రాణీ తేనెటీగ కోసం 24 గంటల పాటు కారును నిర్భందించిన 20 వేల తేనీగలు

By Anil

ఒక తేనె తుట్టెలో సుమరుగా కొన్ని వేల తేనీగలు ఉంటాయి. అయితే ఇందులో కేవలం ఒక్క ఆడ తేనీగ మాత్రమే ఉంటుందట. లండన్‌లో జరిగిన ఊహించని ఘటన దీనిని ఋజువు చేసింది. లండన్‌‌లోని హావర్డ్‌వెస్ట్ మధ్య భాగంలో ఒక మహిళ వెళుతున్న కారుని సుమారుగా 20,000 ల తేనెటీగలు వెంబడించాయి. ఎందుకు ఇలా తేనీగలు తనను వెంబడిస్తున్నాయో అర్థంకాక సంభందిత అధికారులకు సమాచారం అందించింది.

1

ముగ్గరు తేనెటీగల సంరక్షణ ఆధికారులు మరియు నేషనల్ పార్క్ రేంజ్ అధికారులు అక్కడి చేరుకుని ఆ తేనీగలను చెదరగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.

2

ఆ మరుసటి రోజు కూడా వెనుక వైపున తేనీగలు అలాగే కూర్చుని ఉన్నాయి. తీరా ఆమె ఎక్కడెక్కడకు వెళ్లిందని ఆరా తీస్తే, దగ్గర్లోని పార్క్‌కు వెళ్లింది.

3

పార్క్‌లో సేకరించిన కొన్ని పూలను ఒక అట్టపెట్టెలో ఉంచి, ఆ పెట్టను కారులోని వెనుక సీటులో ఉంచి అక్కడ నుండి వెళ్లిపోయింది.

4

అయితే సుమారుగా 20,000 లకు పైగా తేనెటీగలు వెంటపడ్డాయి. ఇవి ఇలా వెంటపడ్డానికి కారణం, ఆమె దాచుకున్న పూలలో రాణీ తేనీగ ఉండిపోయిందట. అది ఎగిరిపోయాక అక్కడనున్న ఈగలన్నీ వెళ్లిపోయాయి.

5

అయితే చివరికి ఆ మహిళ మరియు ఆమె వినియోగించిన మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ కారు తేనెటీగల బారి నుండి తప్పించుకున్నాయి.

మరిన్ని కథనాల కోసం...

ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు

లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు: అజీమ్ ప్రేమ్‌‌జీ

Article Published On: Saturday, May 28, 2016, 14:37 [IST]
English summary
Swarm of bees follow grandmother's car for over 24 hours attempting to rescue their queen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+