గంటకు 255 కి.మీ. వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ సూపర్‌బస్!!

ఈ సూపర్ బస్సుకు ముందువైపు రెండు చక్రాలు వెనుకపై నాలుగు చక్రాలు మొత్తం ఆరు చక్రాలు ఉంటాయి. ముందువైపున్న రెండు చక్రాలు స్వతంత్రంగా విడివిడిగా తిరుగుతాయి. దీని వల్ల బస్ టర్నింగ్ రేడియస్‌ను తగ్గించేందుకు వీలవుతుంది. ఇది లిథియం బ్యాటరీలతో పనిచేస్తుంది. ఈ సూపర్‌బస్ పొడవు 15 మీటర్లు. దీనికి 16 గల్-వింగ్ డోర్లు (పైవైపుకు తెరుచుకునేవి) ఉంటాయి. టియూ డెల్ఫ్ట్ యూనివర్సిటీ బృందం ఈ కారును విడుదల చేసింది. ఈ బృందంలో మాజీ డచ్ వ్యోమగామి వుబ్బో ఓక్లెస్ కూడా ఉన్నారు.
దుబాయ్‌లో జరిగిన ఓ వాణిజ్య ప్రదర్శన షోలో ఈ సూపర్ బస్సును ప్రదర్శనకు ఉంచారు. ఈ సూపర్‌బస్సు లోపల ఎక్కువ స్థలం కలిగి ఉండి, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌ను కలిగి ఉంటుంది. విలాసవంతమైన సీటింగ్‌తో ప్రయాణికులకు ఓ లగ్జరీ స్పోర్ట్స్ కారులో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా గల్-వింగ్ డోర్లు ఉంటాయి. ప్రయాణికులు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ బస్సులో ప్రయాణించవచ్చు. ఇందుకు ప్రయాణికులు చేయాల్సిందల్లా.. తాము ఎక్కడ ఉన్నామో ఎస్ఎమ్ఎస్ చేయడం లేదా, ఇంటర్నెట్ ద్వారా ఆర్డర్ చేస్తే బాలు. ప్రజల వద్దకు పాలన లాగా ప్రయాణికుల వద్దకు ఈ బస్సు వస్తుంది.


Click it and Unblock the Notifications








