చాలా మంది ప్రైవేట్ వాహనాలనే ఎందుకు వాడతారో తెలుసా.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై తాజా సర్వేలో షాకింగ్ విషయాలు
దేశంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు సరిగా లేవని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకు కారణాలేంటి.. ఈ సర్వేను ఎలా అధ్యయనం చేశారు.. పూర్తి సమాచారం ఈ కథనంలో అందిస్తున్నాం..
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వాహనాల కోసం 'భాగ డుమాక్' అనే యాప్‌ని నిర్వహిస్తోంది. ఈ యాప్ ప్రస్తుతం ప్రభుత్వ వాహనాల సేవలపై సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ప్రకారం 2070 నాటికి కర్బన ఉద్గార రహిత సమాజంగా మారాలనే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ యాప్ నిర్వహణకు ప్రజా రవాణా చాలా అవసరం. కాలుష్యాన్ని తగ్గించడం కోసం.. లేదా ఫ్యూయెల్ ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడం కంటే ప్రభుత్వ బస్సులు, రైళ్లు మెరుగైనదిగా భావిస్తారు. అయితే కొన్ని కారణాల ద్వారా చాలా మంది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే కూడా వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి మొత్తం 21 ప్రధాన నగరాల్లో 50,000 మంది ప్రయాణికులకు సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా ప్రయాణికులను ముఖ్యంగా నాలుగు ప్రశ్నలు అడిగారు.

సర్వే ప్రకారం 37 శాతం మంది భారతీయులు రద్దీ కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా 28 శాతం మంది ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు సమయానికి రావడం లేదని ఇంకా తరచుగా టైం వేళల్లో మార్పులు, ఆలస్యం కారణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు.
సర్వేలో 24 శాతం మంది ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్ చాలా తక్కువ క్లాలిటీతో ఉంటున్నాయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా 44 శాతం మంది ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందడం కష్టమని.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో రియల్ టైం సమాచారం లేదని అందుకే వాటి మీద ఆధార పడట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సర్వేలో కనుగొన్న విషయాలు చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను నివారించే కారణాలకు సంబంధించి అనేక ఆప్షన్లను ప్రయాణికులకు కల్పించారు. వాటిలో ప్రయాణికులు ఎన్ని ఆప్షన్లు ఏయే ఆప్షన్లు ఎంచుకున్నారనే దాని ఆధారంగా సర్వే ఫలితాలు నిర్ణయిస్తారు. ఇంకా సర్వేలో ఈ విషయాలు కూడా కనుగొన్నారు.
సర్వే గణాంకాల ప్రకారం 49 శాతం మంది ప్రజా రవాణాలో నగదు రహిత చెల్లింపు సౌకర్యాన్ని కోరుతున్నారు. 38 శాతం మంది ప్రజలు ప్రజా రవాణాలో డిజిటల్ టెక్నాలజీని అనుసంధానం చేయాలని చెబుతున్నారు. 22 శాతం మంది ప్రజా రవాణా వాహనాలు తరచూ చెడిపోతున్నాయని పేర్కొన్నారు.

ఈ సర్వే ముగింపులో, 78 శాతం మంది ప్రజలు ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వారిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించేందుకు ఆసక్తి నెలకొంది. కానీ వాటిలో కొన్ని సమస్యల కారణంగా వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సర్వే తర్వాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో మెరుగైన సేవలు అందించేందుకు ఆయా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో పోలిస్తే ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వైపు మొగ్గు చూపడానికి వాటిలోని వివిధ ముఖ్యమైన మౌళిక సౌకర్యాలను ప్రవేశపెట్టాలి. దీని ద్వారా భవిష్యత్తులో ప్రజా రవాణా మెరుగుపడటంతో పాటు కాలుష్యం కూడా తగ్గే అవకాశాలున్నాయి.



Click it and Unblock the Notifications








