Taapsee Cars Collection తాప్సీ ‘అల్ట్రా లగ్జరీ' కార్ల కలెక్షన్‌ చూశారా.. ఒక్కో కారు ధర ఎన్ని కోట్లు తెలుసా.??

సినీ సెలబ్రిటీలు అంటే ఎక్కువగా వారు తిరిగే లగ్జరీ కార్లు, బైక్‌లు గుర్తొస్తాయి. వింటేజ్‌ హీరోల నుంచి మొదలుకొని నేటి తరం సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి గ్యారేజ్‌లో కోట్ల ఖరీదు చేసే కార్లు ఉన్నాయి. టాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పన్ను కూడా ఆ కోవలోకే వస్తుంది. తాప్సీ వద్ద కూడా లగ్జరీ కార్ల కలెక్షన్‌ ఉంది. మరి ఆ కార్లేంటో చూద్దామా..

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, తాప్సీ నటిస్తున్న సినిమా డంకీ(Dunki) రేపు(డిసెంబర్‌ 21) న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రలో పోషిస్తున్న తాప్సీ కార్ల కలెక్షన్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా తాప్సీ పన్ను ఖరీదైన బెంజ్‌ కారును కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనితో పాటు మరికొన్ని లగ్జరీ కార్లు ఆమె సొంతం. వివరాల్లోకి వెళితే..

Taapsee-Mercedes-Maybach-GLS-600

తాప్సీ పన్ను(Taapsee Pannu) ఇటీవల సరికొత్త Mercedes Maybach GLS 600 లగ్జరీ SUV ని కొనుగోలు చేసింది. బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV ఇది. సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రమే ఎక్కువగా ఈ కారును కొనుగోలు చేస్తారు. అల్ట్రా లగ్జరీ మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ నుంచి తాప్పీ ఈ కారను కొనుగోలు చేసింది. పల్లాడియం సిల్వర్‌ షేడ్‌లో ఉన్న ఈ సరికొత్త కారు ధర రూ. 3.50 కోట్లు.

మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ GLS 600 లగ్జరీ ఎస్‌యూవీ నాప్పా లెదర్ అప్‌హోల్‌స్టరీ, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ మసాజింగ్ సీట్లు వంటి లగ్జరీ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఈ కారు 4.0-లీటర్ V8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఈ ఇంజిన్ గరిష్ఠంగా 557 PS శక్తిని మరియు 730 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా హైబ్రిడ్ సిస్టమ్ డిమాండ్‌పై మరో 22 PS మరియు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా జత చేయబడి ఉంటుంది.

Taapsee-Mercedes-GLE

ఈ లగ్జరీ కారును కొనుగోలు చేసేముందు తాప్సీ ఎక్కువగా Mercedes Benz GLE 350 SUVలో బయటకు వచ్చేవారు. ఈ కారును కావాన్‌సైట్ బ్లూ మెటాలిక్ షేడ్‌లో ఫినిషింగ్‌ చేశారు. తాప్సీ ఈ SUVకి "మార్గరెట్" అనే పేరు కూడా పెట్టింది. ఈ కారును కొనుగోలు చేసిన కొత్తలో తాప్సీ ఈ లగ్జరీ కారు బానెట్‌పై నిద్రిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Mercedes Benz GLE 350 2.9-లీటర్ 6-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 268 బిహెచ్‌పి మరియు 600 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ. 60 లక్షల నుంచి 80 లక్షల మధ్య ఉంది. తాప్సీ వరుసగా రెండు లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం చూస్తే బెంజ్‌ కారుపై ఆమెకున్న మక్కువ అర్థమవుతోంది.

Jeep-Compass

తాప్సీ వద్ద మరో లగ్జరీ కారు జీప్‌ కంపాస్‌.. 2019 లో తాప్సీ ఈ కారును కొనుగోలు చేసింది. ఆకర్షణీయమైన మెగ్నీసియో గ్రే యొక్క క్లాసీ షేడ్‌తో ఉన్న ఈ కారు.. ఫుల్లీ లోడెడ్‌ టాప్‌ ఆఫ్‌ లైన్‌ వేరియంట్‌గా తెలుస్తోంది.

జీప్ కంపాస్(Jeep Compass) పెట్రోల్ వేరియంట్‌ 1.4-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 160 bhp మరియు 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ వేరియంట్‌ 2.0-లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 171 bhp, 350 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

BMW-X1

వీటితో పాటు తాప్సీ గ్యారేజ్‌లో మొదటి తరం BMW X1 కాంపాక్ట్ లగ్జరీ SUV ఉంది. ఇది గ్రే కలర్‌లో బేస్ వేరియంట్ మోడల్. ఫస్ట్‌ జెన్‌ X1.. 2.0 లీటర్‌ పెట్రోల్ మరియు 2.0 లీటర్‌ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో పనిచేస్తాయి.

2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 bhp మరియు 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 184 bhp మరియు 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే తాప్సీ కొనుగోలు చేసిన BMW X1 ఏ ఇంజిన్‌తో పనిచేస్తుందనేది స్పష్టంగా తెలియదు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 20, 2023, 14:50 [IST]
English summary
Taapsee pannus ultra luxury cars collection from mercedes to jeep compass
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+