మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

సుష్మితా సేన్ 18 సంవత్సరాల వయస్సులోనే మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టింది. ఆ తర్వాత 1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఆమె గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. ఈ రెండు టైటిల్స్ తర్వాత సుష్మితా సేన్ అనేక బాలీవుడ్ చిత్రాలలో పనిచేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గత సంవత్సరం ఆమె ఆర్య అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది. అయితే, ఇప్పుడు ఆమె పేరు ప్రధానంగా వార్తల్లో వినిపిస్తోంది. ఇందుకు కారణం ఐపిఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ తాను సుష్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించడమే.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో కానీ, ఆమె పేరు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతోంది. సుష్మితా సేన్ భారతదేశం నుండి ఎంపికైన మొట్టమొదటి విశ్వ సుందరి (మిస్ యూనివర్స్). ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె జాతకమే మారిపోయింది, ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. సుష్మితా సేన్‌కి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం, అంతే కాదు ఆమెకు లగ్జరీ కార్లంటే కూడా చాలా ఇష్టం. సుష్మితా సేన్ గ్యారేజ్‌లో బిఎమ్‌డబ్ల్యూ నుండి లెక్సస్ వరకు కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

1. ఆడి క్యూ7

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి అందిస్తున్న అత్యంత పాపులర్ కార్లలో క్యూ7 కూడా ఒకటి. చిన్నపాటి టెలివిజన్ సెలబ్రిటీల నుండి కోటీర్వలు సైతం ఇష్టపడే పాపులర్ లగ్జరీ కారు ఇది. మనదేశంలో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి వంటి క్రెకట్ దిగ్గజాలు కూడా ఈ లగ్జరీ కార్ మోడల్ ను కలిగి ఉన్నారు. ఆడి ఇండియా ప్రస్తుతం ఈ లగ్జరీ కారుని రూ. 82.84 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 89.89 లక్షల వరకూ ఉంటుంది. ఆడి క్యూ7 ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

ఆడి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీలో వర్చువల్ కాక్‌పిట్, పానోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో కూడా లభిస్తుంది మరియు ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

2. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 730 ఎల్‌డి

జర్మన్ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లలో 7-సిరీస్ కూడా ఒకటి. భారత విపణిలో ఈ కారు ధర సుమారు రూ.1.42 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇది 262 బిహెచ్‌పి పవర్ ను మరియు 620 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

3. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6

సుష్మితా సేన్ కు బిఎమ్‌డబ్ల్యూ కార్ల అన్నా లేదా జర్మన్ మేడ్ కార్లన్నా చాలా ఎక్కవ ఇష్టం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కార్ కలెక్షన్‌లో ఉన్న మరొక బిఎమ్‌డబ్ల్యూ కార్ మరియు మూడవ జర్మన్ మేడ్ కార్ బిఎమ్‌బ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీ. భారతదేశంలో ప్రస్తుతం దీని ధర సుమారు రూ.1.04 కోట్లు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. కంపెనీ లగ్జరీ ఎస్‌యూవీని M Sport మరియు Xline అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

ఈ లగ్జరీ కారులో పానోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్, 3డి సౌండ్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 4.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి రెండూ వరుసగా 265 బిహెచ్‌పి మరియు 400 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఇంజన్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటాయి.

మాజీ 'మిస్ ఇండియా' మరియు 'మిస్ యూనివర్స్' సుష్మితా సేన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

4. లెక్సస్ ఎల్ఎక్స్ 470

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటాకి చెందిన ప్రీమియం లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ అందిస్తున్న ఎల్ఎక్స్470 కూడా సుష్మితా సేన్ కార్ గ్యారేజ్ లో కొలువుదీరి ఉంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 35 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ కారు విక్రయాలు నిలిపివేయబడ్డాయి. లెక్సస్ ఎల్ఎక్స్470 ఒక 5-సీటర్ ఎస్‌యూవీ, గతంలో ఇది డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉండేది. వివిధ కారణాల వల్ల కంపెనీ ఈ కారును భారతదేశంలో నిలిపివేసింది, అయితే ఇప్పటికీ ఇది కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది.

Article Published On: Friday, July 15, 2022, 14:48 [IST]
English summary
Sushmita sen goes viral on social media after lalit modi comments take a look at her luxury car collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+