కారులో శృంగారం జరపటంలో బ్రిటీషర్లు భేష్..!
ఇటీవల బ్రిటన్‌లో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బిబిఏ రెమన్ నిర్వహించిన ఓ సర్వేలో 49 శాతం మంది బ్రిటీష్ వాళ్లు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కారులో శృంగారం జరిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఇలా కారులో శృంగారం జరిపేందుకు గాను సదరు బ్రిటీషర్లు ఎక్కువగా చిన్నకార్లనే ఎంచుకున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది.
బిబిఏ రెమన్ 2018 మంది పెద్దవాళ్లపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 49 శాతం మంది ఈ ప్రశ్నకు (కారులో శృంగారం చేశారా అనే ప్రశ్నకు) అవును అని సమాధానం చెప్పారు. ఇందులో 59 శాతం మంది వ్యక్తులు 35-55 సంవత్సరాల వయస్సు కలిగిన వారు కాగా 38 శాతం మంది 18-34 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. ఈ తాజా గణాంకాలను బట్టి చూస్తే, ఇది వరకటి సంవత్సాల్లో కారులో శృంగారం జరిపే వారి సంఖ్య నానాటికీ తగ్గుతున్నట్లు తెలుస్తోందని బిబిఏ పేర్కొంది.
మరిన్ని ఆసక్తికర విషయాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వ్యూపాయింట్
ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా పార్టిసిపెంట్‌లను అడగటం జరిగింది. కారులో శృంగారం జరిపేందుకు ఎలాంటి ప్రదేశాలను ఎంచుకుంటారని వారిని అడగగా, అందులో 37 శాతం మంది వ్యూపాయింట్‌లను ఎంచుకుంటామని చెప్పారు.

పార్కింగ్ ప్రదేశాలు
29 శాతం మంది పార్కింగ్ ప్రదేశాలను ఎంచుకుంటామని చెప్పారు.

డ్రైవ్‌వే
22 శాతం మంది డ్రైవ్‌వేలను ఎంచుకుంటామని చెప్పారు.

మూవింగ్ కార్
ఇందులో 3 శాతం మంది కదిలే కారులో శృంగారం జరపటాన్ని ఇష్టపడుతున్నట్లు తేలింది.

ఫోర్డ్ ఫియస్టా హ్యాచ్‌బ్యాక్
కారులో రతిక్రీడ కోసం ఫోర్డ్ ఫియస్టా హ్యాచ్‌బ్యాక్‌ను 29 శాతం మంది ఎంచుకుంటున్నారట.

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ హ్యచ్‌బ్యాక్
కారులో రతిక్రీడ కోసం ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్‌ను 27 శాతం మంది ఎంచుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది.

వాక్స్‌హాల్ కోర్సా హ్యాచ్‌బ్యాక్
కారులో శృంగారం కోసం వాక్స్‌హాల్ హ్యాచ్‌బ్యాక్‌ను 23 శాతం మంది ఎంచుకుంటున్నారట.

బిఎమ్‌డబ్ల్యూ మినీ హ్యాచ్‌బ్యాక్
కారులో రతిక్రీడ కోసం బిఎమ్‌డబ్ల్యూ మినీ హ్యాచ్‌బ్యాక్‌ను 21 శాతం మంది ఎంచుకుంటున్నారు.

రెనో క్లియో హ్యాచ్‌బ్యాక్
కారులో శృంగారం కోసం రెనో క్లియో హ్యాచ్‌బ్యాక్‌ను 18 శాతం మంది ఎంచుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.

ప్యూజో 205
కారులో రతిక్రీడ కోసం ప్యూజో 205 హ్యాచ్‌బ్యాక్‌ను 15 శాతం మంది ఎంచుకుంటున్నారట.

ఫోర్డ్ ఎస్కార్ట్
11 శాతం మంది బ్రిటీషర్లు ఫోర్డ్ ఎస్కార్ట్ సెడాన్‌ను కారులో శృంగారం జరిపేందుకు ఉపయోగించుకుంటున్నారట.

వోల్వో వి70
కారులో రతిక్రీడ కోసం వోల్వో వి40 క్రాసోవర్‌ను 8 శాతం మంది ఎంచుకుంటున్నారట.

నిస్సాన్ మైక్రా
కారులో రతిక్రీడ కోసం నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్‌ను 5 శాతం మంది ఎంచుకుంటున్నారట.

వాక్స్‌హాల్ ఆస్ట్రా
కారులో రతిక్రీడ కోసం వాక్స్‌హాల్ ఆస్ట్రా హ్యాచ్‌బ్యాక్‌ను 5 శాతం మంది ఎంచుకుంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.


Click it and Unblock the Notifications








