అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు.. వాటి వివరాలు

సాధారణంగా వాహనప్రియులకు వాహనాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. సాధారణ వ్యక్తులు వాహనాలపై చూపించే ఆసక్తి ఒక ఎత్తైతే, పొలిటికల్ లీడర్స్ మరియు సెలబ్రెటీస్ వాహనాలపై మరింత ఎక్కువ ఇష్టం చూపుతారు. కొంతమందికి వాహనాల మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఈ కారణంగానే వారు అనేక లగ్జరీ వాహనాలను కలిగి ఉంటారు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

హీరోలపై ఎక్కువ అభిమానం కలిగిన వ్యక్తులు వారి యొక్క లైఫ్ స్టైల్, వారు ఉపయోగించే కార్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో భాగంగానే కొంతమంది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన హీరోలు వాడే లగ్జరీ కార్లను గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

చిరంజీవి :

తెలుగు వారి అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. అందులో రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటివి ఉన్నాయి. ఈ లగ్జరీ కార్లన్నింటికీ కలిపి ఖర్చు రూ. 10 కోట్లు. చిరంజీవి వాహనప్రేమికుడు, అందుకే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఇవన్నీ చిరంజీవి ఉపయోగిస్తూ ఉంటాడు.

MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

బాలకృష్ణ :

నరసింహాగా ప్రసిద్ధి చెందిన బాలకృష్ణ తెలుగు వారి గుండెల్లో అనిర్వచనీయమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. బాలకృష్ణ రాయల్టీగా ఉంటాడు. ఒక్క సినిమా రంగంలో మాత్రమే కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యే గా కూడా ఎన్నికయ్యారు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

నందమూరి బాలకృష్ణ అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. అందులో బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ (రూ. 1.6 కోట్లు) మరియు పోర్స్చే పనామెరా (రూ. 2.3 కోట్లు) కూడా ఉన్నాయి. ఈ రెండు కార్లు జర్మన్ బ్రాండ్ కి చెందినవే.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 రివ్యూ.. ఇది అభిమానుల అంచనాలను అందుకుంటుందా..?

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

అక్కినేని నాగార్జున :

తెలుగు సినీ పరిశ్రమలో కార్లు మరియు బైకులపై ఎక్కువ వ్యామోహం కలిగిన హీరోలలో ఒకడు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జునకు కార్లంటే ఇష్టమని దాదాపు అందరికి తెలిసిందే,

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

నాగార్జున బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, ఆడి ఎ 7 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎం 6 వంటి అనేక రకాల కార్లను కలిగి ఉన్నాడు. కింగ్ సినిమాలో కనిపించే ఫెరారీ ఎఫ్ 430 వంటి లగ్జరీ కారుని కూడా యితడు కలిగి ఉన్నాడు. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య ఎఫ్‌430 ను ఒక రేస్‌కు తీసుకువచ్చాడు.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ క్లాసిక్ కార్ ర్యాలీ ; పూర్తి వివరాలు

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

రవితేజ :

విక్రమార్కుడు, బలాదూర్ వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న మాస్ మహారాజ్ మన రవితేజ, ఎక్కువమంది అభిమానులను కలిగి ఉన్న హీరోలలో రవితేజ ఒకరు. రవితేజ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ కారుని కలిగి ఉన్నాడు. ఈ యాక్టర్ ఈ ఎగ్జిక్యూటివ్ కారును తరచుగా ఉపయోగిస్తూ ఉంటాడు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 3.0-లీటర్, ఇన్లైన్-సిలిండర్ మోటారును కలిగి ఉంది. ఇది 282 బిహెచ్‌పి శక్తి మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర ఇండియన్ ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.38 కోట్లు.

MOST READ:లంబోర్ఘిని నుంచి రాబోయే సూపర్ కార్ వి10 టీజర్

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

పవన్ కళ్యాణ్:

జనసేన పార్టీ అధినేత తెలుగు సినిమా రంగంలో అత్యధికగా అభిమానులను కల్గిన హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు సినీరంగంలో బాగా ప్రసిద్ధి చెందిన యితడు, రాజకీయ రంగప్రవేశం కూడా చేశారు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

పవన్ కళ్యాణ్ మెర్సిడెస్ యొక్క అభిమానిగా కనిపిస్తాడు, ఎందుకంటే అతను వద్ద ఉన్న రెండు లగ్జరీ కార్లు బెంజ్ కార్లే. అవి ఒకటి మెర్సిడెస్ బెంజ్ జి 55 ఎఎమ్‌జి మరియు రెండవది మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్. పవన్ కళ్యాణ్ తన రోజువారీ ప్రయోజనాల కోసం తన ఆడి క్యూ 7 ఎస్‌యూవీని ఉపయోగిస్తాడు. దీని ధర రూ .80 లక్షలకు పైగా ఉంటుంది. యితడు ఈ కార్లను మాత్రమే కాకుండా లగ్జరీ బైకులను కూడా కలిగి ఉన్నాడు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

అక్కినేని అఖిల్ :

అక్కినేని నాగార్జుల కుమారుడు అక్కినేని అఖిల్ కార్లు మరియు బైకుల పట్ల ఎక్కువ ఆసక్తిని కనపరుస్తాడు. అక్కినేని అఖిల్ తక్కువ సంఖ్యలో సినిమాలు కూడా చేసారు. అఖిల్ మెర్సిడెస్ బెంజ్ మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి కారుని కల్గి ఉన్నాడు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

