ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

భారతదేశంలో చాలా వరకు పండుగలను చాలా అట్టహాసంగా జరుపుతారనే విషయం అందరికి తెలిసిందే, అయితే మనదేశంలో దీపావళి చాలా మందికి ఇష్టమైన పండుగ, దీపాల కాంతులతో కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. అంతే కాకుండా ఈ పండుగ రోజున భారతదేశంలోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇవ్వడం, కార్లు మరియు బైకులను కూడా గిఫ్ట్ గా ఇవ్వడం మనం చూసి ఉంటాము. అయితే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్ స్కూటర్లను గిఫ్ట్ గా ఇచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

సూరత్‌కు చెందిన కంపెనీ ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలోని 35 మంది ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను గిఫ్ట్ గా అందించింది. పర్యావరణాన్ని కాపాడటానికి మరియు పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్ గా అందించడం జరిగిందని, ఆ కంపెనీ డైరెక్టర్ 'సుభాష్ దావర్' తెలిపారు.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

ఎలక్ట్రిక్ స్కూటర్లు పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు, అంతే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రస్తుతం అమాంతం పెరిగిన ఇంధన ధరలను భరించడం సామాన్యప్రజలకు చాలా కష్టంగా మారింది. కావున తమ ఉద్యోగులకు ఈ రకమైన గిఫ్ట్ అందించడం జరిగింది.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్స్ స్కూటర్లు అందించిన కంపెనీ 'ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అలయన్స్ గ్రూప్'. ఈ కంపెనీ తమ 35 మంది ఉద్యోగులకు ఒకినావా నుండి ప్రైజ్‌ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గిఫ్ట్ గా అందించింది. దీనికి సంబంధించి ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

భారతీయ మార్కెట్లో ఒకినావా (Okinawa) యొక్క ప్రైజ్‌ప్రో (PraisePro) ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర రూ. 76,848 (ఎక్స్-షోరూమ్). ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. రోజువారీ ప్రయాణానికి ఇది చాలా అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటర్.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

Okinawa PraisePro ఎలక్ట్రిక్ స్కూటర్ 2.0 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌లో 1000 వాట్ల మోటార్‌ను అమర్చారు. ఈ స్కూటర్ 2500 వాట్ల పీక్ పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. Okinawa PraisePro గరిష్టంగా 58 కి.మీ/గం వేగాన్ని కలిగి ఉంటుంది.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

Okinawa PraisePro ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం మూడు గంటల సమయంలోనే పూర్తిగా చేసుకోగలదు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఇది దాదాపు 88 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అతి తక్కువ ధరతో ఆధునిక ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందించే వాటిలో ఇది కూడా ఒకటి.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

పండుగలకు బైకులను మరియు కార్లను గిఫ్ట్ గా ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు 2018 లో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సంజీవ్ ధోలాకియా తన 600 మంది ఉద్యోగులకు దీపావళి కానుకలుగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కార్లను గిఫ్ట్ అందించి, సంచలనం సృష్టించారు.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

స్వదేశీ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఒకినావా ఆటోటెక్ కంపెనీ ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.150 కోట్ల పెట్టుబడితో రాజస్థాన్‌లోని భివాడి ప్లాంట్‌లో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ప్రస్తుతం కంపెనీ ఏడాదిలో 5 నుంచి 6 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. ఈ స్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తే బుక్ చేసుకున్న అందరికి కూడా త్వరతిగతిన డెలివరీ చేయవచ్చు.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

ప్రస్తుతం, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉపయోగించే 92 శాతం భాగాలు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. కంపెనీ బయటి దేశాల నుంచి స్కూటర్ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుంది. కంపెనీ ప్రకారం, రాబోయే కొన్ని సంవత్సరాలలో వాహనాల తయారీలో 100 శాతం స్థానికీకరణ సాధించబడుతుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ కూడా కొంత సహకారం అందిస్తుంది.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై ఎక్కువ భారం మోపుతున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన సంఖ్యలో మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు. కానీ ఇప్పటికే చాలా కంపెనీలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి.

ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్‌గా అందించిన సూరత్‌ కంపెనీ: వివరాలు

ఇదిలా ఉండగా భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ అక్టోబర్‌లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ గత నెలలో 6,366 యూనిట్ల హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌ నెల అమ్మకాలు ఏకంగా 1900 శాతం పెరిగాయి. అక్టోబర్ 2020 లో కంపెనీ కేవలం 314 ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది అని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Surat based company gifts electric scooter to employees details
Story first published: Friday, November 5, 2021, 15:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X