సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు రూ.1.26 కోట్ల కారును బహుమతిగా ఇచ్చిన జైలర్‌ నిర్మాత

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ జైలర్‌ సినిమాతో హిట్‌కొట్టారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్‌ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తోంది. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. నెల్సన్‌ దిలీప్‌ డైరెక్షన్‌ చేశారు. ఆగస్టు 10న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తూ.. ఇప్పటికి రూ.600 కోట్లు వసూళ్లు సాధించిందని అంచనా.

జైలర్‌ విజయంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్‌.. గురువారం సాయంత్రం సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఇంటికి వెళ్లారు. సినిమా లాభాల్లో కొంత మొత్తాన్ని చెక్‌రూపంలో రజనీకి అందించారు. అనంతరం రెండు BMW కార్లను రజనీ వద్దకు తీసుకెళ్లి.. నచ్చిన కారును తీసుకోవాలని కోరారు. ఇందులో BMW X7 మోడల్ కారును సూపర్‌స్టార్‌ ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

superstar Rajinikanth gifted BMW X7 car

రజనీకాంత్‌కు బహుమతిగా ఇచ్చిన BMW X7 కారు ప్రస్తుతం భారత మార్కెట్‌లో రూ.1.24 కోట్లు నుంచి రూ.1.26 కోట్లు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు 3 -లీటర్‌ ట్విన్‌ టర్బో ఇన్‌లైన్‌ 6 సిలిండర్‌ పెట్రోల్‌, డిజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌లో 381ps గరిష్ఠ శక్తి, 520Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే డీజిల్‌ వేరియంట్‌లో 340ps, 700Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో లభిస్తుంది. BMW X7 కారు 4WD టెక్నాలజీని కలిగి ఉంటుంది. వేరియంట్‌ను బట్టి 11.29 kmpl నుంచి 14.31 kmpl మైలేజీని అందిస్తుంది.

superstar Rajinikanth gifted BMW X7 car

BMW X7 కారు లోపలి భాగంలో 12.3 అంగుళాల డిజిటల్‌ ‌డ్రైవర్‌ డిస్‌ప్లే, 14.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌, 16 స్పీకర్‌ హర్మాన్‌ కార్డాన్ మ్యూజిక్‌ సిస్టమ్‌, డిజిటల్‌ కీ, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, కనెక్టటెడ్‌ కార్‌ టెక్‌ సహా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారు నాలుగు డ్రైవింగ్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. కంఫర్ట్‌, ఎఫిషియెంట్‌, స్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ ప్లస్‌ మోడ్‌లున్నాయి.

ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. భద్రత పరంగా ఈ కారు ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నరింగ్‌ బ్రేక్ కంట్రోల్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ సహా అత్యంత కీలకమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆడి, వోల్వో సంస్థకు ఈ కారు గట్టి పోటీ ఇస్తున్నాయి.

superstar Rajinikanth gifted BMW X7 car

రెండు రోజుల క్రితం సూపర్‌స్టార్‌ రజనీకాంత్ బెంగళూరులోని బీఎంటీసీ బస్‌ డిపోకు తన స్నేహితుడు రాజ్‌ బహదూర్‌తో కలిసి సందర్శించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారందరితో కాసేపు రజనీకాంత్ మాట్లాడారు. సెల్ఫీలు దిగారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 1, 2023, 17:08 [IST]
English summary
Superstar rajinikanth gifted rs1 26 crore worth bmw x7 car from jailer producer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+