Just In
- 9 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 10 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 14 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 17 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చూడటానికి Jimny ని గుర్తు చేస్తుంది, కానీ Jimny కాదు: ఇది చైనా కంపెనీ కాపీ కొట్టిన కొత్త కార్
ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ రంగానికి ప్రసిద్ధి చెందిన చైనా అనేక వాహనాలను ప్రతి సంవత్సరం మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కువ సంఖ్యలో వాహనాలను విడుదల చేసే దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంటుంది. ఇంతటి కీర్తి పొందిన చైనా కొన్ని ఇతర కంపెనీల యొక్క వాహనాలను కాపీ కొట్టడం వల్ల అపఖ్యాతిపాలవుతోంది. ఇంతకుముందు కూడా చైనా కంపీఏలు అనేక మోడల్స్ కాపీ కొట్టి మార్కెట్లో విడుదల చేశాయి. తాజాగా ఇప్పుడు మరోసారి సుజుకి కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన సుజుకి జిమ్నీని కాపీ కొట్టింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఇప్పటికే చైనా కంపెనీలు సుజుకి, టయోటా మరియు హోండా వంటి ప్రపంచ ప్రఖ్యాత కార్ కంపెనీల కార్లను కూడా కాపీ కొట్టిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాపీ కొట్టిన సుజుకి జిమ్నీ విషయానికి వస్తే, దీని డిజైన్ కొంత మార్చినప్పటికీ, ప్రాథమిక డిజైన్ మాత్రమే సుజుకి జిమ్నీని చూపిస్తుంది.

ఈసారి కాపీ చేసే పనిని చైనాకు చెందిన అతిపెద్ద ఆటోమొబైల్ గ్రూప్ గ్రేట్ వాల్ మోటార్స్ (GWM) చేసింది. కంపెనీ ఇటీవలే తన మినీ SUV ట్యాంక్ 100 ని చైనీస్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇది చూడటానికి అచ్చం సుజుకి జిమ్నీ లాగా కనిపిస్తుంది. అయితే ఇది చైనా కాపీ కొట్టిన డూప్లికేట్ జిమ్నీ.

సుజుకి జిమ్నీ అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా ప్రజాదరణ పొందిన SUV మోడల్. అయితే ఇప్పుడు కాపీ కొట్టబడిన ఈ మోడల్ జిమ్నీ వలె కాకుండా, ట్యాంక్ 100 పేరుతో విడుదలైంది. ఇది 3-డోర్ మరియు 5-డోర్ మోడల్‌లలో అందించబడుతుంది. అయితే, మొత్తం పొడవు మరియు వీల్‌బేస్‌లో సాధారణ జిమ్నీ కి ఈ ట్యాంక్ 100 కి పెద్దగా తేడా లేదు.

ట్యాంక్ 100 యొక్క ముందు భాగం మినహా, మొత్తం SUV అదే బాక్సీ డిజైన్‌లో వస్తుంది, ఇది జిమ్నీ డిజైన్‌కు అసలైన ప్రతిరూపం. నిజానికి, ముందు డిజైన్ ఫోర్డ్ బ్రోంకో నుండి తీసుకోబడింది. ట్యాంక్ 100 ముందు భాగంలో ఆల్-బ్లాక్ మల్టీ-స్లాట్డ్ గ్రిల్‌ను పొందుతుంది. ఇది LED హెడ్‌లైట్‌తో ఇంటిగ్రేటెడ్ LED DRLని కలిగి ఉంది. ఇది హెడ్‌లైట్ చుట్టూ వృత్తాకారంలో ఉంటుంది. సుజుకి జిమ్నీ లాగా, ఈ చైనీస్ కారు కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న పెద్ద బంపర్‌ను పొందుతుంది. ఇది కాకుండా, ఇందులో అమర్చిన ఫాగ్ ల్యాంప్స్ మరియు బంపర్‌లో ఇచ్చిన ఎయిర్ వెంట్‌లు జిమ్నీకి సమానంగా ఉంటాయి.

ట్యాంక్ 100లో, కంపెనీ 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బో-ఛార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించింది, ఇది 224 బిహెచ్‌పి పవర్ మరియు 387 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4 వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉండటమే కాకుండా, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఇక సుజుకి జిమ్నీ విషయానికి వస్తే, ప్రస్తుతం లాటిన్ అమెరికా, ఆఫ్రికా మరియు యూరప్ దేశాలలో విక్రయిస్తోంది. అయితే ఈ కారును భారతదేశంలో విడుదల చేయడంపై కంపెనీ తన ఉద్దేశాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. అయితే 3-డోర్ జిమ్నీని కంపెనీ 2019 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పెట్టారు. ఆ తర్వాత ఇది త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుందని నివేదికలు వచ్చాయి.

జిమ్నీ మూడు మరియు ఐదు డోర్ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. జపనీస్ వెర్షన్ జిమ్నీ 1.5-లీటర్ VVT పెట్రోల్ ఇంజన్‌తో 102 బిహెచ్‌పి పవర్ మరియు 130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంది.

జిమ్నీ భారతదేశంలో విడుదలైతే ఇది 1.5-లీటర్, 4-సిలిండర్ K15B SHVS పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ ఇప్పటికే ఎర్టిగా, సియాజ్ మరియు విటారా బ్రెజ్జా వంటి కార్లలో ఉపయోగించబడుతుంది. మారుతి సుజుకి నుండి ఇటీవల విడుదల చేయబడిన కొన్ని ఐదవ తరం మోడల్‌లు కంపెనీ యొక్క తేలికపాటి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడ్డాయి.

భారతదేశంలో లాంచ్ చేయబోయే జిమ్నీ పెద్ద ల్యాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడుతుంది. ఈ కారులో 4-వీల్ డ్రైవ్ సౌకర్యం కూడా ఉంది. దాని కాంపాక్ట్ పరిమాణం కారణంగా, కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 210 మి.మీ వరకు ఉంటుంది. కావున ఇది చాలా స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ మినీ SUV దాని డిజైన్ మరియు ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల కారణంగా చాలా ప్రజాదరణ పొందింది. దీనికోసం దేశీయ మార్కెట్లో వాహన ప్రియులు ఎంతగానో వేచి చూస్తున్నారు.