుపై పడే ఇబ్బందులు కనిపిస్థాయి. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డు వ్యవస్థ సరిగా లేకపోవడం దీనికి కారణమని తెలుస్తోంది. గుంతలమయమైన రోడ్డుపైన సాధారణ కార్లు సజావుగా ముందుకు సాగుతాయి. కానీ సూపర్ కార్లు సజావుగా ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే సూపర్ కార్ల గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది.

Super Cars Struggling On Indian Roads

గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండటం వల్ల.. గుంతల రోడ్డు మీద సూపర్ కార్లు నేరుగా ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే బంపర్ రోడ్డుకు తగిలే అవకాశం ఉంది. అంతే కాకుండా స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు కూడా సాధారణ కార్ల మాదిరిగా అవి ముందుకు వెళ్ళలేవు. ఇవన్నీ వీడియోలు చూస్తే స్పష్టంగా అర్థమవుతాయి. అయితే చాలా జాగ్రత్తగా సూపర్ కార్లను డ్రైవ్ చేయాల్సి ఉంది, లేకుంటే అనుకోని ప్రమాదం ఎదురవుతుంది.

వీడియోలో రెండు సూపర్ కార్లు చిన్న స్పీడ్ బ్రేకర్ దాటడానికి ఎంత కష్టపడుతున్నాయో చూడవచ్చు. ఈ వీడియో మైసూర్ ప్రాంతంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే వీడియోలో ఫెరారీ 812 జీటీఎస్ స్పీడ్ బ్రేకర్ దాటడం గమనించవచ్చు. మొత్తం మీద కోట్ల విలువ చేసే కార్లు భారతదేశంలో స్పీడ్ బ్రేకర్ దాటడానికి బాగా కష్టపడుతున్నాయని ఈ వీడియో ద్వారా స్పష్టమైంది.

Super Cars Struggling On Indian Roads

ఇలాంటి కార్లను డ్రైవ్ చేయాలంటే అనుభవం కూడా చాలా అవసరం లేకుంటే.. కారు ప్రమాదంలో చిక్కుకుంటుంది. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. సూపర్ కారు వేగంగా వెళ్లి పొరపాటున స్పీడ్ బ్రేకర్లను డీ కొడితే.. కారు ముందు భాగం బాగా దెబ్బతింటుంది. కాబట్టి ఇండియా రోడ్డు మీద సూపర్ కారు డ్రైవ్ చేయాలంటే ముందుగా ఆ రోడ్డు గురించి కూడా తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి.

2010లో కూడా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ బుగాటి కారు రోడ్డుపైన వచ్చే స్పీడ్ బ్రేకర్ దాటడానికి చాలా ఇబ్బందిపడింది. సాధారణంగా ఇలాంటి కార్లు ప్రయాణించడానికి అగ్ర దేశాల్లో ప్రత్యేకమైన రోడ్లు ఉంటాయి. కాబట్టి చీకూ చింతా లేకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళవచ్చు. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో అది సాధ్యం కాదు. కాబట్టి ఇండియా రోడ్డు మీద సూపర్ కారు డ్రైవ్ చేయాలంటే కొంత ఇబ్బంది తప్పదు.

భారతదేశంలో సూపర్ కార్ల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటికి అనుగుణంగా రోడ్డు వేయడం అనవసరమే. అయితే ఇండియాలో ఉపయోగిస్తున్న చాలా కార్లు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి రోడ్డు ఎగుడు దిగుడుగా ఉన్నా.. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లిపోతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సూపర్ కార్లు వెళ్ళడానికి అనుకూలమైన రోడ్స్ కూడా ఉన్నాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2024, 9:35 [IST]
English summary
Super cars struggling on indian roads viral video
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+