ఒక్క మాటతో మారిన కథ.. 96 దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు థార్ బహుమతిగా ఇచ్చిన సూర్య, కార్తి

సినిమా పరిశ్రమలో ఓ సినిమా విజయం సాధిస్తే, దాన్ని పురస్కరించుకుని చిత్ర బృందంలోని సభ్యులు ఒకరికొకరు కృతజ్ఞతగా విలువైన బహుమతులు ఇవ్వడం ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఖరీదైన కార్లు గిఫ్ట్‌లుగా ఇవ్వడం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ట్రెండ్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. 'విక్రమ్' అనే సినిమా విజయం తర్వాత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు విలువైన లెక్సస్ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో, విజయవంతమైన సినిమాల తర్వాత కార్లు బహుమతిగా ఇచ్చే సంస్కృతి మరింత విస్తరించింది. తాజాగా అగ్ర నటుల్లో ఒకరిగా పేరుపొందిన సూర్య తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు ఒక ప్రత్యేకమైన కారును బహుమతిగా అందించి వార్తల్లో నిలిచారు.

ఇటీవల విడుదలైన 'రెట్రో' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య, ప్రముఖ దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు ఆఫ్‌రోడ్ కింగ్ మహీంద్రా థార్‌ను బహుమతిగా అందించి ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు ఒక ప్రత్యేకమైన కారు కొంటే బాగుంటుందన్న కోరికను వ్యక్తం చేశాడని తెలుసుకున్న సూర్య, కార్తి ఆ ఆశను సాకారం చేస్తూ అతనికి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా థార్‌ను అందించారు.

96 Movie Director Prem Kumar

96 సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. సినిమాటోగ్రాఫర్‌గా అడుగుపెట్టిన ప్రేమ్ కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ దర్శకుడిగా మారిపోయారు. విజయ్ సేతుపతి - త్రిష జంటగా వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, తమిళ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ తరువాత తెలుగులో సమంత- శర్వానంద్‌ జంటగా జాను పేరుతో తీశారు.

ప్రేమ్ కుమార్‌కు తన రెండో సినిమా "సత్యం సుందరం" సమయంలో ఒక ప్రత్యేకమైన కోరిక కలిగింది. తెలుపు రంగులో ఉన్న మహీంద్రా థార్ కారు కొనాలని. ఇది సాదాసీదా కోరికలా అనిపించినా, అది తీరేంత సులభంగా తీరలేదు. నిర్దిష్టంగా తెలుపు టార్పాలిన్ వేరియంట్ కావాలన్న ఆశతో ప్రేమ్ కుమార్ చెన్నైలోని అనేక షోరూమ్‌లకు తిరిగాడు. చాలా మందిని సంప్రదించాడు. కానీ ఎక్కడా అతను కోరుకున్న మోడల్ దొరకలేదు.

Mahindra Off Road King Thar To 96 Movie Director Prem Kumar

ఈ విసుగులో, ఆయన తన కోరికను తనకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పంచుకున్నారు. తమిళ పరిశ్రమలో పేరుగాంచిన నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజా కూడా ప్రయత్నం చేసినప్పటికి ప్రేమ్ కుమార్ కోరుకున్న తెలుపు థార్‌ను అందించడం సాధ్యపడలేదు. తెలుపు రంగులో ఉన్న మహీంద్రా థార్ కోసం ఎన్నో రోజులుగా వెతికినప్పటికి దోరకకపోవడంతో చివరికి థార్ కోసం దాచిపెట్టుకున్న డబ్బును మరో అవసరానికి వాడుకున్నారు.

అయితే తనకు బాగా ఇష్టమైన కారు కోసం దాచుకున్న డబ్బులను వేరే అవసరానికి వాడుకున్నప్పటికి ఆయన కోరిక మాత్రం తీరింది. అకస్మాత్తుగా ఆయనకు వచ్చిన ఓ ఫోన్ కాల్ జీవితాంతం గుర్తుండిపోతుంది. నటుడు సూర్య తరపున జ్ఞానవేల్ రాజా ఫోన్ మాట్లాడుతూ, మీరు కోరినట్లుగానే తెలుపు థార్ వాహనం సిద్ధంగా ఉందని సమాధానం వచ్చింది. అయితే ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదని తెలిపారు.

అయితే ఇది అమ్మకానికి కాదు, ఇది బహుమతి అని తెలియజేశారు. సూర్య గారి నుంచి తనకు ఇష్టమైన కారు గిఫ్ట్‌గా రావడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల మహీంద్రా థార్‌ 5 డోర్‌ వెర్షన్‌ AX 5L తెలుపు రంగు మోడల్‌ తాళాలను కార్తి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం మహీంద్రా థార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.50 లక్షల నుండి రూ.17.60 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2025, 15:15 [IST]
English summary
Surya and karthi gifted mahindra off road king thar to 96 movie director prem kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+