హ్యాపి బర్త్ డే టు సూపర్‌స్టార్.. కండక్టర్ నుంచి కోట్లు విలువ చేసే కార్లకు అధిపతి..
భారతీయ సినిమా చరిత్రలో సూపర్‌స్టార్ అనగానే అందిరికి గుర్తుకు వచ్చేది ఒక్కరే ఆయనే హీరో రజనీకాంత్. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే చాలా మందికి ఇష్టమైన నటుడు. ఆయన స్టైల్‌కు జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ సినిమా విడుదల అయిందంటే ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా సినిమా హాళ్లు ఫుల్ అయిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికి ఈ సూపర్‌స్టార్ మాత్రం ఒక ప్రత్యేకం. ముఖ్యంగా చాలా మందికి ఈయనలో నచ్చేది, సింప్లిసిటీ. భారతదేశంలో ఎంతో పెద్ద స్థార్ అయినప్పటికీ కూడా ఒక సాదాసీదా మనిషిగా ఉంటారు. లగ్జరీ స్టైల్‌పై ఎక్కువగా ఆసక్తి చూపించరు, కానీ సినిమాల్లో మత్రం ఆయన స్టైల్ ఒక ప్రధాన ఆకర్షణ. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందరితో కలిసి ఒక సామాన్యుడిలా కలిసిపోతారు.
రోడ్డు ప్రక్కన చిన్న హోటల్‌లో భోజనం చేస్తారు. సూట్ బూట్ లాంటివి కాకుండా ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఎలా ఉంటాడో అలానే సూపర్‌స్టార్ ఉంటారు. ఎలాంటి ఆడంబరాలు ఇష్టపడని సాదాసీదా మనిషి. దశాబ్దాల కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న రజనీకాంత్ డిసెంబర్ 12వ తేదీన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంత వయస్సు వచ్చినప్పటికి ఆయన స్టైల్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు.

ఇప్పటికి కూడా కొత్తగా వచ్చిన యువతరం నటుల కంటే కూడా ఎక్కువ ఎనర్జీతో డైలాగ్‌లు, డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఆయన నుంచి ఒక్క డైలాగ్ వచ్చిందంటే చాలు. అది ఎంతో మందికి ఒక సలహాగా కూడా ఉపయోగపడుతుంది. సాధాసీదా మనిషిగా కనిపించే సూపర్‌స్టార్ వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. టాప్ బ్రాండ్‌లకు చెందిన కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. పుట్టిన రోజు నాడు ఆయన కార్ల కలెక్షన్‌ను ఒకసారి చూద్దాం.
లంబోర్ఘిని: సూపర్‌స్టార్ గ్యారేజీలో ఉరుస్ లగ్జరీ కారు ఉంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కలిగి ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అయితే రజనీకాంత్ ఎంచుకున్న వేరియంట్ గురించి మరింత తెలియాలి. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఉరుస్ టాప్ స్పీడ్ 306 కి.మీలు. ఇది v8 ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చింది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్: అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ తన వాహనాలను అందిరికి అమ్మదు. పేరు, ప్రఖ్యాతలు కలిగిన వారికి మాత్రమే విక్రయిస్తుంది. రజనీకాంత్ వద్ద ఫాంటమ్ మోడల్ ఉంది. దీని ధర దాదాపు రూ.8.99 కోట్ల నుంచి రూ.10.48 కోట్లు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. కారును డెలివరీ తీసుకోవడానికి ముందు అదనంగా తన అభిరుచులకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయించుకున్నారు.
రోల్స్ రాయిస్ ఘోస్ట్: రజనీకాంత్ వద్ద మరో రోల్స్ రాయిస్ కూడా ఉంది. ఈ మోడల్ పేరు 'ఘోస్ట్ '. ఇండియా మార్కెట్ ప్రకారం, ఈ కారు ధర రూ.6.95 కోట్ల నుంచి రూ.7.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీనిలో ఆయన కూడా కొన్ని ఇంటీరియర్ మార్పులను ప్రత్యేకంగా చేయించుకున్నారు. ఇది 6.75 లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజిన్ ఆప్షన్‌తో రన్ అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్: ఇండియాలో లగ్జరీ కార్లను విక్రయిస్తున్న మెర్సిడెస్ కంపెనీకి చెందిన G-Class కారును గతంలో సూపర్‌స్టార్ కొనుగోలు చేశారు. ధర దాదాపు రూ.2.55 కోట్ల వరకు ఉంటుంది. మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ BMWకి చెందిన X5 వేరియంట్ కూడా ఆయన వద్ద ఉంది. ఇది ప్రధానంగా X లైన్, M స్పోర్ట్స్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే సూపర్‌స్టార్ కారు పూర్తి వివరాలు తెలియలేదు.
టయోటా ఇన్నోవా: సూపర్‌స్టార్ రజనీకాంత్ వద్ద టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా కారు ఉంది. ఇది ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. దీని ధర దాదాపు రూ.20 లక్షల నుండి రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది మధ్యతరగతి దగ్గరగా ఎక్కువగా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








