మీ బైక్‌లో తరచూ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా.??.. అయితే ఓ సారి క్లచ్ ప్లేట్లను చెక్ చేసుకోండి.!!
కారు, బైక్.. ఇలా వాహనం ఏదైనా సరిగ్గా నడవాలంటే ఇంజిన్, క్లచ్, గేర్ ఇలా చాలా భాగాల పనితీరు మెరుగ్గా ఉండాలి. అయితే ఇక్కడ వాహనంలోని ముఖ్యమైన భాగాల్లో క్లచ్ ఒకటి. సింపుల్‌గా చెప్పాలంటే ఇంజిన్‌ను క్లచ్ ట్రాన్స్‌మిషన్‌కు, గేర్ బాక్స్‌కు కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా డ్రైవ్ ట్రెయిన్‌కు టార్క్‌ను బదిలీ చేస్తుంది.
మీ ప్రయాణం సాఫీగా సాగాలంటే.. మీ బైక్ ఇంజిన్ నుంచి శక్తిని సరఫరా చేయడానికి క్లచ్ ప్లేట్లు కీలకం. అందుకే వాహనదారులు వీటిపై శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీ వెహికల్‌లో చిన్నపాటి సమస్యలు తలెత్తినా సరే.. వెంటనే సర్వీస్ చేయించాలి. లేదంటే మున్ముందు రిపేర్లకు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కాబట్టి వాహనదారులు తమ వాహనంలోని క్లచ్ ప్లేట్లు ఎప్పటికప్పుడూ సరిగ్గా పనిచేసేలా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ఇది మీ బైక్ మైలేజ్‌పై ప్రభావం చూపిస్తుంది. అయితే క్లచ్ ప్లేట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా.. డ్యామేజ్ అయ్యాయా అని ఎలా తెలుసుకోవాలనే డౌట్ మీకు రావచ్చు. అందుకు కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటంటే..
లో మైలేజీ: మీ బైక్ యొక్క క్లచ్ ప్లేట్‌లో ఏదైనా సమస్య ఉంటే, మైలేజ్ తగ్గుతున్నట్లు మీరు గమనిస్తారు. క్లచ్ ప్లేట్‌లో సమస్య తలెత్తితే.. రెగ్యులర్‌గా కంటే మీ బైక్ ఎక్కువ పెట్రోల్‌ను తాగేస్తుంది. అయితే ఫ్యూయెల్ ఎక్కువ తీసుకోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు అని మీరు అనుకుంటారు. కానీ వాటిలో క్లచ్ ప్లేట్లు డ్యామేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

యాక్సిలరేషన్: మీ బైక్ యొక్క క్లచ్ ప్లేట్‌ను భర్తీ చేయడానికి ఇదే సమయం అని తెలిపే మరో సిగ్నల్ యాక్సిలరేషన్ తగ్గడం. క్లచ్ ప్లేట్ పనితీరు తగ్గిపోతే యాక్సిలరేషన్(త్వరణం) తగ్గడాన్ని మీరు వెంటనే గమనిస్తారు. ఇక ట్రాన్స్‌మిషన్ యొక్క ఏకైక పని ఇంజిన్ నుంచి శక్తిని చక్రాలకు బదిలీ చేయడమే. ఈ డ్యూటీలో కీలకమైన భాగం క్లచ్.
కాబట్టి మీ బైక్ యాక్సిలరేషన్(Bike Acceleration Low) ఎప్పుడైనా పడిపోతే, మీరు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా ఆదా చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితంగా బైక్‌లోని ఇతర భాగాలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.

క్లచ్ స్లిప్పింగ్: మీ బైక్ క్లచ్ ఫెయిల్ అయ్యింది అని తెలియజేసే మరో సంకేతం గేర్ జారిపోవడం. గేర్‌లను మార్చేటప్పుడు బైక్ యొక్క RPM పెరగడం ద్వారా ఈ సమస్యను తెలుసుకోవచ్చు. ఇంజిన్ పుంజుకుంటున్నప్పుడు క్లచ్ జారిపోతే ట్రాన్స్‌మిషన్ సరిగా పనిచేయడం లేదని సూచిస్తుంది.
క్లచ్ లివర్‌లో వైబ్రేషన్: మీ బైక్ క్లచ్ లివర్‌లో వైబ్రేషన్ ద్వారా క్లచ్ ప్లేట్లు సమస్యకు గురైనట్లు స్పష్టమైన సంకేతాన్ని సూచిస్తుంది. క్లచ్ లివర్‌లో వైబ్రేషన్ తలెత్తితే మీ బైక్‌లో ఇతర భాగాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తీవ్రమైన అంశంగా పరిగణించి మెకానిక్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది.

శబ్దంలో తేడా: మీరు బైక్‌పై ప్రయాణించేటప్పుడు క్లచ్ సౌండ్‌లో మీరు ఏదైనా అసాధారణ తేడాను గమనించవచ్చు. సాధారణంగా క్లచ్‌ను ఇంజిన్ యొక్క కుడి లేదా ఎడమ వైపున అమర్చుతారు. ఇంజన్ బయటి నుంచి వింత శబ్దం వస్తుంటే, క్లచ్ పనితీరు సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అవసరం. తద్వారా వాహనదారులు బైక్ క్లచ్‌లోని సమస్యలను ఎంత త్వరగా గుర్తించి సరిచేస్తే మీకు రిపేర్ ఖర్చులు అంత తగ్గుతాయి.


Click it and Unblock the Notifications








