డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

Written By:

రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్... ఈ కాలంలో చట్టాల్లో ఉన్న రూల్స్ సామాన్యుడికి మాత్రమే వర్తిస్తాయి... మహామహులకు ఎలాంటి రూల్స్ ఉండవు అని సగటు సాధారణ వ్యక్తి ఏదో ఒక సందర్భంలో నిట్టూరుస్తుంటాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

నిజమే, మన కళ్ల ముందరే తప్పు చేస్తూ, కళ్ల ముందర నుండే తప్పించుకుంటుంటారు. తమ పలుకుబడి, నేపథ్యం, ప్రస్థానం, డబ్బు లాంటి వాటిని అడ్డుపెట్టుకుని చట్టాన్ని చుట్టంలా వాడుకునే వారికి కొదవే లేదు. ఇలాంటి వాళ్లలో తమ తప్పులు బయటకు తెలియకుండానే, ఆ తప్పుల్లో నుంచి బయటకు వచ్చేస్తారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

తాజాగా చెన్నైలో జరిగిన ఓ సంఘటన తీసుకుంటే ఇందుకు పూర్తిగా భిన్నం. సినీ నటుడు అని తెలిసా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటి కథనాలు చూసినప్పుడు... కొన్ని సందర్భాల్లోనైనా చట్టం డబ్బున్నోళ్లకు బానిస కాదనిపిస్తుంది.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

చెన్నైలో అసలేం జరిగింది...?

హీరో జై సంపత్ మరియు కొంత మంది ఇతర సినిమా ఆర్టిస్టులు అర్ధరాత్రి 2 గంటల వరకు నుంగంబాక్కంలోని స్టార్ హోటల్ పార్టీ చేసుకున్నారు. ఉదయం రెండు గంటల తరువాత జై తన మిత్రులతో ఇందిరా నగర్‌లోని ఇంటికి బయలుదేరాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

పూర్తిగా మద్యం మత్తులో ఉన్న జై అడయార్ ఫ్లైఓవర్ మీద డివైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది, అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని చూస్తే, కారు నడిపిన జై మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

అడయార్ ప్లైఓవర్ మీద ప్రమాదానికి గురైన కారును ట్రాఫిక్ పోలీస్ స్వయంగా తొలగించారు. బ్రీజ్ అనలైజర్ ద్వారా ద్వారా జై మద్యం సేవించాడని నిర్దారించుకుని జై ను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు సెక్షన్ 185 మరియు మోటార్ వెహికల్ చట్టం 279 ప్రకారం అరెస్ట్ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

ఆ తరువాత, హీరో జై సంపత్‌ను బెయిల్ మీద విడుదల చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జై పోలీసులకు పట్టుబడటం ఇది మొదటిసారి కాదు. గతంలో 2014లో మద్యం మత్తులో చెన్నైలోని కాశి థియేటర్ వద్ద ప్రమాదం చేసిన కేసులో బుక్కయ్యాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తమిళ నటుడు జై అరెస్ట్

ఎక్కువ సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతుండటంతో జై సంపత్ డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

English summary
Read In Telugu: Tamil Actor Jai Arrested For Drunk Driving
Story first published: Friday, September 22, 2017, 12:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark