నేటి వీడియో: దుబాయ్ పోలీసుల సూపర్‌కార్లతో పెరేడ్
సూపర్‌కార్ల స్వర్గంగా చెప్పుకునే రెండు ప్రాంతాల్లో ఒకటి మొనాకో, రెండోది దుబాయ్. అత్యంత ధనిక దేశమైన దుబాయ్‌లో సూపర్‌కార్ ప్రియుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దుబాయ్‌లో పోలీసులు కూడా సూపర్‌కార్లనే ఉపయోగిస్తున్నారంటే, అక్కడ వీటికి క్రేజ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాల్లో ఇప్పటికే లెక్కలేనన్ని సూపర్‌కార్లు ఉన్నాయి. దాదాపు అన్ని కార్ల కంపెనీలు అందిస్తున్న ఉత్పత్తులు వీరి కలెక్షన్‌లో ఉన్నాయి. దుబాయ్ పోలీసులు వీటన్నింటినీ తమ పెరేడ్ కోసం కూడా ఉపయోగిస్తారు. ఇటీవల జరిగిన దుబాయ్ గ్రాండ్ పెరేడ్ 2013లో ఇదిగో ఇలా పోలీసుల సూపర్‌కార్లన్నీ ఓ చోట కొలువుదీరాయి.
అంతేకాదు, ఈ పెరేడ్‌లో వివిధ సూపర్‌కార్ల యజమానులు కూడా తమ సూపర్‌కార్లతో పోలీస్ కార్ల వెనుక వెళ్తూ నగర రోడ్లపై హల్‌చల్ చేశారు. ఈ సూపర్‌కార్ల జాబితాలో బుగాటి, లాంబోర్గినీ, ఫెరారీ, పోర్షే, మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి, బెంట్లీ, రోల్స్ రాయిస్ వంటి బ్రాండ్లకు చెందిన అనేక మోడళ్లు ఉన్నాయి. మరి ఈ అద్భుతమైన దుబాయ్ గ్రాండ్ పెరేడ్ మనం కూడా ఈ వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/1J-DObuH6gc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








