ఖరీదైన కారును కొనుగోలు చేసిన హీరోయిన్ తాప్సీ.. అలాంటి కార్లు కేవలం 50 మాత్రమే ఉన్నాయి..!

ప్రముఖ నటి తాప్సీ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. జర్మన్‌ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ తయారీ చేసిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన Mercedes maybach GLS 600 SUVని కొనుగోలు చేశారు. సెప్టెంబర్‌ 17న ముంబైలోని తన నివాసంలో ఈ కారు డెలివరీ అందుకున్నారు.

ఇది భారత్ మార్కెట్లోకి 2021 సంవత్సరంలో విడుదల అయింది. తొలుత 50 యూనిట్లను మాత్రమే విక్రయించాలని సంస్థ నిర్ణయించింది. ఆ కార్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. మెర్సిడెస్‌ మేబ్యాగ్‌ GLS 600ని అందుకొనేందుకు మరికొన్ని వేచిచూడాల్సి ఉంటుంది. అయితే తాప్సీ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Taapsee pannu mercedes maybach gls 600 SUV

తాప్సీ కొనుగోలు చేసిన మెర్సిడెస్‌ మేబ్యాక్ GLS 600 కారు శక్తివంతమైన 3982cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 6500 rpm వద్ద గరిష్ఠంగా 549.81 bhp శక్తి, 4500 rpm వద్ద 730Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు 4 సీట్లతో లభిస్తుంది.

మెర్సిడెస్‌ మేబ్యాక్ GLS 600 కారు AWD ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అబ్సిడియన్‌ బ్లాక్‌, పోలార్‌ వైట్‌, కావన్‌సైట్‌ బ్లూ, డైజైన్‌ డైమెండ్‌ వైట్‌ బ్రైట్‌, మోజావే సిల్వర్‌, డిజైనో హైసింత్‌ రెడ్‌, సెల్‌నైట్ గ్రే వంటి 14 ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీంతోపాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Taapsee pannu mercedes maybach gls 600 SUV

మెర్సిడెస్‌ కారు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్‌ వీల్‌, పవర్‌ అడ్జస్టబుల్‌ రియర్‌ మిర్రర్‌, టచ్‌ స్క్రీన్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఇంజిన్ స్టార్ట్‌ స్టాప్‌ బటన్‌, అల్లాయ్‌ వీల్స్‌, ఫాగ్‌ లైట్లు, పవర్‌ విండోస్‌ వంటి వివిధ కీలక ఫీచర్లను కలిగి ఉంది.

భద్రతపరంగా GLS 600లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్‌ ఫ్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్, ఆఫ్‌ రోడ్‌ డ్రైవింగ్‌ మోడ్‌, ప్రీ సేఫ్‌ సిస్టమ్‌, కార్‌ వాష్‌ మోడ్‌, ABS సహా అనేక కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Taapsee pannu mercedes maybach gls 600 SUV

మెర్సిడెస్ మేబ్యాక్‌ GLS 600 SUV సహా తాప్సీ కారు గ్యారేజీలో మెర్సిడెస్‌ GLE 250-D, BMW X1, జీప్ కంపాస్‌, ఆడి A8L, BMW 3 సిరీస్‌ GT ఉన్నాయి. తాప్సీ కొనుగోలు చేసిన కారు ధర రూ.2.92 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అలాగే తాప్సీ పల్లాడియం సిల్వర్‌ కలర్‌ రంగు కారును కొనుగోలు చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 19, 2023, 11:24 [IST]
English summary
Taapsee pannu received her mercedes maybach gls 600 suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+