త్వరలో సందడి చేయనున్న మాట్లాడే కార్లు!

ఈ మేరకు శాస్త్రవేత్తలు జరుపుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. వాయిస్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధకులు మాట్లాడే కారుకు రూపకల్పన చేశారు. నిజానికి, వచ్చే ఏడాదే బ్రిటీష్ రోడ్లపై ఈ మాట్లాడే కార్లు పరుగులు తీయనున్నాయి. ఈ సిస్టమ్‌ను తయారుచేసిన వారు దీనిని 'సింక్' అని పిలుస్తారు. ఈ సిస్టమ్ ద్వారా డ్రైవర్ దగ్గర్లో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? లేదా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? వంటి ప్రశ్నలకు మీ కారు జవాబు చెబుతుంది.
ఫోర్డ్ ఫోకస్ ఈ వ్యవస్థను అందించనుంది. ఫోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాయిస్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ వ్యవస్థ 19 భాషల్లో 10,000 కమాండ్లను నిర్వహిస్తుంది. ఉదాహరణ మీ కారులో మ్యూజిక్ ప్లేయర్ సౌండ్ తగ్గించాలంటే మీరు చేతులు ఉపయోగించకుండా మీ కారుకు చెబితే సరిపోతుంది. ఎంచక్కా సౌండ్ తగ్గిపోతుంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఈ ఈ ప్రోడక్ట్‌ను ఫోర్డ్ అభివృద్ధి చేస్తోంది. దీని ధర దాదాపు 350 పౌండ్లు (సుమారు రూ. 25151.6)గా ఉంటుందని కంపెనీ తెలిపింది. మానవుడు హద్దులు లేకుండా అభివృద్ధి చేస్తున్న సాంకేతి పరిజ్ఞానంలో ఇదొక మైలురాయిగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








