బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

సాధారణంగా చాలా మందికి బైకులంటే చాల ఇష్టం. ఇందులో కూడా ప్రత్యేకంగా సెలబ్రెటీలకు మరియు సొసైటీలో బాగా ప్రసిద్ధి చెందిన వారికీ లేదా బాగా డబ్బున్న ధనవంతులకు మంచి లగ్జరీ బైకులను కలిగి ఉంటారు. బైక్స్ మరియు కార్ల పట్ల అజిత్‌కు ఉన్న అభిరుచి అందరికీ తెలిసిందే.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

'వాలిమై' షూటింగ్ లో బిజీగా ఉన్న హీరో అజిత కుమార్ ఇటీవల ఒక కొత్త బైక్ పై కనిపించారు. ఇక్కడ అజిత్ ఈ బైక్ పై కూర్చున్న ఫోటో కూడా విడుదలైంది. నివేదికల ప్రకారం, అజిత్ సిక్కిం పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు తీయబడ్డాయని తెలుస్తోంది. అజిత్ కుమార్ బైక్ రైడ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

ఇతడు ఇంతకు ముందు కూడా చాలా సార్లు బైక్ మీద ప్రయాణించిన చాలా సంఘనటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సారి అజిత్ ఉపయోగించిన బైక్ అతని అభిమానులలో ఒక కొత్త ఉత్సుకతను కలిగించింది. ఇక్కడ అజిత్ ఉపయోగించిన బైక్ బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ అడ్వెంచర్ బైక్‌గా గుర్తించబడింది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి లేదు. ఈ బైక్ అమ్మకాలను కంపెనీ 2020 ఏప్రిల్ నెలలోనే అమ్మకాలను నిలిపివేసింది. అయితే ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ అడ్వెంచర్ బైక్ దేశీయ మార్కెట్లో స్టాండర్డ్, ప్రో మరియు డైనమిక్ ప్లస్ అనే మూడు మోడళ్లలో లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ యొక్క మూడు మోడళ్లలో 1170 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 125 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరు పెట్రోల్‌కు 16 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ చూడటానికి భారీగా ఉండటమే కాకూండా చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్ యొక్క స్టాండర్డ్ ధర రూ. 17.25 లక్షలు కాగా, ప్రో వేరియంట్‌ ధర రూ. 20.95 లక్షల వరకు ఉంటుంది. ఇక చివరగా డైనమిక్ ప్లస్ వేరియంట్‌ ధర రూ. 21.30 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు ఎక్స్ షోరూమ్ ప్రకారం నిర్దేశించబడినవి.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

హీరో అజిత్ కుమార్ ఈ ఖరీదైన బైక్ డ్రైవ్ చేసారు. కానీ బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ అడ్వెంచర్ బైక్‌ యొక్క ఏ మోడల్‌ను డ్రైవ్ చేసారు అనేది ఖచ్చితంగా తెలియదు. సాధారణంగా ఈ బైక్‌లో 30 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంది. కావున సుదూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీనితో పాటు డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ కూడా అందించబడింది. ఈ బైక్ గంటకు 200 కిమీ వేగంతో ప్రయాణించగలదు. ఈ బైక్ కేవలం 3.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌పై కనిపించిన హీరో అజిత్

బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ బైక్‌లో డ్యూప్లెక్స్ టైర్లు, ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం అజిత్ యొక్క బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ అడ్వెంచర్ బైక్ రైడింగ్ యొక్క ఈ ఫోటోలు సోషల్ వెబ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి.

NOTE: ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Tamil Actor Thala Ajith Seen With Bmw R1200 GS Adventure Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X