Bike Taxi ఢిల్లీలో బైక్‌ టాక్సీలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాలపై స్టే..

దేశంలో పట్టణీకరణ వేగంగా పెరగడంతో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా ఉద్యోగస్థులు ఎక్కువగా బైక్ టాక్సీలపై ఆధారపడుతున్నారు. ఇవి సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన రవాణా మార్గంగా మారాయి. ఈ ద్విచక్ర వాహన సేవలు ప్రయాణికులకు సమయం ఆదాతో పాటు, తక్కువ ఖర్చులో సులభంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి దోహదపడుతున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రాపిడో బైక్ టాక్సీలు వైరలయ్యాయి. రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్లపై ఆటో రిక్షా డ్రైవర్లు దాడి చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

Bike Taxi

బైక్‌ టాక్సీ సర్వీసులను దేశ రాజధానిలో నిర్వహించేందుకు అనుమతినిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తుది సర్క్యులర్ వెలువడే వరకు ఢిల్లీలో ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధిస్తూ తీర్పునిస్తూ బైక్ ట్యాక్సీ రైడర్లకు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ రవాణా శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల నిర్వహణకు సంబంధించిన తుది విధానాన్ని అధికారికంగా ప్రకటించే వరకు సుప్రీంకోర్టు తీర్పు ఈ సేవలను నిషేధించనుంది. ఢిల్లీ రవాణా శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ రిజిస్ట్రేషన్‌లతో ఉన్న బైక్‌లను ఉపయోగించడాన్ని నిషేధించిందిన సంగతి తెలిసిందే.

Bike Taxi

గతంలో ఢిల్లీ హైకోర్టు ఓలా, ఉబర్ మరియు రాపిడో సహా ప్రైవేట్ రిజిస్టర్డ్ బైక్‌లను ఢిల్లీలో టాక్సీల వలె నడపవచ్చని తెలిపింది. తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టును ఢిల్లీ ప్రభుత్వం ఆశ్రయించగా, తుది ఉత్తర్వులు వెలువడే వరకు బైక్ ట్యాక్సీలను ఏ విధంగానూ నడపరాదని స్పష్టం చేసింది. దీంతో రిక్షా డ్రైవర్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఫిబ్రవరిలో మోటారు వాహనాల చట్టం 1998 ని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ బైక్ టాక్సీలను నిషేధించింది. ఈ విషయమై ర్యాపిడో ఉపశమనం కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో బైక్ ట్యాక్సీలు ఓలా, ఉబర్‌ మరియు ర్యాపిడోలు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాయి.

రైడ్ షేరింగ్ సేవల కోసం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల వినియోగానికి సంబంధించి అధికారులు ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలను అందించాల్సి ఉంది. ఓలా, ఉబర్‌ మరియు ర్యాపిడో కంపెనీల బైక్ టాక్సీలు ఢిల్లీ, హైదరాబాద్‌ సహా దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు లేకుండా తక్కువ ఖర్చుతో ప్రయాణికులను ఎక్కడికైనా తీసుకువెళ్లేందుకు బైక్ ట్యాక్సీలు సహకరిస్తాయని ఈ కంపెనీలు వాదిస్తున్నాయి.

అయితే భద్రత, సరైన లైసెన్సింగ్ లేకపోవడానికి సంబంధించి పలు ఆందోళనలు తలెత్తాయి. బైక్ టాక్సీలు చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా తక్కువ ఖర్చుతో సమయాన్ని ఆదా చేయడం వల్ల ప్రజాదరణ పొందాయి. తాజా నిషేధంతో, అగ్రిగేటర్లు మరియు డ్రైవర్లు ఇద్దరూ అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

న్యూ ఢిల్లీలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఈ సేవలకు స్పష్టమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం పట్ల కోర్టు ఆందోళనను ప్రతిబింబిస్తుంది. ప్రయాణికులు మరియు డ్రైవర్ల భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేకించి దేశంలో నిబంధనలు అనివార్యం. బైక్ టాక్సీల ప్రయోజనాలను ప్రయాణికులకు సమతుల్యం చేయడానికి ప్రభుత్వం స్పష్టమైన నియమాలు మరియు నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 14, 2023, 17:06 [IST]
English summary
Supreme court bans ola uber and rapido bike taxi services in delhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+