ఎకానమీ క్లాస్‌లో ‘తలైవా’.. రజినీ సింప్లిసిటీకి ఫిదా అవ్వకుండా ఉంటారా.??

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌(RajiniKanth Economy Class) ఎకామీ క్లాస్‌లో ప్రయాణించారు. సాధారణంగా సెలబ్రిటీలు, వీఐపీలు ఎక్కువగా.. లగ్జరీ సౌకర్యాలు ఉండే ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌లో ప్రయాణిస్తారు. ఇలా ఎకానమీ క్లాస్‌ ఫ్లైట్‌లలో ప్రయాణించడం చాలా అరుదు. కొన్ని నెలల క్రితం కింగ్‌ కోహ్లీ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరచగా ఇప్పుడు రజినీ సర్‌ప్రైజ్‌ చేశారు.

తలైవా ప్రధాన పాత్రలో 'జై భీమ్' ఫేమ్ టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వెట్టయన్‌. ఈ సినిమా షూటింగ్‌లో రజినీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సూపర్‌ స్టార్‌.. ఏపీలోని కడప నుంచి హైదరాబాద్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. దీంతో తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Rajinikanth-Economy-Class-Flies-Viral-Video

సాధారణంగా చాలా మందికి విమానంలో ప్రయాణించడం(RajiniKanth Economy Class Viral Video) ఓ కల. కానీ ఇక్కడ ఫస్ట్‌ క్లాస్‌లో ప్రయాణించడం అంటే భారీ బడ్జెట్‌తో కూడుకున్నదే. అందుకే ఎక్కువ మంది ఎకానమీ క్లాస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫస్ట్‌ క్లాస్‌లో సెలబ్రిటీలు, వీఐపీలే ప్రయాణిస్తుంటారు. కానీ అప్పుడప్పుడూ కొన్ని కారణాల వల్ల సెలబ్రిటీలు ఎకానమీలో ప్రయాణిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో రజినీ ఫ్యాన్స్‌ ఒకరు ఈ వీడియోను X(ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. 'నేను దేవునికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను' అనే శీర్షికతో ఎమోజీను జోడించి వీడియోను షేర్‌ చేశారు. రజనీకాంత్(Rajini Kanth Flies In Economy Class) బ్లూ షర్ట్ మరియు లేత గోధుమరంగు ప్యాంటులో విండో సీటు దగ్గర కూర్చోవడాన్ని వీడియోలో చూడవచ్చు.

Rajinikanth-Economy-Class-Flies-Viral-Video

ఇదే ఫ్లైట్‌లో రజినీకి సంబంధించిన మరో వీడియోను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. రజనీకాంత్ తన సీటులో కూర్చొని ఎయిర్‌పాడ్‌లను పెట్టుకుని మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తారు. ఎకానమీ క్లాస్‌లో రజినీ చాలా సాదాసీదాగా ఉండటం చూసి విమానంలోని ప్రయాణికులు చూసి ఆశ్చర్యపోవడంతో పాటు థ్రిల్‌కు గురయ్యారు.

కాగా విమానాల్లో ఎకానమీ క్లాస్ మరియు ఫస్ట్ క్లాస్ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే, ఫస్ట్ క్లాస్ టికెట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ధరలకు అనుగుణంగా ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌లో సౌకర్యవంతంగా, లగ్జరీగా ప్రయాణించవచ్చు. ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే ఫస్ట్‌ క్లాస్‌లో ఫుడ్‌ క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది.

Rajinikanth-Economy-Class-Flies-Viral-Video

అంతేకాకుండా ఫస్ట్‌ క్లాస్‌లో సీటింగ్‌ కూడా విశాలంగా ఉంటుంది. తగినంత లెగ్‌రూమ్‌తో ప్రయాణికులు లగ్జరీగా ప్రయాణించవచ్చు. ఇలాంటి సదుపాయాలు ఎకానమీ క్లాస్‌లో ఉండవు. అందుకే సెలబ్రిటీలు ఎక్కువగా ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌పైనే ప్రయాణిస్తారు. అందుకే ఎకానమీ క్లాస్‌లో సెలబ్రిటీలను చూడడం చాలా అరుదు.

కాగా ఇటీవల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, కింగ్‌ విరాట్‌ కోహ్లీ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి ఫ్యాన్స్‌ను అలరించారు. తాజాగా రజినీకాంత్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ అవ్వడంతో ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వ్యాపిస్తోంది. రజనీకాంత్ సింప్లిసిటీని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రజనీకాంత్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 14:25 [IST]
English summary
Super star rajinikanth flies in economy class fans surprised viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+