ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన చెక్క సర్ఫ్‌బోర్డ్
సర్ఫింగ్ (Surfing) అనేది సముద్రపు అలలపై చేసే ఓ ప్రత్యేకమైన విన్యాసం. మనదేశంలో దీనికి అంత పెద్దగా ప్రాచుర్యం లేకపోయినప్పటికీ, విదేశాల్లో మాత్రం దీనికి అత్యంత పాపులరాటీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే, కృత్రిమ సర్ఫింగ్ కేంద్రాలు కూడా ఏర్పడ్డాయి. ఈ సర్ఫింగ్ ఉపయోగించే సాధనాన్ని 'సర్ఫ్‌బోర్డ్' (Surfboard) అంటారు.
సర్ఫింగ్ పాలినేషియన్ సంస్కృతిలో భాగంగా ప్రారంభమైంది. వాస్తవానికి సర్ఫింగ్ కోసం ఉపయోగించే సర్ఫ్‌బోర్డుల రేట్లు పెద్ద ఎక్కువగా ఉండవు. అయితే, ఇటీవలి కాలంలో ఈ సర్ఫ్‌బోర్డులు కూడా ఖరీదైన కార్ల మాదిరిగా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయాయి. ఇప్పుడు ఈ కథనంలో మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ ఖరీదైన సర్ఫ్‌బోర్డ్ గురించే.
ఇదిగో ఈ ఫొటోలలో మీరు చూస్తున్న సర్ఫ్‌బోర్డ్ ఖరీదు 1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.78 కోట్లు. మరి ఇంత ఖరీదు చేయటానికి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఈ చెక్క సర్ఫ్‌బోర్డుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

ర్యాంపాంట్‌గా పిలిచే ఈ ఎక్స్‌క్లూజివ్ సర్ఫ్‌బోర్డ్‌ను న్యూజిలాండ్‌లోని రాయ్ స్టువార్ట్ అనే వ్యక్తి తయారు చేశాడు. దాదాపు 20 ఏళ్ల నిరంతరాయ టెస్టింగ్‌కు ప్రతిఫలమే ఈ 10'6" సర్ఫ్‌బోర్డ్. ఇది ఈ అందమైన షేపుకు రావటానికి ముందు దీనిని అనేక ప్రాంతాలు, పరిస్థితుల్లో టెస్టింగ్ చేశారు.

ర్యాంపాంట్‌ను పౌలోవ్నియా చెక్క నుంచి తయారు చేశారు. ఈ చెక్క అత్యధిక ధృడత్వాన్ని కలిగి ఉంటుంది. సర్ఫ్‌బోర్డ్ సర్ఫేస్‌లను తయారు చేయటానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ చెక్కతో చేయటం వలన ఇది సర్ఫింగ్ చేసేటప్పుడు గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవటం సాధ్యమవుతుంది. ఈ చెక్క చాలా సౌకర్యవంతమైనది కూడా.

ఈ సర్ఫ్‌బోర్డ్‌కు ఆరు ఇంచ్‌ల మందం లిగిన ఓ వోర్టెక్స్ టన్నల్ ఉంటుంది, దీనిని కహికాటీ చెట్టు నుంచి తయారు చేశారు. ఈ చెట్టు కేవలం న్యూజిల్యాండ్‌లో మాత్రమే ఉంటుందట. దీని వలనే ఈ సర్ఫ్‌బోర్డుతో అత్యధిక వేగాన్ని చేరుకోవటం సాధ్యమవుతుందని రాయ్ వివరించాడు.

రాయ్ స్టువార్ట్ తన తొలి సర్ఫ్‌బోర్డ్‌ను 1969లో చెక్కతో తయారు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాయ్ చెక్కతో తయారు చేసే సర్ఫ్‌బోర్డ్స్ అభివృ్ద్ధి కోసం చాలానే కృషి చేశాడు.

ఈ డిజైన్‌ను పర్‌ఫెక్ట్ చేయటానికి రాయ్ స్టువార్ట్‌కు సుమారు 16 ఏళ్ల సమయం పట్టిందట. ఈ బోర్డుతో అత్యధిక స్పీడ్‌ను సాధించడం ఓ ఎత్తయితే, దీని అందమైన డిజైన్ మరో ఎత్తు.


Click it and Unblock the Notifications








