అధ్యక్షుడి ప్యాలెస్‌లో వందల కార్లు.. మతిపోగొడుతున్న వీడియో, అందుకే ప్రజలు తిరగబడ్డారు!
పశ్చిమాసియాలోని సిరియాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. తాజాగా అధ్యక్షుడు బషర్ అల్ అసద్(bashar al assads) సర్కార్ కుప్పకూలింది. తిరుగుబాటు దారులు రాకముందే ఆయన రాజధాని డమాస్కస్ నుంచి వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు. అధ్యక్షుడి ప్యాలెస్‌లోకి ప్రవేశించిన రెబెల్ ఫైటర్లు, అక్కడ ఆయన లైఫ్‌స్టైల్‌ను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంద్రభవనం లాంటి ప్యాలెస్ తలుపులు తెరవగా అసద్ గ్యారేజీలో కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు దర్శనమిచ్చాయి. దాదాపు 13 ఏళ్ళ పాటు కొనసాగిన అంతర్యుద్ధం తరువాత ఇప్పుడు ఆయన లోపల అనుభవించిన అసలు జీవితం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఖరీదైన స్పోర్ట్స్ కార్ల నుంచి మొదలుకుని ప్రపంచలోనే ఎంతో విలువైన వందలాది కార్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దాదాపు 100 కార్ల వరకు ఆయన గ్యారేజీలో ఉన్నట్లు వీడియోను చూస్తే తెలుస్తుంది.
అల్ అసద్ కార్ కలెక్షన్లలో రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్, BMW,ఫెరారీ ఇంకా ప్రపంచంలోనే టాప్ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన కన్వర్టిబుల్స్ నుండి స్పోర్ట్స్ కార్లు, ఆఫ్-రోడ్ ప్రయాణాలను అనువుగా ఉండే వందలాది కార్లు ఉన్నాయి. తిరుగుబాటు దారులు ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయి గ్యారేజీని చూసే వరకు కూడా అసద్ లైఫ్‌స్టైల్ ఈ రేంజ్‌లో ఉంటుందని తెలిసేది కాదు. ప్రపంచవ్యాప్తంగా అసద్ కార్ల కలెక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు.

చాలా ఏళ్లుగా పశ్చిమాసియాలోని సిరియా ప్రాంతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ప్రజలు తమ రోజువారీ ఆహారం కోసం కూడా తీవ్రంగా కష్టపడుతుంటారు. ఎలాంటి ఆర్థిక భరోసా లేకపోవడంతో ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న సిరియాలో ఆ దేశ అధ్యక్షుడిగా అల్ అసద్ లైఫ్‌స్టైల్ మాత్రం దీనికి భిన్నంగా ఉన్నట్లు వీడియోను చూస్తే అర్ధం అవుతుంది. సగటు పౌరులు ఆయన జీవన శైలిని చూసి షాక్ అవుతున్నారు.
అసద్‌తో పాటు ఆయన సన్నిహితుల వద్ద కూడా కోట్లు విలువ చేసే కార్లు ఉన్నట్టు తెలుస్తుంది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో పోరాడుతున్న సగటు పౌరుడి లైఫ్‌స్టైల్ ఒక విధంగా ఉంటే, అధ్యక్షుడు, ఆయన సన్నిహితులు మాత్రం అధికారానికి గుర్తింపుగా వందల కార్లతో లగ్జరీ లైఫ్‌ను గడిపారని రెబల్ ఫైటర్లు షేర్ చేసిన వీడియో చూసిన అక్కడి పౌరులు మాట్లాడుకుంటున్నారు.

ప్యాలెస్ లోపలికి ప్రవేశించిన తిరుగుబాటు దారులు అక్కడ ఉన్నటువంటి ఖరీదైన కుర్చిల్లో కూర్చుని సెల్ఫీలు దిగడం, కొన్ని వస్తువులను తీసుకెళ్లడం లాంటివి చేశారు. అలాగే కారు గ్యారేజీలోకి వెళ్లి అక్కక కనిపించిన కార్ల ప్రక్కన సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం కూడా చేశారు. సూపర్ స్పోర్ట్స్ కార్లు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల వద్ద కూడా లేని ప్రత్యేకమైన కార్లు కూడా అసద్ గ్యారేజీలో కనిపించాయి.
గ్యారేజీలో కార్లు వరుసగా ఒకదాని పక్కన మరోటి పార్కింగ్ చేసి ఉన్నాయి. వీటిని అసద్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉపయోగిస్తుండే వారు. తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతోనే ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే, అసద్‌ల కుటుంబం దాదాపు 5 దశాబ్దాలుగా సిరియాలో కొనసాగిస్తున్న పాలనకు ఈ ఆదివారంతో తెరపడింది.

అసద్ తండ్రి హఫీజ్ అస్సాద్ 1971 నుండి 2000 వరకు పాలించగా, ఆ తరువాత అసద్ అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచి వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. అసద్ తాజాగా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లడంతో జైళ్లలో దుర్భర జీవితం గడిపిన సిరియా పౌరులను బయటకు విడుదల చేశారు. నవంబర్ 27న దాడులు మొదలుపెట్టిన రెబెల్స్ 12 రోజుల్లోనే డమాస్కస్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications








