ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

భారతదేశంలో ఎన్నికల వేడి చాలా జోరుగా ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల అనేక పార్టీల మధ్య చాలా హోరాహోరీగా జరుగుతోందనే విషయం బాగా స్పష్టమవుతోంది. నిన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, కావున తమిళనాట ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్

తమిళ్, తెలుగు భాషలలో ఎన్నో సినిమాలలో నటించి ఎక్కువ సంఖ్యలో అభిమానులు కలిగి ఉన్న విజయ్, తన ఓటు వేయడానికి తన ఇంటి నుంచి సైకిల్ పై వచ్చాడు. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలామంది సెలబ్రెటీలు తమ లగ్జరీ కార్లలో వచ్చారు, కానీ విజయ్ చాలా సాధారణంగా సైకిల్ పై రావడం చర్చనీయాంశమైంది.

ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్

రోల్స్ రాయిస్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 వంటి అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నప్పటికీ విజయ్ ఎందుకు ఇలా చేసాడో చాలామందికి తెలియరాలేదు. అయితే నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను అమాంతం పెంచడం వల్ల సామాన్యప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి వ్యతిరేకంగానే విజయ్ సైకిల్ పై వచ్చాడని తెలిసింది.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్ కొనుగోలుచేసిన కన్నడ నటి కారుణ్య రామ్

ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్

ఇదే కాకుండా పోలింగ్ బూత్ తన ఇంటికి సమీపంలోనే ఉండటం వల్ల, అందులోనూ అక్కడ రోడ్డు కొంచెం ఇరుకుగా ఉండటం వల్ల కారులో కాకుండా సైకిల్ పై వచ్చినట్లు కొంతమంది భావిస్తున్నారు. వెళ్ళేటప్పుడు విజయ్ కట్టుదిట్టమైన భద్రత చర్యలతో ఓటు వేయడానికి వెళ్ళాడు. అదే సమయంలో అభిమానుల సెల్ఫీలకు కూడా పోజులిచ్చాడు.

ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్

అయితే విజయ్ చేసిన ఈ పనిని చాలామంది ఖండిస్తున్నారు. విజయ్ కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నాడని మండిపడ్డారు. విజయ్ తన ఇంటి నుంచి వేగంగా సైకిల్ పై రావడ మీరు వీడియోలో చూడవచ్చు.

MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇంధన ధరలను పెంచినట్లు తెలిపింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువ చేయాలనే సంకల్పముతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేసి వారికీ ఇప్పుడు అనేక డిస్కౌంట్స్ కూడా కల్పిస్తున్నారు.

ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్

నటుడు విజయ్ అత్యంత ఎక్కువమంది అభిమానులు కలిగి ఉన్న నటులలో ఒకరు. అంతే కాకూండా దక్షిణ భారతదేశంలోని అగ్ర కథానాయకులలో ఒకరుగా ఉన్నారు. ఇతడు అనేక లగ్జరీ కార్స్ కలిగి ఉన్నాడు. విజయ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, మినీ కూపర్ ఎస్, ఆడి ఎ 8, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు ఎక్స్6 వున్నాయి.

MOST READ:ఈ టిప్స్ వాడండి, వాహన దొంగతనాలకు చెక్ పెట్టండి

Most Read Articles

English summary
Tamil Actor Vijay Goes To Election Booth Through Bicycle. Read in Telugu.
Story first published: Wednesday, April 7, 2021, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X