అంబులెన్స్‌ను బహుమతిగా ఇచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎవరికంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు. తన నటన, సింప్లిసిటీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే రజనీకాంత్ ఫౌండేషన్ పేరుతో ఎందరో అభాగ్యులకు సేవ చేస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓ వ్యక్తి సామాజిక సేవను మెచ్చుకొని ఖరీదైన బహుమతి ఇచ్చారు.
తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన మణిమారన్ ఓ సామాజిక కార్యకర్త.. సుమారు 21 సంవత్సరాలుగా ప్రభుత్వ హాస్పిటల్ సహా ఇతర ప్రాంతాల్లోని అనాథ శవాలకు పోలీసుల అనుమతితో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంటారు. కరోనా సమయంలోనూ మారన్ తన సేవలను కొనసాగించారు. మణిమారన్ సేవలను మెచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అవార్డులతో సత్కరించాయి.

మణిమారన్ సేవలను గుర్తించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ అతన్ని అభినందించారు. చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు. ఇంటికి పిలుపించుకొని రూ.8 లక్షల విలువైన మారుతి సుజుకి ఎకో అంబులెన్స్‌ను బహుమతిగా ఇచ్చారు. సేవలను కొనసాగించాలని ప్రోత్సహించారు. దీనిపై రజనీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక కార్యకర్త మణిమారన్ ఇప్పటి వరకు సుమారు 2 వేలకు పైగా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవకు మెచ్చి రజనీకాంత్ ఫౌండేషన్ తరఫున అంబులెన్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ అంబులెన్స్‌తో మరింత మందికి సేవ చేయగలుగుతానని మణిమారన్ చెబుతున్నారు.

ఈ అధునాతన అంబులెన్స్‌తోపాటు, ఆపద సమయంలో అవసరమయ్యే కొన్ని పరికరాలను కూడా రజనీకాంత్ ఫౌండ్‌షన్ మణిమారన్‌కు అందజేసింది. ఈ అంబులెన్స్ మారుతి ఎకో రకానికి చెందినది. మారుతి ఈ వాహనాన్ని ప్యాసింజర్, కార్గో మరియు అంబులెన్స్ రకాల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. మణిమారన్ కోసం రజనీకాంత్ ఫౌండేషన్ మారుతి ఎకో అంబులెన్స్ రకాన్ని కొనుగోలు చేశారు.
ఈ వాహనం ద్వారా పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మారుతి ఎకో నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ. అందుకే కమర్షియల్ సెగ్మెంట్‌తోపాటు ప్యాసింజర్ సెగ్మెంట్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. మారుతి ఎకో అంబులెన్స్ 1.2 లీటర్ k సీరిస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. 6000 rpm వద్ద 80bhp మరియు 3000 rpm వద్ద 104Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి ఈ కారును CNG వెర్షన్‌లో కూడా భారత్‌లో అందుబాటులో ఉంచింది. సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ కారు గరిష్ఠంగా 27.05 కిమీ మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ వెర్షన్ 19.71 kmpl నుంచి 20.20 kmpl మైలేజీని ఇస్తుంది. మరియు మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్యూయర్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








