మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

తమిళ మరియు తెలుగు చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య, సినిమాలలో మంచి చేసే రీల్ హీరోగా మాత్రమే కాకుండా, నిజ జీవితంలో ప్రజలకు సాయం చేయడంలో కూడా రియల్ హీరోగా ఉంటాడు. ఆగమ్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వందలాది మంది పేద విద్యార్థులును ఉచితంగా చదివిస్తున్న సూర్య, తాజాగా తమిళనాడు పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కావల్‌ కరంగల్‌' (Kaaval Karanagal) అనే కార్యక్రమం కోసం ఆరు లక్షల రూపాయల విలువ చేసే మారుతి సుజుకి ఈకో వ్యాన్‌ను కానుకగా ఇచ్చారు.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

హీరో సూర్యకు చెందిన నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ (2D Entertainment) తమిళనాడు పోలీసు శాఖ నిర్వహిస్తున్న ‘కావల్ కరంగల్' కార్యక్రమం కోసం రూ.6 లక్షల విలువైన ఈ వాహనాన్ని అందించింది. నిరాశ్రయులకు, నిరుపేదలకు మరియు అవసరమైన వారికి సహాయం అందించాలనే లక్ష్యంతో తమిళనాడు పోలీసులు ‘కావల్ కరంగల్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ, పలు NGO లతో కలిసి, వీధుల్లో నివసిస్తున్న నిస్సహాయులు మరియు నిరుపేదలకు సహాయం అందిస్తుంది.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

సూర్యకి చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ విరాళంగా ఇచ్చిన ఈ మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) వాహనం నిరాశ్రయులకు మరియు నిరుపేదలకు ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుందని సమాచారం. ఈ వాహనాన్ని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్, చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్, శరణ్య రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. సూర్య ఇప్పటికే తన ఆగమ్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

తాజాగా, నిరుపేదల కోసం తమిళనాడు పోలీసులు నిర్వహిస్తున్న కావల్ కరంగల్ కార్యక్రమంలో భాగంగా, తనవంతు సాయంగా మారుతి ఈకో వ్యాన్‌ను అందించడంతో హీరో సూర్యపై నెటిజన్లు, ప్రజలు ప్రశంసలు తెలియజేస్తున్నారు. తమిళనాడులో కావల్ కరంగల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చెన్నై ఎగ్మోర్‌లోని రాజరత్నం స్టేడియంలో దీనికి సంబంధించిన వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఈ కారును విరాళంగా ఇచ్చింది.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

హీరో సూర్య కుటుంబం సందర్భం ఏదైనా సరే అవసరమైన వారిని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ స్టార్ హీరో కుటుంబం కేవలం పకృతి విపత్తుల సమయంలోనే కాదు, మిగిలిన అన్ని సమయాల్లో కూడా అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూనే ఉంటుంది. ఆగమ్ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే కొన్ని వేల మంది నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తోంది. సూర్య తండ్రి శివకుమార్‌, తమ్ముడు కార్తీలు కూడా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటారు.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

ప్రస్తుతం, మత్స్యకారుల నేపథ్యంతో బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం భారీగా ఖర్చు చేసి, అచ్చం మత్స్యకారుల ఇళ్లను పోలి ఉండేలా ఓ భారీ సెట్ కూడా వేశారు. సాధారణంగా షూటింగ్‌ పూర్తియిన ఇలాంటి సెట్లను మరియు ఇళ్లను కూల్చి వేస్తుంటారు. అయితే, సూర్య మాత్రం అలా చేయనీయకుండా, ఆ ఇళ్లను ప్రస్తుతం ఇళ్లులేని మత్స్యకారులకు ఇచ్చేయాలని నిర్ణయించారు. దీంతో సూర్య తీసుకున్న నిర్ణయంపై సదరు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) గురించి క్లుప్తంగా..

మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివి విషయానికి వస్తే, ఇది దేశంలోని ప్రైవేట్ మరియు వాణిజ్య వాహన వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది. ఈకో ఎమ్‌పివిని కంపెనీ మొట్టమొదటిసారిగా 2010 లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది దేశంలో ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే 1 లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి రికార్డు కూడా సృష్టించింది. ప్రస్తుతం, దేశంలో 7 లక్షలకు పైగా మారుతి సుజుకి ఈకో వాహనాలు తిరుగుతున్నాయి.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

మారుతి సుజుకి ఈకో ప్యాసింజర్ వాహన విభాగం కన్నా, వాణిజ్య ఉపయోగంలో ఎక్కువగా పాపులర్ అయింది. సరుకు రవాణా కోసం ఇది అనువైన వాహనంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మారుతి సుజుకి 2015లో ఇందులో వాణిజ్య వినియోగం కోసం ఈకో కార్గో అనే వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ వేరియంట్ విడుదలతో మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇది ప్రైవేట్ కస్టమర్లకు ఐదు లేదా ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

కాగా, వాణిజ్య ఉపయోగం కోసం మారుతి సుజుకి తమ ఈకో వాహనాన్ని కార్గో మరియు అంబులెన్స్ రూపంలో కూడా విక్రయిస్తోంది. దేశీయ మార్కెట్లో ఈకో ధరలు రూ.4.63 లక్షల నుండి రూ.7.63 లక్షల వరకూ ఉన్నాయి. మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలెర్ట్ కొత్త భద్రతా నిబంధనలకు సంబంధించిన అవసరమైన అన్ని భద్రతా ఫీచర్లు ఉంటాయి.

మరోసారి తమ సహృదయం చాటుకున్న స్టార్ హీరో.. కావల్‌ కరంగల్ కోసం మారుతి ఈకో గిఫ్ట్..

ఇంజన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిలో 1.2-లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 72 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. సిఎన్‌జి మోడ్‌లోని ఇంజన్ 61 బిహెచ్‌పి శక్తిని మరియు 85 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి మోడ్‌లో ఈకో కిలోకు 20.88 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా పెట్రోల్ వెర్షన్ లీటరుకు 16.11 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సర్టిఫై చేయబడింది.

Article Published On: Wednesday, April 27, 2022, 16:44 [IST]
English summary
Tamil actor surya donates maruti suzuki eeco to kaaval karangal intiative by tn police
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+