ఖరీదైన ఆడి Q7 కారులో మిల్కీ బ్యూటీ తమన్నా.. విలాసవంతమైన జర్నీతో పాటు మరెన్నో లగ్జరీ ఫీచర్లు.!!

సినిమా ఇండస్ట్రీలో ఇన్నేళ్లయినా తరగని అందంతో, వరుస చిత్రాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. ఇటీవల చిరు బోళా శంకర్‌ సినిమాలో తన అందంతో మెప్పించిన మిల్కీ బ్యూటీ.. రజినీ కాంత్‌ జైలర్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈ క్రమంలో తమన్నాకు చెందిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

తమన్నా ఇటీవల ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు వచ్చి ఆడి Q7 కారు ఎక్కడాన్ని చూడవచ్చు. ఎయిర్‌ పోర్ట్‌ లోపల నుంచి బయటకు వచ్చి.. కారు ఎక్కే వరకు తమన్నా అందరికీ హాయ్‌ చెబుతూ ఫొటోగ్రాఫర్లకు పోజులివ్వడాన్ని చూడవచ్చు. ఇక లగ్జరీ కార్లలో ఒకటిగా ఉన్న ఈ Audi Q7 కారు గురించి తెలుసుకుందాం.

Tamannaah-Audi-Q7-Luxury-Car

ఆడి క్యూ7 భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 7 సీటర్‌ SUV. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 84.70 లక్షలుగా ఉంది. అదే సమయంలో ఆడి Q7 టాప్ వేరియంట్ ధర రూ. 92.30 లక్షలు పలుకుతోంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.

కాగా ఆడి Q7 మొత్తం 3 వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ 3 వేరియంట్లలో ఒకే ఇంజిన్ అందించారు. 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇంజిన్ 335 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది.

Tamannaah-Audi-Q7-Luxury-Car

తమన్నానే కాకుండా సినీ సెలబ్రిటీలు చాలా మందికి ఆడి Q7 కారు ఫేవరెట్‌గా ఉంది. కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, బిపాసా బసు, ఇమ్రాన్ హష్మీ, జాన్ అబ్రహం, కాజోల్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, అసిన్ సహా పలువురు ప్రముఖ నటులు ఆడి Q7 కారును కలిగి ఉన్నారు.

ఇటీవల బాలీవుడ్‌ బ్యూటీ బిపాసా బసు సైతం ఆడి Q7 కారులో తళుక్కుమంది. ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. డ్రైవ్‌స్పార్క్ తెలుగు సైట్ అందుకు సంబంధించిన వార్తను పాఠకులకు అందించింది. ఈ కారు ఖరీదైనది అయినప్పటికీ అందుకు అనుగుణంగా లగ్జరీ సౌకర్యాలను అందించారు.

Tamannaah-Audi-Q7-Luxury-Car

ఆడి Q7 లగ్జరీ SUV విలాసవంతమైన డ్రైవ్‌, జర్నీ అందిస్తుండటంతో దీనిని చాలా మంది ఇష్టపడతారు. ఇక తమన్నా విషయానికొస్తే, ఆమె వద్ద ఆడి Q7 మాత్రమే కాకుండా అనేక ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఖరీదైన కార్లే కావడం విశేషం. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, BMW 320i, Mercedes-Benz GLE మరియు మిత్సుబిషి పజెరో స్పోర్ట్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, November 9, 2023, 9:19 [IST]
English summary
Tamannaah bhatia spotted in audi q7 luxury car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+