అదిదా తలైవా.. లగ్జరీ కార్లను పక్కకు నెట్టి సాధారణ కారులో సూపర్ స్టార్ రజినీ కాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajini Kanth) నటించిన లాల్ సలామ్ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. జైలర్ సక్సెస్ తర్వాత లాల్ సలామ్ మూవీ విజయంతో రజినీతో పాటు చిత్ర బృందం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ సింప్లిసిటీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ రజినీ కాంత్ అని అందరూ అంటుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది. అందుకే రజినీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాగా రజినీ గ్యారేజ్‌లో ఖరీదైన లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. అయితే వాటిని వదిలి సాధారణ కారులో ప్రయాణించారు రజినీ.. తమిళనాట ప్రముఖ రాజకీయ నాయకురాలు శశికళ కొత్తగా నిర్మిస్తున్న 'జయలలిత ఇంటిని' తలైవా సందర్శించారు.

కాగా ఈ ఇల్లు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత వేద ఇంటికి ఎదురుగా ఉంది. జైలుకు వెళ్లే వరకు శశికళ ఈ ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ఇంటిని జయలలిత మేనకోడలు దీపకు అప్పగించారు. అందుకే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత శశికళ డి.నగర్‌లోని రాజకుమారి కూతురు కృష్ణప్రియ ఇంట్లో బస చేశారు.
ఈ క్రమంలో బోయిస్ గార్డెన్‌లోని వేదా హౌస్ ఎదురుగా గ్రాండ్ హౌస్ కూడా నిర్మించారు. ఆ ఇంట్లో ఇటీవలే గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రజినీకాంత్‌కు ఆహ్వనం అందింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో ఇటీవల ఆయన శశికళ కొత్త ఇంటికి వెళ్లారు.

కాగా శశికళ ఇంటికి వెళ్లేందుకు రజినీ సాధారణ కారును ఉపయోగించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆయన వద్ద ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నా.. టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో రజినీ.. శశికళ ఇంటికి బయలుదేరారు. దీంతో తలైవా సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నటుడు రజనీకాంత్ BMW X7 వంటి ఖరీదైన సరికొత్త లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. జైలర్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ కారును రజనీకి బహుమతిగా అందించడం గమనార్హం. కళానిధి మారనే స్వయంగా నటుడు రజనీకాంత్ నివాసానికి వచ్చి ఈ కారును బహుకరించారు.

గతంలో కూడా సూపర్ స్టార్ సాధారణ దుస్తులు, సాధారణ వాహనాల్లో కనిపించారు. గతంలో ఇన్నోవా క్రిస్టాను ఉపయోగించగా.. ఇప్పుడు ఇన్నోవా హైక్రాస్ కారులో తిరిగారు. ఇన్నోవా హైక్రాస్‌కి చెందిన హైబ్రిడ్ టెక్నాలజీ కారును రజనీ వినియోగిస్తున్నారు. ఈ కారు అధిక మైలేజ్‌ను ఇస్తుంది. ఇన్నోవా హైక్రాస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ లీటర్‌కు 23 కిమీ మైలేజీని అందిస్తుంది.
అంతేకాకుండా ఇన్నోవా హైక్రాస్ భారతీయులకు ఇష్టమైన కార్ మోడల్‌గా కూడా ఉంది. ఈ కారు ఇప్పటికే అమ్మకాల రికార్డులను సాధిస్తోంది. ఇటీవలే ఈ కారు 50 వేల యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. భారత మార్కెట్లోకి వచ్చిన 14 నెలలకే ఈ ఘనత సాధించడం విశేషం.
అధిక ప్రీమియం ఫీచర్లు మరియు స్పేస్‌తో ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్‌ను సంస్థ విడుదల చేసింది. హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు, టయోటా ఈ కారులో లేన్ ట్రేస్ అసిస్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్ మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌లను అందించే టెక్నాలజీని అందుబాటులో ఉంచింది.
ఇన్నోవా Hycross లో వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ రియర్ డోర్, రియర్ సన్‌షేడ్, మల్టీ-జోన్ AC, ఎలక్ట్రోక్రోమిక్ IRVM మరియు ఒట్టోమన్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతా పరంగా, ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ప్రీ-కొలిజన్ సిస్టమ్, ఆటో హై బీమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ వంటి అధునాత ఫీచర్లతో వస్తుంది. ఇలాంటి క్వాలిటీ ఫీచర్ల కారణంగా సెలబ్రిటీల్లో కూడా ఈ కారుకు ఆదరణ లభిస్తోంది.
ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ. 25.72 లక్షల నుండి రూ. 30.68 లక్షల మధ్య ఉంది. ఈ మొత్తం మనకు ఎక్కువే అనిపించినా.. రజనీ లాంటి సూపర్ స్టార్‌డమ్ ఉన్న నటులకు ఇది లో బడ్జెట్ కారు. అందుకే ఇది ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications








