సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

సాధారణంగా కార్లు మరియు బైకులపైనా అందరికి ఎక్కువ వ్యామోహం ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇందులో సాధారణ ప్రజలకంటే కూడా క్రికెటర్లు, సినీ తారలు, రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలకు మరింత ఎక్కువ వ్యామోహం ఉంటుంది. ఈ కారణంగానే వీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు లేకుంటే, చాలావరకు ఆసక్తికరమైన వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు.

ఇలాంటి నేపథ్యంలో భాగంగానే ఇటీవల సూర్య కుమార్ యాదవ్ 'నిస్సాన్ జోంగా' (Nissan Jonga) కారుని కొనుగోలు చేసాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

'సూర్య కుమార్ యాదవ్' క్రికెట్ అభిమానులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2021 లో ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు తరపున తన ట్వంటీ 20 లో అరంగేట్రం చేసినా యితడు అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల యితడు నిస్సాన్ కంపెనీ యొక్క అత్యంత శక్తివంతమైన జోంగా కారుని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే చాలా కార్లను కలిగి ఉన్నాడు. ఇందులో నిస్సాన్ జోంగా ఒక విలాసవంతమైన SUV. ఇది ఇండియన్ ఆర్మీలో కూడా చాలా కాలం పాటు ఉపయోగించబడింది. ఆ తరువాత కాలంలో నిలిపివేయబడింది. ఇప్పటికి భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ అరుదైన కారుని కొనుగోలు చేశారు.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

'నిస్సాన్ జోంగా' (Nissan Jonga) కారుని కొనుగోలు చేసినట్లు సూర్య కుమార్ యాదవ్ జనవరి 30 న సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ద్వారా తెలిసింది. ఈ పోస్ట్ లో 'నా కొత్త టాయ్ (బొమ్మకి) హల్క్‌కి హలో చెప్పండి' అని రాసాడు. ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా మరియు మంచి కలర్ లో ఉంది.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

'నిస్సాన్ జోంగా' ఇందులో జోంగా అనేది ఈ కారుకి సింపుల్ పేరు. దీనిని 'జబల్‌పూర్ ఆర్డినెన్స్ మరియు గన్-క్యారేజ్ అసెంబ్లీ' Jabalpur Ordnance and Gun-carriage Assembly) పిలుస్తారు. ఈ కారు 60 వ దశకంలోనే భారత సైన్యంలో ఉపయోగించబడింది. ఆ తరువాత కాలంలో ఈ కారు నిలివేయబడింది.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

జోంగా కారు జబల్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేయబడింది. ఈ కారు 3956 సిసి 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 110 బిహెచ్‌పి పవర్ మరియు 264 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కారులో హైడ్రాలిక్ బ్రేక్‌లు కూడా అమర్చబడ్డాయి. ఈ కారులో 3-స్పీడ్ గేర్‌బాక్స్ ఇవ్వబడింది. ఈ కారు 4-వీల్ డ్రైవ్ ఫంక్షన్‌తో వస్తుంది. కావున ఇది ఎలాంటి రోడ్డులో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

భారతీయ సైన్యంలో ఉపయోగిస్తున్న కారణంగా ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అయింది. అంతే కాకుండా ఇందులోని ఇంజిన్ అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా నిర్మించబడినందున, దీనికి దాదాపు యాంత్రిక సమస్యలు కూడా తలెత్తలేదు. ఇలాంటి అరుదైన మరియు అపురూపమైన కారుని ఇప్పుడు మన సూర్య కుమార్ యాదవ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ కారు దేశంలో ఉత్పత్తి చేయబడిన అత్యుత్తమ కార్లలో ఒకటి చరిత్రకెక్కింది.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

ఇదిలా ఉండగా, ఎంఎస్ ధోని కూడా కొంతకాలం క్రితం గ్రీన్ కలర్ నిస్సాన్ జోంగా కారును కొనుగోలు చేశారు. ధోని ఇప్పటికే చాలా సార్లు ఈ కారులో కనిపించాడు. అంతే కాకుండా మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి అతని కూతురు కారును శుభ్రం చేయడంలో సహాయం చేస్తూ కనిపించిన కొత్త వీడియో కూడా వైరల్ అయ్యింది.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

సాధారణంగా ధోనికి రెట్రో, పాతకాలపు మరియు స్పోర్ట్స్ బైక్‌లు మరియు కార్ల పట్ల ఎక్కువ మక్కువ ఉంది అనే విషయం తెలిసిందే. ధోనీ ఈ కారును పంజాబ్‌కు చెందిన వారి నుండి కొనుగోలు చేశాడు, కారు ఆకుపచ్చ రంగులో ఉంది మరియు దీని డిజైన్ ఆఫ్ రోడ్ కార్ల లాగా ఉంది. ఇటీవల అతను ఆన్‌లైన్ వేలంలో 1971 ల్యాండ్ రోవర్ సెరాజ్ 3 స్టేషన్ వ్యాగన్‌ను కొనుగోలు చేసిన MS ధోని తన గ్యారేజీకి పాతకాలపు కారును జోడించాడు.

సూర్య కుమార్ యాదవ్ కొత్త కార్ ఇదే.. ఓ లుక్కేసుకోండి

కొత్త కారు ల్యాండ్ రోవర్ సిరీస్ 3 ఎల్లో కలర్ లో ఉంది. ఇది 1971 నుండి 1985 వరకు 440,000 యూనిట్లను తయారు చేసిన కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో ఒకటి. ఇది 2.3-లీటర్, ఫోర్-సిలిండర్, పెట్రోల్ ఇంజన్ నుండి 3.5-లీటర్ వి8 ఇంజన్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది, అయితే ధోని కొనుగోలు చేసిన కారులో ఏ ఇంజన్ అమర్చబడిందనే విషయం ఖచ్చితంగా తెలియదు. ప్రస్తుతం వేలం వేయబడిన కార్లను బిగ్ బాయ్ టాయ్స్ యొక్క గురుగ్రామ్ షోరూమ్‌లో చూడవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 1, 2022, 9:33 [IST]
English summary
Surya kumar yadav buys jonga details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+