రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

సిల్వెస్టర్ స్టాలోన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన హాలీవుడ్ నటుడే అయినప్పటికీ, తన అద్భుతమైన చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్నాడు. ఫస్ట్ బ్లడ్, రాంబో వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో సినీ జనాలకు సుపరిచతం అయ్యాడు.

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

ఈ హాలీవుడ్ నటుడికి సినిమాలతో పాటుగా సూపర్ కార్లంటే కూడా భలే క్రేజ్. అందుకే ఆయన కార్ గ్యారేజ్‌లో బోలెడు కార్లు కనిపిస్తుంటాయి. తాజాగా సిల్వెస్టర్ స్టాలోనే గ్యారేజ్‌లో మరో అమెరికన్ స్పోర్ట్స్ కార్ వచ్చి చేరింది. జనరల్ మోటార్స్‌కి చెందిన షెవర్లే బ్రాండ్ విక్రయిస్తున్న కార్వెట్ కారును ఆయన కొనుగోలు చేశారు.

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

బ్లూ కలర్ షెవర్లే కార్వెట్ కన్వర్టిబల్ స్పోర్ట్స్ కారును ఆయన కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన అభిమానులతో పంచుకున్నారు. స్పెక్ట్రా గ్రే అల్యూమినియం వీల్స్‌తో కూడిన ఈ కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్‌ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

ఈ స్పోర్ట్స్ కారును ఫ్లోరిడాలోని టేనస్సీ డీలర్‌షిప్ యజమాని అతనికి అప్పగించాడు. ఈ కారులోని ఇంటీరియర్ కూడా ఎక్స్‌టీరియర్ కలర్ థీమ్‌తో మ్యాచ్ అయ్యే విధంగా బ్లూ అండ్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఈ కారులోని ఇంటీరియర్‌ను ప్రీమియం లెథర్‌తో తయారు చేశారు.

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

షెవర్లే కార్వెట్ స్పోర్ట్స్ కారులో శక్తివంతమైన వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. వాస్తవానికి, కొన్ని కారణాల వలన కొత్త 2021 షవర్లే కార్వెట్ సి8 మోడల్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫలితంగా ఇప్పటికే ఈ మోడల్‌ను ఆర్డర్ చేసినవారు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తోంది.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

అయితే, రాంబో ఆర్డర్ మాత్రం ఆలస్యం కాలేదు, ఆయనకు తక్షణమే డెలివరీని అందించారు సదరు డీలర్‌షిప్ యజమాని. సిల్వెస్టర్ స్టాలోనో 74 ఏళ్ల వయస్సులోనూ, ఫ్లోరిడా నగర వీధులపై మిడ్-ఇంజన్ స్పోర్ట్స్ కారును నడపాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు.

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

ఈ ఫొటోలను బట్టి చూస్తుంటే, స్టాలోన్ కొనుగోలు చేసిన కార్వెట్ సి8 మోడల్ స్టాండర్డ్ వెర్షన్ అని తెలుస్తోంది. ఇందులో పెర్ఫార్మెన్ వెర్షన్ జి51 ప్యాకేజ్ లేదు. సాధారణంగా, ఈ ప్యాకేజ్‌ను కస్టమర్లు అదనంగా కొనుగోలు చేస్తారు. దీని సాయంతో కారు పనితీరు మరింత చురుకుగా ఉంటుంది.

MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

కార్వెట్ 28 కన్వర్టిబల్ కారును స్టాలోన్‌కు డెలివరీ చేసిన తర్వాత టెన్నెస్సీ డీలర్‌షిప్ అతనికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మేరకు సదరు డీలర్‌షిప్ తమ ఫేస్‌బుక్ ఖాతాలో "సిల్వెస్టర్ స్టాలోన్ మా కస్టమర్ అని చెప్పగలిగినందుకు మాకు చాలా గర్వంగా మరియు గౌరవంగా అనిపిస్తుంది. మేము ఒక అందమైన 2021 సి8 కార్వెట్‌ని పంపిణీ చేసాము" అని పేర్కొంది.

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

సిల్వస్టెర్ స్టాలోన్ కార్ కలెక్షన్‌లో ఇప్పటికే అనేక మోడళ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని సూపర్ కార్లు మరికొన్ని స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. ఆయన కార్ కలెక్షన్‌లో బుగాటి వేరాన్, మెర్సిడెస్ బెంజ్ జి550, ఫెరారీ 612 స్కగ్లెట్టి, ఫెరారీ 599 జిటిబి ఫిరానో మాన్సెరి మొదలైన కార్లు ఉన్నట్లు సమాచారం.

MOST READ:రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

ఇవే కాకుండా, మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్ 65, ఇ-క్లాస్ ఏఎమ్‌జి, జి-క్లాస్, బెంట్లీ కాంటినెంటల్ జిటిసి, ఫోక్స్‌వ్యాగన్ ఫాటన్, షెవర్లే కమారో హెండ్రిక్ ఎస్ఎస్, ముస్తాంగ్ జిటి, 1968 కార్వెట్ కార్లు కూడా ఆయన కలెక్షన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ కార్ల జాబితాను బట్టే అర్థమవుతుంది స్టాలోన్ ఎంత గొప్ప కార్ ప్రేమికుడోనని.

Most Read Articles

English summary
Sylvester Stallone Adds Chevrolet C8 Convertible To His Car Collection. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X