ఈ ఎస్‌యూవీ ధర రూ. 1.5 కోట్లు. ఇది చేతితో రూపొందించిన అప్హోల్స్టరీతో అమర్చబడి ఎక్స్టీరియర్ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇవి వాహనదారులను ప్రమాదం నుండి బయటపడేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారు 5.5-లీటర్ వి 8 ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 571 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. అఖిల్ ఈ కారుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

అల్లు అర్జున్ :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిఎండబ్ల్యు X-6 కారుని కలిగి ఉన్నాడు. ఎక్స్‌-సిరీస్ శ్రేణిలో ఎస్‌యూవీ అత్యధిక ప్రీమియం ఎస్‌యూవీ. ఇది బిఎమ్‌డబ్ల్యూ కాబట్టి, చాలా లగ్జరీగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

అల్లు అర్జున్ ఇది మాత్రమే కాకుండా ఒక విలాసవంతమైన కారావ్యాన్ కలిగి ఉన్నాడు. ఇది చూడటానికి నిజంగా ఇంద్ర భవనంలాగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఇందులోనే ఉంటాయి. ఇది నిజంగా సూపర్ లగ్జరీ వ్యాన్.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

మహేష్ బాబు:

మహేష్ బాబుకు రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ వోగ్ ఎడిషన్ ఉంది. వోగ్ ఎడిషన్ ఇది రూ. 1.5 కోట్లు, ఇది అతని భార్య నమ్రత గిఫ్ట్ గా ఇచ్చింది. రేంజ్ రోవర్ కారు శ్రీమంతుడు విజయం తరువాత, అతను దీనిని కొనుగోలు చేసాడు, దీని ధర రూ. 4 కోట్లు. మహేష్ బాబు రేంజ్ రోవర్స్ అభిమాని.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

అక్కినేని నాగచైతన్య :

నాగ చైతన్య కూడా తన తండ్రిలాగా కార్ అభిమాని, యితడు రేంజ్ రోవర్ వోగ్, నిస్సాన్ జిటిఆర్, రేంజ్ రోవర్ వంటి కార్లను కలిగి ఉన్నాడు. వీటి ధర సుమారు రూ. 7 కోట్లు. నాగచైతన్య సాధారణంగా నిస్సాన్ జిటిఆర్ ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఈ కారులో ప్రయాణించడం చాలామందిచే గుర్తించబడింది. అంతే కాకుండా నాగ చైతన్య రేసింగ్ ఈవెంట్లలో కూడా పాల్గొంటాడు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

జూనియర్ ఎన్టీఆర్:

సినిమా పరిశ్రమలో తాతకి తగ్గ మనవడిగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ పోర్స్చే అభిమాని. అతను సాధారణంగా కేమాన్ ఎస్ ను నడుపుతాడు. రెండు సీట్ల పోర్స్చేను నడిపిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఈ కారు ధర ఒక కోటి రూపాయలు. ఈ కారులో 3,436 సిసి ఇంజన్ ఉంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

ప్రభాస్ :

తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నటుడు ప్రభాస్. బాహుబలి సినిమాతో ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ఇతర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందాడు. తన నటనా చాతుర్యంతో ఎక్కువమంది అభిమానులు కలిగిన హీరోలలో ఒకరు ప్రభాస్.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

చిరంజీవి కాకుండా, రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను కలిగి ఉన్న ఏకైక నటుడు ప్రభాస్, దీని ఖరీదు రూ. 8 కోట్లు. ఇది మాత్రమే కాకుండా అతను బీఎండబ్ల్యూ X5 మరియు జాగ్వార్ XJ వంటి విలవసంతమైన కార్లను కలిగి ఉన్నాడు. వీటి ధర సుమారు రూ. 10 కోట్లు. ఇటీవల ప్రభాస్ తన జిమ్ మాస్టర్ కి ఒక రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

రామ్ చరణ్:

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కార్లపైనా ఎక్కువ ఇష్టం చూపుతారు. చరణ్ తన పెళ్లికి ఆస్టన్ మార్టిన్ బహుమతిగా పొందాడు. ఈ కార్ ధర సుమారు రూ. 1.8 కోట్లు. ఇది మాత్రమే కాకుండా శక్తివంతమైన V8 ఇంజిన్ కలిగిన రేంజ్ రోవర్ కూడా కలిగి ఉన్నాడు. దీని ధర సుమారు రూ. 2.75 కోట్లు.

మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

రామ్ :

తెలుగు సినిమా రంగంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ లజ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఇందులో తెల్లటి పోర్స్చే కయెన్ ఉంది. ఈ లగ్జరీ కార్ సంపాదన ద్వారానే కొన్నానని చెబుతాడు. రామ్ గతంలో చేవ్రొలెట్ ఆప్ట్రా మరియు హోండా అకార్డ్ కలిగి ఉన్నాడు. ఇది స్టార్ హీరోకి ఒక పెద్ద గర్వించదగిన ఘనత.

ఇక్కడ మనం కొంతమంది తెలుగు స్టార్ హీరోల లగ్జరీ కార్లను గురించి తెలుసుకున్నాం.. కదా.. ఇక్కడ మీ అభిమాన హీరో కూడా ఉన్నాడేమో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఆటో మొబైల్ కి సంబంధించిన వార్తల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.

Most Read Articles

English summary
These Costly Cars Of Telugu Heroes Will Make You Want One. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X