సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

ఇటీవలి కాలంలో సూపర్‌బైక్ రైడర్లు భారతదేశంలో అనేక సవాళ్లను ఎదుర్కుంటున్నారు. అధిక సీసీ ఇంజన్ కలిగిన ఈ బైక్‌ల గురించి అవగాహన లేని ప్రజలు, అధికారులు సదరు సూపర్‌బైక్ ఓనర్లపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎక్కువ శబ్ధం చేస్తున్నాయంటూ వారిపై అనవసరమైన కేసులు పెడుతూ, వేధింపులకు గురి చేస్తున్నారు.

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

తాజాగా అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ బైకర్ తాను కొత్తగా కొనుగోలు చేసిన సూపర్‌బైక్‌తో అలా సరదా గడుపుదామని వీధిలోకి తీసుకెళ్లగానే, అక్కడ ఉండే స్థానికులు అతనితో గొడవకు దిగారు.

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

తమ వీధిలో తిరగకూడదంటూ గట్టిగా అరుస్తూ వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా, పోలీసులకు ఫోన్ చేసి, సదరు రైడర్‌ని అరెస్ట్ కూడా చేయించారు. ఇందులోని వ్యక్తులు మాట్లాడుకునే బెంగాళీ భాషను బట్టి చూస్తే, ఇది కలకత్తాలో జరిగినట్లుగా తెలుస్తోంది.

MOST READ:మాట నిలబెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

ఈ వీడియో ప్రకారం, సదరు రైడర్ ఆ వీధిలో రెండు మూడు సార్లు సూపర్‌బైక్‌తో అటూ ఇటూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అతను ఆ పొరుగు వీధిలోనే నివసిస్తున్నట్లు వీడియోలో తెలిపాడు. ఈ బైక్ అధిక శబ్ధం చేస్తోందని, ఇకపై తాను ఈ వీధిలో తిరగడానికి వీళ్లేదని స్థానికులు ఆ రైడర్‌తో గొడవపడ్డారు.

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

సదరు రైడర్ ఈ గొడవనంతా తన హెల్మెట్‌కి ఉన్న గో ప్రో కెమెరాలో రికార్డ్ చేసి, తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. తన సూపర్‌బైక్‌ను రెండు రోజుల క్రిందటే డెలివరీ తీసుకున్నానని, బైక్‌లో ఎలాంటి మోడిఫికేషన్లను చేయలేదని అందులో వివరించాడు.

MOST READ:ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

అయితే, స్థానికులు చెప్పే వివరాల ప్రకారం, ఆ వీధిలోని ఓ ఇంటిలో హార్ట్ పేషెంట్ ఉన్నాడని, ఇలాంటి ఎక్కువ శబ్దం చేసే బైక్‌ల వలన అతని పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అది విన్న బైక్ రైడర్ వారికి అనేక మార్లు క్షమాపణలు చెప్పి, తనకి ఆ విషయాలేవీ తెలియవని, ఇకపై ఈ వీధిలో తాను బైక్ నడపనని కూడా చెప్పాడు.

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

కానీ రైడర్ చెప్పిన సమాధానం సదరు వాగ్వాదానికి దిగిన కుటుంబాన్ని సంతృప్తిపరచలేదు. వారు బైక్ రైడర్ వైపు చేతులు చూపిస్తూ, వారిని బెదిరిస్తూ గట్టిగా అరవడాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. చాలా సందర్భాల్లో రైడర్ తన హెల్మెట్‌కి ఉన్న కెమెరాన్ని ఆపేల్సియాందిగా వారు బెదిరించారు.

MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

అంతటితో ఆగని స్థానికులు, సంఘటనా స్థలానికి రైడర్ తండ్రిని కూడా పిలిపించారు. వాగ్వాదానికి దిగిన కుటుంబం రైడర్ తండ్రిపై కూడా గట్టిగా అరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి ఇరు కుటుంబాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా రైడర్‌పై న్యూసెన్స్ కేస్ పెట్టి, అరెస్ట్ చేయించారు. అనంతరం ఓ పోలీసు తన బైక్‌ని సీజ్ చేయాలని, స్టేషన్‌కు తీసుకువెళ్లాని కోరాడు. దీంతో రైడర్ ఈ సూపర్‌బైక్‌ని ఎవరికంటే వారికి ఇవ్వనని, తానే నడుపుకొని స్టేషన్‌కి వస్తానని చెప్పాడు.

MOST READ:ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్

సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

ఆ తర్వాత అతడిని పోలీసులు కొన్ని గంటలు స్టేషన్లో ఉంచి, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనలో రైడర్ తప్పు లేదని, అవతలి వారే అనవసరంగా హంగామా చేశారంటూ నెటినజ్లు ఫైర్ అవుతున్నారు.

తన బైక్ ఎక్కువ శబ్దం చేసినందుకు గానూ రైడర్ చాలాసార్లు క్షమాపణ చెప్పినప్పటికీ, అవతలి వారు వినిపించుకోకుండా, అసభ్యకర రీతిలో రైడర్‌ని రైడర్ కుటుంబాన్ని అవమానిస్తూ ప్రవర్తించిన విధానం సరైనదేనా? ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.

Most Read Articles

English summary
Superbike Loud Exhaust Note, West Bengal Police Arrested A Rider - Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X