ఇది కారు కాదు మినీ థియేటర్.. సూర్యకుమార్ యాదవ్ కొత్త కారు చిన్నపాటి విమానంలా ఉందే
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రపంచంలో సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్‌తో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్, ఐపీఎల్లో తన స్పెషల్ బ్యాటింగ్ స్టైల్‌తో సూర్య అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్న సూర్య.. ప్రస్తుతం ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చాడు.
ముంబైలోని వీవీఐపీలు ఉపయోగించే స్పెషల్ ప్రైవేట్ ఎయిర్‌పోర్టులో సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో కలిసి కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టంట్ బాలీవుడ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ తన భార్యతో కలిసి టయోటా వెల్ఫైర్ అనే ఖరీదైన కారులో కనిపించాడు.

టయోటా వెల్ఫైర్ కేవలం ఖరీదైన కారు మాత్రమే కాదు, దాని ధరకి తగ్గట్లుగా లగ్జరీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో రెండో వరుసలో ఎక్కువ లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఉండే సీట్లు ఉంటాయి. వాటి వెనకాల కూడా సీట్లు ఉంటాయి.
ఎక్కువ స్పేస్ ఉండటంతో పాటు, ఈ రెండో వరుస సీట్లలో మసాజ్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని కెప్టెన్ సీట్లు అని పిలుస్తారు. ఈ రకమైన సీట్ల కోసమే చాలా మంది వీవీఐపీలు టయోటా వెల్ఫైర్ కారును ఇష్టపడతారు. అందుకే వారు మాత్రమే కొనుగోలు చేస్తారు.

అందుకే క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఖరీదైన కంప్లీట్ బ్లాక్ కలర్ టయోటా వెల్ఫేర్ కారును కొని ఉపయోగిస్తున్నాడు. కారు మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నప్పటికీ, కారు చుట్టూ అక్కడక్కడ క్రోమ్ హైలైట్‌లు ఉండటాన్ని ఫోటోల్లో చూడవచ్చు. ఈ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో పాటు, టయోటా వెల్ఫైర్ కారు ప్లాటినం వైట్ పెర్ల్, ప్రీసియస్ మెటల్ అనే రంగులలో కూడా అందుబాటులో ఉంది.
వెల్ఫైర్ కారు మరో స్పెషాలిటీ ఏమిటంటే, దాని కిటికీల అమరిక తక్కువగా ఉంటుంది. దీని వల్ల కారు లోపల నుంచి బయట విశాలంగా చూడవచ్చు. ఈ కారు వివిఐపిలను ఆకట్టుకోవడానికి ఇది కూడా ఒక కారణం.

వెల్ఫైర్ కారులో దాని పెద్ద సైజుకు తగినట్టుగా 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. గతంలో అందుబాటులో ఉన్న వెల్ఫైర్ కారుతో పోలిస్తే, ప్రస్తుతం ఉన్న వెల్ఫైర్ కారు రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, వాటిని కలిపే ఎల్‌ఈడీ లైట్ బార్‌ను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : భారతదేశంలో వివిఐపిల మెయిన్ ఆప్షన్ వెల్ఫైర్ కారు.. క్రికెట్ ఆటగాళ్ళలో సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాదు, హార్దిక్ పాండ్యా వద్ద కూడా తళుక్కుమనే వైట్ కలర్ వెల్ఫైర్ కారు ఉంది. హార్దిక్ పాండ్యా కొన్నిసార్లు ఆ కారులో బహిరంగంగా కనిపించినప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ తన టయోటా వెల్ఫైర్ కారులో కనిపించడం ఇదే మొదటిసారి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








