ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల సూపర్ కారు చూశారా.. తయారీకే 5 సంవత్సరాలు పట్టింది!
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల రాజ్యం కొనసాగుతోంది. ఆ దేశంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. చాలా కీలక మార్పులు చేశారు. ప్రజల స్వేచ్ఛను చాలా వరకు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. అనేక కొత్త నిబంధనలు అక్కడ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహిళల హక్కుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ దేశం ఆర్థికంగా, రాజకీయంగా చాలా అవస్థలు పడుతోంది. అయితే తాజాగా తాలిబన్లు దేశీయంగా ఓ సూపర్ కారును తయారు చేశారు. ఈ కారును తయారుచేసేందుకు వారికి సుమారు 5 సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఈ కారును జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

1905లో జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో ప్రారంభం అయింది. ఈ షో ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ షో. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వాహన తయారీదారులు ఈ షోలో తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతారు. తాలిబన్ల ప్రభుత్వం హయాంలో తయారైన సూపర్ కారును ఈ షోలో ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం ఖతార్‌లోని దోహాలో ఈ మోటార్ షో జరగనుంది.
తాలిబన్ల ప్రోటోటైప్ సూపర్ కారు Mada 9ను Entop సంస్థ తయారు చేసింది. ఈ సూపర్ కారును ఈ సంవత్సరం జనవరిలో తొలిసారిగా పరిచయం చేశారు. అయితే సూపర్ కారు వివరాలు బయటకు రాలేదు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 14 వరకు దోహాలో ఇంటర్నేషనల్ మోటార్ షో జరగనుంది. Entop వ్యవస్థాపకుడు మహమ్మద్ రెజా అహ్మది Mada 9 సూపర్ కారును షిప్పింగ్ కంటైనర్‌లో బయలుదేరిన వీడియోను షేర్‌చేశారు.

మడా 9 సూపర్ కారును షిప్పింగ్ చేసిన సమయంలో మహమ్మద్ రెజా అహ్మది చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సరిహద్దు గుండా ఈ కారు షిష్పింగ్ అయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కార్లను ఎగుమతి చేయకుండా అనేక నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ సమస్య పరిష్కారం అయినట్లు తెలుస్తోంది.
ఈ ఇంటర్నేషనల్ మోటార్ షోకు సూపర్ కారును తరలించినప్పుడు.. Entop సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ రెజా అహ్మది అనేక ఆర్థిక ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. కారును తరలించేందుకు తమవద్ద తగినన్ని డబ్బులు లేవని చెప్పినట్లు తెలిసింది. ఆయన మద్దతుదారుల్లో కొంతమంది సుమారు $1,00,000 సాయం చేసినట్లు సమాచారం.

దోహాలో జరగనున్న ఈ ప్రపంచస్థాయి మోటార్‌షోకు హాజరుకావడం తమ సంస్థకు చాలా ముఖ్యమని మహమ్మద్ రెజా అహ్మదీ తెలిపారు. ప్రస్తుతం ఈ సూపర్ కారు ప్రోటోటైప్‌గా ఉందని, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక సాయం అవసరం అని అహ్మదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రదర్శనకు హాజరుకావడం ద్వారా మాడా9 సూపర్‌కారును ఉత్పత్తి చేసిన మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు పెట్టుబడిదారులను కొనుగోనడంలో సాయపడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ మోటార్ షో... ఆప్ఘనిస్తాన్ ఆటోమొబైల్ రంగానికి ఎంతో కీలకమని ఎన్‌టాప్ వ్యవస్థాపకుడు మహమ్మద్ రెజా అహ్మదీ తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








